prajalu1,30,000  కోట్లు దాటిన బడ్జెట్‌ 

‘బంగారు తెలంగాణ’ సాకారం చేసే దిశగా, ప్రజల ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి ఈటల రాజేందర్‌ మార్చి 14న శాసనసభలో 2016-17 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్‌ ముచ్చటగా మూడవసారి శాసనసభలో బడ్జెట్‌ సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రవేశపెట్టిన మూడవ బడ్జెట్‌ అయినప్పటికీ, పూర్తి సమాచారంతో, సమగ్ర అధ్యయనంతో, వాస్తవాల ఆధారంగా రూపొందించిన తొలి బడ్జెట్‌ ఇది అని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా సాగు నీరు , తాగునీరు , సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూనే, మిగతా రంగాలకు ఈ బడ్జెట్‌లో సముచిత స్థానం కల్పించారు. మొత్తం 1,30,415.87 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్‌లో తొలిసారిగా సాగునీటి రంగానికి భారీగా 25,000 కోట్ల రూపాయలు కేటాయించడం ఓ రికార్డు. అలాగే, తొలిసారిగా ప్రణాళికేతర వ్యయంకంటే, ప్రణాళికావ్యయం అధికంగా ఉండటం మరో విశేషం.

శాసనసభలో ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టగా, శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బడ్జెట్‌ సమర్పించారు.

Other Updates