నేడు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అద్భుతమైన అవకాశం ఆర్థిక మంత్రిగా నాకు కలిగినందుకు గర్విస్తున్నాను. అధ్యక్షా! తెలంగాణ కొత్త రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అణగారిన తెలంగాణ ప్రజలు సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న రాష్ట్రం. గతం మిగిల్చిన అన్యాయాల అవశేషాలు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఉండే ప్రారంభ సమస్యలు, బలాలు, బలహీనతలు, ఆటంకాలు, అవరోధాలు, కేంద్రసాయంపై అందని అంచనాలు ఇన్ని పరిమితులను అధిగమిస్తూ 2014`15 సంవత్సరం పది నెలల కాలానికి, ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేటట్టు సాహసోపేతమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది. ఆ బడ్జెట్ ప్రజల మన్నన పొందింది. పరిపాలనలో మా మార్గమేమిటో, మాకు ప్రజల సంక్షేమంపట్ల, అభివృద్ధిపట్ల ఉన్న పట్టింపేమిటో తెలంగాణ ప్రజలకు వెల్లడైంది.
ఈ రోజు నేను ప్రవేశపెడుతున్నది పూర్తి అవగాహనతో, స్పష్టతతో, సమన్వయంతో రూపొందించిన 2015`16 సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్. ఈ రెండు బడ్జెట్‌లను ప్రవేశపెట్టే అరుదైన గౌరవాన్ని నాకు కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె. చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారి సమగ్ర దృక్పథం, దార్శనికత అందించిన వెలుగులోనే బడ్జెట్ రూపొందిందని తమ ద్వారా సభకు తెలియజేస్తున్నాను.
ఆర్థిక మంత్రి ఈటల బడ్జెట్ ప్రసంగ సంగ్రహం..
అధ్యక్షా! బడ్జెట్ అంటే చిట్టా పద్దుల పట్టికకాదు. జీవంలేని అంకెలు, సారంలేని గణాంకాలు కాదు. ుష్ట్రవ దీబసస్త్రవ్ ఱం అశ్‌ీ jబర్ a షశీశ్రీశ్రీవష్‌ఱశీఅ శీట అబఎపవతీం, పబ్ aఅ వఞజూతీవంంఱశీఅ శీట శీబతీ ఙaశ్రీబవం aఅస aంజూఱతీa్‌ఱశీఅం.
బడ్జెట్ అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, వారి కళ్ళల్లో తొణికిసలాడుతున్న కలలు. వారి ఆశలని, ఆకాంక్షలని నిజంచేసే నిర్మాణాత్మకమైన ప్రణాళిక. ప్రజాధనాన్ని ప్రజల నిజమైన అభివృద్ధికోసం వెచ్చించే గంభీరమైన, బాధ్యతాయుతమైన ప్రక్రియ. ఈ బడ్జెట్ తెలంగాణ నెలకొల్పిన సామాజిక విలువల ఆధారంగా రూపొందించిన సజీవ ఆర్థిక ప్రణాళిక అని తమరిద్వారా సభకు తెలియజేస్తున్నాను.
అధ్యక్షా!
ఇటీవల 14వ ఆర్థికసంఘం నివేదిక ఒక చారిత్రక సత్యాన్ని ఋజువు చేసింది. దేశంలో గుజరాత్, తెలంగాణ రెండు రాష్ట్రాలను మిగులు (Rవఙవఅబవ ూబతీజూశ్రీబం) రాష్ట్రాలుగా గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికలోటు ఎదుర్కొంటున్న రాష్ట్రంగా ప్రకటిం చింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిధులు మళ్ళింపునకు గురైనాయని, ఉద్దేశపూర్వకమైన వివక్షే తెలంగాణ ఉసురు తీసిందని ఈ నివేదిక పరోక్షంగా మరోసారి రుజువు చేసింది.
అధ్యక్షా! నేడిది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ప్రజలు స్వాభిమానంతో తమ భవిష్యత్తును తామే నిర్మించుకునే సత్తా పొందిన స్వరాష్ట్రం. ఇవాళ ఈ నేలమీద ఉత్పత్తి అయ్యే సంపద, ఇక్కడి ప్రజలు చెమటోడ్చి సృష్టించిన ప్రతిపైస తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసమే వెచ్చించే చరిత్రాత్మకమైన గొప్ప అవకాశం, అధికారం మనం సాధించుకు న్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రిగారి మహోన్నత నాయకత్వంలో తెలంగాణ ప్రజలు సృష్టించిన అపూర్వమైన సందర్భమని సభ్యులకు విన్నవించుకొంటున్నాను.
ఎవరైతే కాయలు కాసిన భుజాలమీద ఉద్యమభారాన్ని మోసినారో, ఎవరైతే క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి ఆకాంక్షలను, అవసరాలను అర్థం చేసుకున్నారో, ఎవరు ప్రజలను ఒక్క తాటిమీద నడిపించినారో, ఎవరు త్యాగాలకు వెనుదీయకుండా యుద్ధరంగంలో ముందుండి నడిచినారో, ఎవరు పోరాటాన్ని విజయతీరానికి చేర్చి గమ్యాన్ని ముద్దాడి నారో, వారి నేతృత్వంలోనే ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణను ఆశించిన స్థాయిలో అభ్యుదయ పథంలో నడిపించేందుకు నిజాయితీగా రూపొందించిన ఆర్థిక ప్రణాళికల సారం ఈ బడ్జెట్. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తుకోసం, అట్టడుగువర్గాల నిజమైన అభివృద్ధికోసం రూపొందించిన పథకాల సమాహారమే ఈ బడ్జెట్.
గత పది నెలల తాత్కాలిక బడ్జెట్‌లోనే తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసింది. బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లుగా 481మంది తెలంగాణా అమరవీరులకు రూ. 48.10 కోట్లు సహాయంగా అందించింది. తెలంగాణ సాధనలో తమ ప్రాణాలు తృణప్రాయంగా ధారవోసిన అమరవీరులకు ఈ సందర్భంగా జోహార్లు పలుకుతూ వారి త్యాగం ముందు వినమ్రంగా తలవంచి నివాళులర్పిస్తున్నాను.
ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత ప్రభుత్వ ప్రాధాన్యతలతో హామీ పడ్డట్టుగానే ఎన్ని కష్టాలున్నప్పటికీ, 35,56,678మంది రైతులకు సంబంధించిన 17,000 కోట్ల రూపాయలలో 2014`15 సంవత్సరంలో 4,250 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేశాము. అంతేకాక, 16,214.52 కోట్ల రూపాయల కొత్త ఋణాలు 31,24,375మంది రైతులకు బ్యాంకుల ద్వారా ఇప్పించింది మా ప్రభుత్వం. తెలంగాణ రైతాంగానికి ఎంతోకాలంగా న్యాయంగా రావలసిన ఇన్‌పుట్ సబ్సిడీ 480.43 కోట్ల రూపాయలు ఒకే విడతలో చెల్లించి మా ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు కట్టుబడిన ప్రభుత్వం అని నిరూపించింది. అదేవిధంగా ఎర్రజొన్నల రైతులకు న్యాయంగా చెల్లించాల్సిన 11.50 కోట్ల రూపాయల బకాయిలను కూడా చెల్లించాం.
షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 3 సంవత్సరాలుగా చెల్లింపజాలని బకాయిలు రూ. 484 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. 33,15,000 నిరుపేద కుటుంబాలకు ఆసరా పింఛన్లు ఇచ్చింది. 11లక్షలమంది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా 2045 కోట్ల రూపాయల గత సంవత్సరపు స్కాలర్‌షిప్ బకాయిలు ప్రభుత్వం చెల్లించింది. ఇంతేగాక, పలు క్రొత్త పథకాలు పెళ్ళికాని ఆడబిడ్డల కోసం ‘కల్యాణలక్ష్మి’, భూమిలేని నిరుపేద షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల రైతులకోసం భూమి కొనుగోలు పథకం, మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌లకు రూపకల్పనచేసి వాటిని అమలు చేయడానికి నిధులను సమకూర్చింది.
ప్రాధాన్యత క్రమంలో సంక్షేమానికి మా ప్రభుత్వం ప్రథమస్థానం ఇచ్చింది. ఇంతేకాకుండా ఏళ్ళ తరబడి పెండిరగ్‌లోవున్న అన్ని సవాళ్ళను పరిష్కరించే విధంగా రాష్ట్ర బడ్జెట్‌ను ఏర్పాటు చేసి ఖర్చు చేయడం ప్రారంభించింది. తెలంగాణా రాష్ట్రంలోని రోడ్లు గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రతిబింబాలు. వీటినన్నింటినీ తక్షణమే బాగు చేయడానికి మా ప్రభుత్వం రోడ్లు మరియు భవనాలశాఖకు 11098.33 కోట్ల రూపాయలను, పంచాయతీరాజ్‌శాఖకు 3,722 కోట్ల రూపాయలను మంజూరుచేసి పనులు ప్రారంభించింది.
దీనితోపాటుగా మండల కేంద్రాలను మరియు జిల్లా కేంద్రాలను కలిపే రోడ్లను భవిష్యత్ అవసరాలను తీర్చేవిధంగా 2 మరియు 4 లైన్ల స్థాయికి పెంచడానికి నిర్ణయించాము. తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత దీనస్థాయికి దిగజార్చినటువంటి విద్యుత్‌రంగాన్ని సంస్కరించేందుకు తొలి అడుగులు పడ్డాయి.
నిర్లక్ష్యానికి గురయిన రాష్ట్ర రోడ్డురవాణాసంస్థను అభివృద్ధిచేసే క్రమంలో 400 కోట్ల రూపాయలను మంజూరు చేశాము. కొత్త బస్సులు కొనుగోలు చేయడమే కాకుండా సంస్థాగత సమస్యలన్నింటినీ పరిష్కరించే ప్రక్రియ మొదలయింది.
గతంలో కేంద్ర గ్రాంట్ల తీరునుబట్టి, 2014`15 సంవత్సరపు కేంద్ర బడ్జెట్‌ను అనుసరించి రాష్ట్ర బడ్జెట్‌లో కేంద్ర గ్రాంట్ల అంచనాలు చేర్చాము. కాని కేంద్రం నుండి రావాల్సిన నిధులు బాగా తగ్గాయి. అంచనాల ప్రకారం అవి అంది ఉంటే రాష్ట్ర ఆదాయ వ్యయాలను మరింత సమర్థవంతంగా నిర్వహించగలిగేవాళ్ళం. రాష్ట్ర బడ్జెట్‌లో 2014`15 సంవత్స రానికి కేంద్రం నుండి రావాల్సిన ప్రణాళికా సహాయం 11,781 కోట్ల రూపాయలు. కాని 2015 ఫిబ్రవరి వరకు కేవలం 4,147 కోట్ల రూపాయల నిధుల సహాయం మాత్రమే అందింది. కేంద్రం నుండి అందాల్సిన ప్రణాళికేతర గ్రాంట్లు రూ. 9,939 కోట్ల రూపాయలలో 2015 ఫిబ్రవరి నెల వరకు కేలం 1,346 కోట్ల రూపాయలు మాత్రమే అందాయి. అంటే ప్రతిపాదించిన మొత్తంలో 14 శాతం మాత్రమే అందాయి.
ఎఫ్.ఆర్.బి.ఎమ్. (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) చట్టం కింద కొంతమేరకు అప్పు తెచ్చుకొనే అవకాశం రాష్ట్రాలకు ఉంటుంది. అలా అప్పు తెచ్చుకునే పరిమితిని సడలించి మరో 4,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొనేందుకు రాష్ట్రానికి అవకాశం కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరాము. అప్పు పరిమితిని సడలించే అంశంపై కేంద్రం నుండి ఇంతవరకు ఏ సమాధానమూ రాలేదు. కేంద్రం నుండి రావాల్సిన ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల్లో తరుగు, సి.ఎస్.టి. పరిహారం మరియు ప్రత్యేక ఆర్థిక సహాయం రాకపోవడం, ఋణపరిమితి పెంపును సడలించకపోవడం వంటివి అన్నీ కలిపితే మన ఆదాయ వనరుల్లో 20,227 కోట్ల రూపాయల లోటు ఏర్పడుతున్నది. ఈ లోటుకు కారణమైన అంశాలేవీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనివి కావు. దానికితోడు కేంద్ర ప్రణాళికా నిధుల కేటాయింపుపై రాష్ట్రానికి చాలా ఆలస్యంగా 2015 ఫిబ్రవరి చివరిలో సమాచారం అందింది.
వ్యాట్, భూమి క్రమబద్ధీకరణలు మినహా 2014`15లో సమర్పించిన ఓన్`టాక్స్ (ూూుR), ఓన్`నాన్ టాక్స్ (చీుR) ఆదాయాలు దాదాపుగా గాడిలో ఉన్నాయి. భూమి క్రమబద్ధీకరణ పథకానికి ప్రజలనుండి మంచి స్పందన వచ్చింది. ఈ పథకంలో భాగంగా 3.36 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గౌరవ ముఖ్యమంత్రిగారి అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశ నిర్ణయాలమేరకు, 125 చదరపు గజాలలోపు ప్లాటు గలవారికి తమ ప్లాట్లు క్రమబద్ధీకరించుకునేందుకు ఎటువంటి రుసుము/జరిమాన చెల్లించనక్కరలేదని ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇటువంటి చిన్న ప్లాట్లలో ఉన్నవారు పేదవారై ఉంటారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. పేద ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ విధానము. ఒక అంచనా ప్రకారం క్రమబద్దీకరణ ఫలితంగా పేదలకు కనీసపక్షం ముప్ఫైవేల కోట్ల రూపాయల ప్రయోజనం చేకూరుతున్నది. భూమిపై అధికారిక యాజమాన్యంలేక, అమ్మలేక, కొనలేక అనిశ్చితిలో ఉన్న లక్షలమందికి ఇది ఊరట. పేదల సంక్షేమంతోపాటు అనిశ్చితికి తెరదించడానికి భూమి క్రమబద్ధీకరణ ఒక విప్లవాత్మక ముందంజ.
అఖిలభారత సర్వీసు అధికారులను రాష్ట్రానికి కేటాయించడంలో తీవ్ర జాప్యం జరిగింది. తుది కేటాయింపులు గత వారంలో మాత్రమే జరిగినాయి. రాష్ట్రస్థాయి సిబ్బంది విభజన కూడా ఇంకా పూర్తి కాలేదు. ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.లు, ఇతర సిబ్బంది తక్కువగా ఉండడంవలన కొత్త రాష్ట్రంలో విధుల నిర్వహణ కష్టతరంగా మారింది. సిబ్బంది కొతర వల్ల ఒక్కో అధికారి రెండు మూడు శాఖలను నిర్వహించాల్సి వచ్చింది. దీనివలన ప్రభుత్వం నిర్ణయాలను తీసుకోవడంలో, అమలు చేయడంలోనూ జాప్యం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అతి తక్కువ సమయంలో అవసరమైన అన్ని చోట్లా సిబ్బందిని నియమించగలిగాము. కార్యనిర్వాహక యంత్రాంగాన్ని గాడిలో పెట్టగలిగాము. ఇందుకు సహకరించిన అధికారులను వారి వెన్నంటి ఉన్న సిబ్బంది అందరినీ ఈ సందర్భంగా సభాముఖంగా అభినందిస్తున్నాను.
2014`15 సంవత్సర బడ్జెట్ తయారీలో కూడా ఈ కారణాలవల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైన వాస్తవాన్ని గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి. కొత్త రాష్ట్ర నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను మనసులో పెట్టుకొని మాత్రమే ప్రభుత్వ నిర్వహణాతీరు గురించి ఒక అంచనాకు రావాలని గౌరవ సభ్యులను కోరుతున్నాను. ప్రజల అవసరాలను, ప్రాధాన్యతలను గుర్తెరిగి ఇంత తక్కువ సమయంలోనూ చురుకుగా నిర్ణయాలు తీసుకుని ప్రజా పాలనను గాడినపెట్టిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది.
తెలంగాణకు ఉన్న ఆదాయ వనరులను ఇతర ప్రాంతాలకు మళ్లించడంవల్ల తెలంగాణ తిరోగమనం పాలయ్యింది. తెలంగాణకు ఎంతో ఆదాయం ఉన్నా, దానిని ఇక్కడ వ్యయం చేయలేదు. తెలంగాణ వనరులవాటా కంటే, వ్యయం వాటా చాలా తక్కువగా ఉండేది. కేంద్ర ప్రభుత్వం నియమించిన లలిత్ కమిటీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను సైతం పక్కనపెట్టి నిరాటంకంగా నిధుల మళ్లింపు కొనసాగించారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను ఉమ్మడి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఖర్చు చేశారు. నిధుల కేటాయింపుల్లో దారుణంగా అన్యాయం జరిగిందన్న టీ.ఆర్.ఎస్. వాదన అక్షరాలా నిజమని 14వ ఆర్థికసంఘం నివేదిక తేటతెల్లం చేస్తున్నది.
ఇది గతం. ఇకనుంచి మన ప్రభుత్వంలో మన నిధులు మనకే. ఒకనాడు రాజుల సొమ్ము రాళ్ల పాలయ్యింది. ప్రజల సొమ్ము పాలకుల పాలయ్యింది. కాని ఇకనుంచి ప్రజల సొమ్ము ప్రజలకే. తెలంగాణ ప్రజలసొమ్ము తెలంగాణ ప్రజలకే చెందుతుంది.
ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థ. 14వ ఆర్ధిక సంఘం తన నివేదికను ఇటీవలే భారత రాష్ట్రపతికి సమర్పించింది. 2015`16 నుంచి 2019`20 వరకు అయిదేండ్ల కాలానికి వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పంపకం చేయనున్న పన్నుల వాటాను, మంజూరు చేయనున్న నిధుల వివరాలను, ఇందుకు ఆర్థిక సంఘం అనుసరించిన విధి విధానాలను ఈ నివేదికలో వివరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయ వ్యయాల ధోరణినిబట్టి వేసిన అంచనా ప్రకారం, 2015`16 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తలసరి సొంత ఆదాయం 11,872 రూపాయలుకాగా, రెవిన్యూ వ్యయం 18,281 రూపాయలు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం తలసరి సొంత ఆదాయం 16,274 రూపాయలు కాగా, రెవిన్యూ వ్యయం 16,042 రూపాయలు మాత్రమే. తెలంగాణలోని మిగులు ఆదాయ వనరులను ఆంధ్రప్రదేశ్‌కు మళ్లించి ఖర్చు చేశారన్నది దీనివల్ల స్పష్టం అవతున్నది.
స్థూల ఆర్థిక స్థితిగతులు
రాష్ట్ర బడ్జెట్ సమర్పించడానికంటే ముందు, గౌరవ సభ్యులకు, మన రాష్ట్ర స్థూల ఆర్థిక స్థితిగతులను వివరించడం సముచితం అని నేను భావిస్తున్నాను.
శ్రీ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి 2011`12 సంవత్సరం నుండి కుంటుపడిరది. 2004`09 సంవత్సరాలలో 12.87 శాతంగా ఉన్న సగటు వార్షికాభివృద్ధి 2012`13 నాటికి 4.1 శాతానికి పడిపోయింది. 2014`15 ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతం ఆర్థికాభివృద్ధి ఉండవచ్చునని అంచనా. రుతుపవనాలు ఆలస్యంగా రావడం, వర్షపాతం తక్కువగా ఉండడం వ్యవసాయరంగాన్ని నిస్తేజం చేశాయి. నైరుతి రుతుపవనాలవల్ల కురిసిన వర్షాలు, సాధారణ వర్షపాతంకంటే 30 శాతం తక్కువగా కురిశాయి. గత సంవత్సరం కురిసిన వర్షాలతో పోలిస్తే ఇది సగం కూడా కాదు (42 శాతం). కాలం కలిసి రానందువల్ల వ్యవసాయ రంగం అనుకున్నంత పుంజుకోలేదు. ఈ రంగం అభివృద్ధి పదిశాతం తగ్గిపోయింది.
శ్రీ పారిశ్రామిక, సేవారంగాలు నిలదొక్కుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆశలకు జీవం పోస్తున్నది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరగుదలలో సేవా, పారిశ్రామిక రంగాలదే ప్రధాన వాటా. సేవారంగంలో అభివృద్ధి గత సంవత్సరం (2013`14) 5.3 శాతం కాగా, 2014`15 సంవత్సరంలో అది 9.7 శాతానికి పెరిగింది. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి గత సంవత్సరం 0.1 శాతం కాగా ఈ ఏడు అది 4.1 శాతానికి చేరింది. జాతీయస్థాయిలో ఆర్థికరంగ పురోగమనానికి తోడు రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల 2015`16 సంవత్సరంలో ఆర్థికవృద్ధి ఆశాజనకంగా ఉండగలదని భావిస్తున్నాను.
శ్రీ బడ్జెట్ రూపకల్పనలో అన్ని నిర్ణయాలకూ తెలంగాణా రాష్ట్ర ప్రజల శ్రేయో సంక్షేమాలే గీటురాయి. ఈ స్ఫూర్తితోనే ప్రభుత్వం మూడు ప్రాథమ్యాలను గుర్తించింది. ఇందులో మొట్టమొదటిది బలహీనవర్గాల సంక్షేమం. మన జనాభాలో ఎక్కువమంది ఆధారపడి ఉన్న రంగం వ్యవసాయరంగం. వ్యవసాయ అనుబంధ రంగాల వికాసం రెండవది. పారి శ్రామికరంగ అభివృద్ధి మూడవది. ఈ మూడు ప్రాథమ్యాలు మాత్రమే కాదు. మా ప్రభుత్వ సిద్ధాంతాలు కూడా.
శ్రీ 2014`15 సంవత్సరంలో కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్ల మొత్తాన్ని రూ. 3,14,814 కోట్ల నుండి 2015`16 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1,80,293 కోట్లకు తగ్గించింది. తదనుగుణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రణాళిక నిధులు 2014`15 బడ్జెట్ అంచనా రూ. 11,781 కోట్లతో పోలిస్తే 2015`16 ఆర్థిక సంవత్సరానికి రూ. 6,497 కోట్లు మాత్రమే. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే నిధుల శాతం తగ్గించినప్పటికీ మా ప్రభుత్వం అధిక మొత్తంలో ప్రణాళిక వ్యయాన్ని ప్రతిపాదిస్తుంది.
శ్రీ కేంద్ర ప్రభుత్వం తన 2015`16 బడ్జెట్ ప్రతిపాదనలలో జి.డి.పి.లో 3.9 శాతం ద్రవ్యలోటుగా చూపిస్తూ రాష్ట్రాలకు వారి జి.ఎస్.డి.పి.లో 3 శాతానికి ద్రవ్యలోటును పరిమితం చేయడం విచిత్రమైన విషయం. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలలో బారోయింగ్ లిమిట్‌ను కొన్ని నిబంధనలకు లోబడి జి.ఎస్.డి.పి.లో 3.5 శాతానికి పెంచినప్పటికీ, నేటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సుపై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు.
వెయ్యి మైళ్ల దూరాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని మొదటి అడుగుతోనే ప్రారంభించాలి’ అన్నది లోకోక్తి. ‘బంగారు తెలంగాణ’ను సాధించే క్రమంలో మా ప్రభుత్వం అనేక వ్యయప్రయాసలు ఉన్నప్పటికీ దృఢగా, వడివడిగా ప్రయా ణం ప్రారంభించింది. మా ముఖ్యమంత్రిగారు గమ్యాన్ని చేరుకొనేవరకు ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ వెనుతిరిగి చూడరు. ఇది చరిత్ర నిరూపించిన సత్యం.
అధ్యక్షా, మా ప్రభుత్వం చేతల ప్రభుత్వం. గత తొమ్మిది నెలల అతి తక్కువ కాలంలో మా ప్రభుత్వం అనుసరించిన విధానం తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధిపట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తున్నది. నేను ఈ బడ్జెట్‌ను సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను.
//జై తెలంగాణ జైజై తెలంగాణ//