rythuరాష్ట్రంలోని దళిత నిరుపేదలకు మూడెకరాల భూ పంపిణీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసి ఏడాదిన్నర గడిచింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం

అనుకున్న ఫలితాలను అందించింది.

మూడెకరాల భూ పంపిణీకి మొదటి దశలో గౌతాపూర్‌ గ్రామాన్ని ఎంపిక చేసింది. ఈ గ్రామం మెదక్‌జిల్లా అల్లా దుర్గం మండలంలో ఉంది. వ్యవసాయానికి పనికి వచ్చే 32 ఎకరాల భూమిని సమీకరించారు అధికారులు. భూమిని మొత్తం 21 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసింది. అధికారగణం. వీరిలో కొందరికి కొంతమేర భూమి అంతకుముందే వుంది. వీరందరికీ ఒక్కో లబ్ధిదారుకి మూడెకరాల భూమి వచ్చే విధంగా సమానంగా పంపిణీ చేసింది ప్రభుత్వం.

ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగా భూ పంపిణీతో ఆగిపోకుండా, 21 మంది లబ్ధిదారులకు ఆరు బోర్లు వేయించింది. పైపులను బిగించి నీటి సదుపాయాన్ని అందించింది. మూడెకరాల భూమిలో వ్యవసాయం చేయడానికి కావలసిన విత్తనాలు, వాటికవసరమైన ఎరువులతో పాటు వ్యవసాయ పనిముట్లను కూడా ప్రభుత్వం అందజేసింది.

నారు పోసిన వాడే నీరిస్తడన్నట్లుగా అన్ని సదుపాయాలను అందించింది ప్రభుత్వం. పరుల పంట పొలాలల్లో పనులు చేసిన వ్యవసాయ కూలీలు, తమ స్వంత పొలాల్లో యజమానులుగా మారారు. కాయకష్టం జేసి అధికారులిచ్చిన సూచనలు, సలహాలకు తగినట్టుగా నడుచుకుని సొంత భూమిలో తొలి పంట కోతలు కోసి కనుల పండుగ చేసుకుని కడుపునిండినట్టుగా తృప్తిపడ్డారు. నవంబర్‌ 26నాడు తొలి పంటకోతతో పరమానంద పడ్డారు. తాము ఎన్నడూ ఊహలో కూడ అనుకోలేదు ఈ విధంగా జరుగుతుందని అన్నారు, లబ్ధిదారులందరు. భూమినిచ్చి, సాగుకవసరమైన సదుపాయాలిచ్చి మా బతుకులలో భరోసా నింపిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి వుంటామని పరమానంద భరితులయ్యారు లబ్ధిదారులు.

Other Updates