రాష్ట్రంలో నెలకొని ఉన్న దుర్భిక్ష పరిస్థితులను అధిగమించి, రైతును ఆదుకునేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించి అమలు పరిచింది. ఈ ఖరీఫ్ కాలానికి 11.28 క్ష హెక్టార్లలో మెట్ట పంటను ప్రోత్సహించాలని లక్ష్యంగా నిర్దేశించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో వర్షాభావ పరిస్థితులననుసరించి ఈ ప్రణాళికను రూపొందించారు. రైతుకు అవసరమైన 2.31 లక్షల టన్నుల విత్తనాలను సరఫరా చేయడంతో పాటు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు గ్రామాలలో పర్యటించి రైతుకు అండగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం గ్రామాలలో పర్యటించిన అధికారులు ప్రత్యామ్నాయ పంట గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వర్షాభావం కారణంగా వరినాట్లు వేయలేని ప్రాంతాలలో సాగు చేయదగిన ప్రత్యామ్నాయ పంట గురించి ‘‘ మన తెల౦గాణ ` మన వ్యవసాయం’ పేరుతో గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం చేశారు. మొక్కజొన్న, పెసర, కంది, జొన్న, వేరుశనగ తదితర మెట్ట పంట ప్రాధాన్యతను రైతుకు వివరించారు.
వర్షపాతం తగ్గి, సాగునీరు లభ్యం కాకపోవడం వరిపంటను సాగు చేసే రైతు తీవ్రంగా నష్టపోతున్నందున ప్రత్యామ్నాయ పంట పట్ల వారిలో అవగాహనను పెంచేందుకు వ్యవసాయశాఖ అధికారులు ఈ కార్యక్రమాను రూపొందించారు.
ఈ ఖరీఫ్ సీజన్లో మెట్ట పంట సాగు విస్తీర్ణం సంతృప్తికరంగా ఉన్నదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.