studentsమనం నిర్ణయించుకున్న ‘లక్ష్యం’ స్పష్టంగా వున్నప్పుడు, సమయం వృధా కాకుండా ఎక్కువ సమయం తీసుకోకుండా అనుకున్న పని సాధించవచ్చు.

అనుకున్న లక్ష్యాన్ని ఏ మార్గం ద్వారా సాధించగలమో, తెలిసినప్పుడు తక్కువ సమయంలో దానిని సాధించగలుగుతాము.

రోజువారి పని స్పష్టతలో వున్నప్పుడు, చదవాల్సిన పాఠ్యాంశాలు, వాటి నోట్స్‌, సందేహాలు తీర్చుకోవడానికి అధ్యాపకులు, స్నేహితులు అందుబాటులో వున్నప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ చదువుకోగలరు.

ఎన్నిసార్లు చదివితే, పాఠ్యాంశంపై పట్టు వస్తుందో, ప్రశ్నలకు సుళువుగా జవాబు ఎంత తొందరగా ఇవ్వగలమో తెలుసుకోవాలి.

ఏ పద్ధతులద్వారా మనము ఎక్కువ నేర్చుకోగలమో, ఎక్కువరోజులు గుర్తుకు వుంటాయో, ఆ పద్ధతులద్వారా నేర్చుకోవడం.

ఉదా|| వినడం ద్వారా, చదవడంద్వారా, ఇంకొకరికి విపులీకరించడం వంటివి చెయ్యడం ద్వారా! తెలుసుకోవాలి.

పూర్తిస్థాయిలో ఏకాగ్రతతో చదవడంవలన, చాలా వేగంగా నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం, తిరిగి గుర్తుకు తెలుసుకోవడం తక్కువ సమయంలో జరుగుతుంది.

పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థులు 6 గంటలపాటు తప్పకుండా నిద్రపోవాలి. అప్పుడే జ్ఞాపకశక్తి బాగా వుంటుంది.

చదివిందే చాలాసార్లు చదువుతున్నామంటె ఏకాగ్రత లేదని అర్థం. దేనివలన ఏకాగ్రత పోతుందో తెలుసుకొని, దానినుండి బయటకు వచ్చే ప్రయత్నం చెయ్యాలి. ఆ అంశం గురించి తర్వాత చర్చించుకోవాలి.

చదువుతున్నప్పుడు మొబైల్‌ ‘ఫోన్‌’ ‘స్విచ్‌ ఆఫ్‌’ చేసినపుడు ఎలాంటి అవాంతరాలు లేనపుడు శ్రద్ధగా చదువుకోగలరు.

కావలసిన పాఠ్యాంశాన్ని చదవాల్సి వచ్చినప్పుడు ‘ఇంటర్‌నెట్‌’ సహకారంతో చదవాల్సి వచ్చినపుడు దానిని ‘ప్రింట్‌’ తీసుకొని హార్డుకాపిని చదవడంవల్ల సమయం వృధాకాదు.

నెట్‌పై చదివితే అనసవర ‘సైట్‌’లో వెళ్ళి సమయం వృధా అవడమేకాకుండా మన ఏకాగ్రతకు కూడా ఆటంకం ఏర్పడుతుంది.

మన ప్రకృతిసిద్ధమైన/ సహజమైన తీరులో డే మేకర్‌/నైట్‌ మేకర్‌ గుర్తించి దాని ప్రకారం చదువును కొనసాగించాలి.

ప్రతిరోజూ షెడ్యూల్‌ వేసుకొని చదవాలి. అప్పుడే బాగా చదువు కొనసాగుతుంది. ప్రతి గంటకు తప్పకుండా 10 ని||ల బ్రేక్‌ తీసుకోండి, ఏకాగ్రత ఎక్కువ అవుతుంది.

చదవాలనుకున్నప్పుడు, ఆర్థిక సమస్యలు, స్నేహాల సమస్యలు, గత కాలానికి సంబంధించిన సమస్యలను గుర్తుకు తెచ్చుకోకూడదు.. సమయం ఆదా అవుతుంది.

Other Updates