ముంపు ప్రాంతాల భాధలు స్వయంగా తెలుసుకొని సానుకూలంగా స్పందించిన మన ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టుల్లో సాధ్యమైనంత తక్కువ ముంపు ఉండేట్టుగా వీలైన చోటల్లా ప్రాజెక్టుల డిజైన్‌లు మార్చాలని సంకల్పించారు.

కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో గతంనుండి వర్తమానంలోకి కొనసాగుతున్న విధానాలను, ఆలోచనాధోరణులను పునరాలోచించి నవీన పంథాలో లక్ష్యసాధన దిశగా తీసుకువెళ్ళాలన్న ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. అందులో భాగంగానే ఇప్పటివరకే మొదలై చాలావరకు పూర్తయిన ప్రాజెక్టులను మార్పులకు లోను చేయకుండా ఏమైనా అదనపు ఆయకట్టుకు నీల్లివ్వగలుగుతామా, ఏమైనా అదనపు నిల్వ సామర్థ్యం పెంచగలుగుతామా అన్న కోణంలో కార్యాచరణ కొనసాగుతున్నది. అట్లాగే ఒక ప్రణాళిక లేకుండా ప్రాజెక్టులు ప్రారంభించడం వల్ల ఎక్కడైనా ఇప్పటికే సాగవుతున్న లేదా ప్రతిపాదించబడ్డ ఆయకట్టు మరొక ప్రాజెక్టు ద్వారాకూడా ఇచ్చే ప్రతిపాదనలు ఉంటే వాటిని సరిచేయడం కూడా పరిశీలన జరుగుతున్నది.

ప్రాజెక్టులో  కదలికకొత్త ప్రాజెక్టుల విషయంలో ఈ ప్రయత్నాల్లో భాగంగానే ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి, కంతన పల్లి తదితర కొత్త ప్రాజెక్టులను పున: సమీక్షించి తీవ్రమైన మేధో మధనం చేస్తూ, అనేక కోణాల్లో, జలరంగనిపుణులతో చర్చించి, భిన్న ప్రత్యామ్నాయాలను పరిశీలించి, తెలంగాణకు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే విధంగా ప్రభుత్వం ముందుచూపుతో స్పష్టమైన ప్రయత్నాలు సాగిస్తున్నది. ఉదాహరణకు, వరంగల్‌ జిల్లాలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు-II, గోదావరి ఎత్తిపోతల పథకం (GLIS), కాంతనపల్లి ఎత్తిపోతల పథకం పథకాల ద్వారా ఆయకట్టు ఏ విధంగా డూప్లికేషన్‌ లేకుండా నీరందించాలన్న విషయంపై జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను సమీక్షించేందుకు రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ అనంతరాములు గారి అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీ వేసి వారిచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది.

ప్రాణహిత – చేవెళ్ళ ప్రాజెక్టు: ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు 2008లోనే ప్రారంభించబడినప్పటికీ నేటికీ బ్యారేజీ నిర్మాణం మొదలుకాలేదు. కానీ చిట్టచివరన ఉన్న చేవెళ్ళలో కాలువ తవ్వకం మొదలుపెట్టడం గమనిస్తూ ఉంటే అసలు ప్రాజెక్టును పూర్తిచేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నదా? అన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. బ్యారేజీ పూర్తి జల స్థాయి 152 మీటర్లుగా నిర్ణయించి తదనుగుణంగా కాలువ పనులు మొదుపెట్టడం జరిగింది. అయితే ఈ బ్యారేజీ మూలంగా కలిగే ముంపును మహారాష్ట్ర అంగీకరించలేదు. గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ లిఖితపూర్వకంగా చేసిన హెచ్చరికను మనప్రభుత్వం బేఖాతర్‌ చేసి పాతడిజైన్‌ ప్రకారం పనులను కొనసాగించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఆ క్రమంలో కేంద్ర జల సంఘం తదితర సంస్థలతోనూ, మహారాష్ట్ర ప్రభుత్వంతోనూ జరిపిన చర్చల వల్ల తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుమొత్తాన్ని రీ-ఇంజనీరింగు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించింది. మన ముఖ్యమంత్రి అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించడానికి ముంబై వెళ్ళినపుడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో ముంపు లేకుండా చూడాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కోరడం జరిగింది. అదేసమయంలో తెలంగాణ ప్రభుత్వం 160 టీఎంసీ నీటిని తరలించుకోవడానికి తమకు అభ్యంతరంలేదని ప్రకటించినారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కోరికను మన్నించి,CWC సూచనను పరిగణలోనికి తీసుకొని ముంపును తగ్గిస్తూ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రయోజనాలను పూర్తిగా పొందడానికి అనేక ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేస్తున్నది.

ప్రస్తుతం తుమ్మడిహట్టి వద్ద బ్యారేజి నిర్మాణం తలపెట్టినారు. ఆ సైటు దిగువకు మార్చి నీరుపుష్కలంగా ఉండి, మహారాష్ట్రలో ముంపు లేకుండా ఉండే చోటును అన్వేషిస్తున్న క్రమంలో కాళేశ్వరం ప్రతిపాదన ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనపై సర్వే చేసి సవివర అధ్యయన నివేదిక సమర్పించమని WAPCOS ని ఆదేశించడమైంది. పాత డిజైన్‌లో ఎత్తిన నీటిని నిలువ చేయడానికి అవసరమైన సామర్థ్యం కలిగిన జలాశయాల నిర్మాణం ప్రతిపాదించక పోవడం వల్ల కేంద్ర జలసంఘం సూచనపై తడకపల్లి, పాములపర్తి జలాశయాలను సుమారు 70టీఎంసీ సామర్థ్యంతో నిర్మించాలన్న ఆలోచన ఉంది. అదే విధంగా, కాళేశ్వరం నిర్మించడంవల్ల ఆదిలాబాద్‌ జిల్లా ఆయకట్టుకు నీరందదేమో అన్న అనుమానం అవసరం లేకుండా తుమ్మిడిహట్టి వద్ద తక్కువ ఎత్తులోనో లేదా తుమ్మడిహట్టికి దిగువన ఒక బ్యారేజి నిర్మించి ఆదిలాబాద్‌ అవసరాలు కూడా తీర్చడం జరుగుతుంది. పాత స్కీములో ప్రతిపాదించిన 56500 ఎకరాలే కాకుండా అదనపు ఆయకట్టును కూడా సాగులోనికి తీసుకవచ్చే అవకాశాలను పరిశీలించడం జరుగుతుంది. ప్రాణహిత డిజైన్‌ను మార్చినందువలన ఆదిలాబాద్‌ పశ్చిమ జిల్లా నిర్మల్‌, ముధోల్‌ నియోజకవర్గాల్లో ప్రతిపాదించిన ఒకలక్ష ఎకరాలకు ఏ ఢోకా ఉండదు.

నీటిపారుదల శాఖ రీ-ఆర్గనైజేషన్‌: ఇరిగేషన్‌ డిపార్టుమెంటును దాదాపుగా మొత్తంగా నేటి తెలంగాణ నీటిపారుదలరంగం అవసరాకు అనుగుణంగా పునర్వ్యవస్ఠీకరించడం జరిగింది. మిషన్‌ కాకతీయ కై చిన్న నీటిపారుదల రంగాన్ని పూర్తిగా పటిష్టం చేయడం జరిగింది. పూర్తిగా నిర్వీర్యమై పోయి ప్రైవేట్‌ రంగంపై ఆధార పడ్డ ఇన్వెస్టిగేషన్‌ పనిని తిరిగి నీటిపారుదల శాఖ స్వయంగా చేసుకొని డేటాబేస్‌ ఏర్పరుచుకొనే విధంగా రాష్ట్రంలో కృష్ణాబేసిన్‌, గోదావరిబేసిన్‌ కు ఒక్కొక్క సర్కిల్‌ చొప్పున ఏర్పాటు చేయబడ్డాయి. కీలకమైన హైడ్రాలాజీ శాఖను కూడా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోబడుతున్నాయి. తెలంగాణలో ఇంకా ఉపనదుల్లో, వాగుల్లో, వంకల్లో ఎక్కడెక్కడ చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టే వీలుందో, రీ-జెనరేటెడ్‌ జలాలను తిరిగి నదుల్లో కలిసి వ్యర్థమవకుండా ఎట్లా వినియోగించుకోవాలో పర్యవేక్షిస్తున్నారు.

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలాజీ, రూర్కీ లోనూ, సెంట్రల్‌ వాటర్‌ కమీషన్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాజీల్లోనూ హైడ్రోలాజీ, డిజైన్లు, ప్లానింగ్‌, సర్వే రంగాల్లో అత్యున్నత సాంకేతిక పరిజ్ణానానికై శిక్షణ ఇప్పించనున్నారు. ముఖ్యంగా యువ ఇంజనీర్లను భవిష్యత్తులో నిష్ణాతుగా డిపార్టుమెంటుకు వెన్నెముకగా నిలిచేట్టుగా తయారు చేయాని ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమైన అంగాలైన వాటర్‌ మేనేజ్‌ మెంటు, డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థను కూడా పటిష్ట పరచడానికి చర్యలు మొదయ్యాయి. సర్వీస్‌లో ఉన్న ఇంజనీర్లందరికీ రెగ్యులరుగా శిక్షణ ఇప్పిస్తూ నాలెడ్జిని అప్డేట్‌ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది ప్రభుత్వం.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు ప్రభుత్వంలోని అన్ని రంగాల్లో పారదర్శకత తప్పనిసరి అన్న కృతనిశ్చయంతో ఉన్నారు. నీటిపారుదల రంగంలో ఉద్యోగస్తుకు అన్ని వసతు కల్పిస్తూనే పనిలో పారదర్శకతపట్ల నిర్ధాక్షిణ్యంగా ఉంటానని సంకేతాలు ఇస్తున్నారు.

EPC వ్యవస్థను మార్చడం: ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌ మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ పద్ధతిలో కాంట్రాక్టును ఇవ్వడం గత పది పదిహేను సంవత్సరాకాంలో మొదలై 2004లో జలయజ్ఞం ప్రాజెక్టున్నింటిలో ఉపయోగించారు. అయితే ఈపీసీ పద్దతిలో ఇరిగేషన్‌ ప్రాజేక్టు విషయంలో రాష్ట్రప్రభుత్వం పారదర్శకతను పాటించలేదని, ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాను కాపాడలేదని CAG తన నివేదికలో చెప్పింది. EPC వ్యవస్థ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల వ్యవస్థకు సరిపోదని చెప్పింది. పారదర్శకతకు పెద్దపీట వేసిన కొత్త ప్రభుత్వం జుూజ పద్ధతిని రద్దు చేసి, ఇ-టెండరింగ్‌ పద్దతిని పునరుద్దరించింది. అదేవిధంగా పారదర్శకతను పెంచేవిధంగా పనులను అప్పగించేందుకు నామినేషన్‌ పద్దతిని ఎత్తివేయడం జరిగింది.

జలయజ్ఞంలో ప్రారంభించిన పనులుచాలావరకు జరిగినట్లైతే వాటిని వెంటనే పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నది ప్రభుత్వం. ఉమ్మడి రాష్ట్రం జారీ చేసిన ధర పెంపు జీవో 13ను పున: సమీక్షించి పనులు ముందుకు సాగేట్లు చేస్తున్నది. దీనితో పాటు భూసేకరణ సమస్యను కూడా పరిష్కరించే దిశగా తగుచర్యలు తీసుకుంటున్నది.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక ప్రధాన అంశం తెలంగాణకు అన్యాయంచేసి సీమాంధ్రకు గోదావరి జలాను తీసుకువెళ్లే దుమ్ముగూడెం-నాగార్జునసాగర్‌ టెయిల్‌ పాండ్‌ ఆపివేయాలి’ అన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభీష్టానికి అనుగుణంగా ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తుంగభద్ర నదిపై అక్రమంగా తపెట్టిన 20టీఎంసీ గుండ్రేవు బ్యారేజి వ్ల మహబూబునగర్‌ జిల్లాకు చెందిన 9 గ్రామాు మునుగుతూ తెలంగాణకు ఏ విధమైన ప్రయోజనం లేనందున దాన్ని తక్షణమే ఆపేందుకు అన్ని చర్యలు తీసుకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతరాష్ట్ర ప్రాజెక్టులైన లెండి, పెన్‌ గంగా ప్రాజెక్టులు కొన్ని దశాబ్దాుగా ఎటువంటి పురోగతి లేకుండా ఉంటే ఈ ప్రభుత్వం అధికారం చేపట్టగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పుమార్లు చర్చించి త్వరితగతిన పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంది. ఆర్డీఎస్‌ మళ్లింపు పథకం కాువ చిట్టచివరి ఆయకట్టుదార్లకు నీటిని అందించడానికి, తుంగభద్ర నదిపై సుంకేశు బ్యారేజీ ఎగువన తుమ్మిళ్ళ గ్రామం, మహబూబ్‌ నగర్‌ జిల్లా వద్ద ఒక లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్ కట్టడానికై డీటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయడానికి ఉత్తర్వు జారీచేసింది. త్వరితగతిన ఇన్వెస్టిగేషన్‌ పనులు జరుగుతున్నాయి. అట్లే కడం ప్రాజెక్టుకు అవసరమయినప్పుడు నీటిని వదలడానికి ఎగువన కుప్టి వద్ద 4.5 టిఎంసి న్వి సామర్థ్యంతో ఒక జలాశయం నిర్మించడానికి ప్రభుత్వం ప్రాజెక్టు నివేదిక తయారీకి పరిపానా అనుమతి ఇవ్వడం జరిగింది.

ఇవీ సంక్షిప్తంగా ఈ ఏడాదిలో నీటి పారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రోగ్రెస్‌ రిపోర్టు. హరిత తెలంగాణ వైపు, మా తెలంగాణం కోటి ఎకరాల మాగాణం వైపు తెలంగాణ వేసిన తొలిఅడుగు.

Other Updates