ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని (ఆగస్ట్ 19) పురస్కరించుకొని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ, ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించింది. పోటీలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన అతి తక్కువ వ్యవధిలో 200 మంది ఫోటోగ్రాఫర్లు 1200 ఫోటోలను ఎంట్రీగా పంపించారు. మొత్తం 3 విభాగాలో ఈ పోటీలు జరిగాయి.
మొదటి విభాగంగా ‘బంగారు తెంగాణ’, రెండో విభాగంగా ‘తెలంగాణ పండుగలు’, మూడో విభాగంగా ‘ఫోటో జర్నలిజం’గా నిర్ణయించి పోటీలను నిర్వహించారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ ఎస్.ప్రదీప్‌కుమార్, ప్రముఖ ఫోటోగ్రాఫర్లు భరత్ భూషణ్, డి.రవీందర్‌రెడ్డితో కూడిన న్యాయ నిర్ణేతల కమిటీ ఫోటోలన్నింటిని పరిశీలించి, బంగారు తెలంగాణ విభాగంలో కె.రమేష్‌బాబు (హైదరాబాద్) తీసిన ఫోటోను మొదటి బహుమతిగా, బందగి గోపి (మహబూబ్‌నగర్) తీసిన ఫోటోను రెండో బహుమతికి, ఎం. క్యాధర్ రెడ్డి (కరీంనగర్) తీసిన ఫోటోను మూడో బహుమతికి ఎంపిక చేశారు.
తెంగాణ పండుగ విభాగంలో..
వి.వినోద్‌బాబు (హైదరాబాద్) తీసిన ఫోటోకు ప్రథమ, పఠాన్ హుస్సేన్ ఖాన్ (ఖమ్మం) తీసిన ఫోటోకు ద్వితీయ, నాగరాజు గోవింద్ (కరీంనగర్) తీసిన ఫోటోకు తృతీయ బహుమతులు లభించాయి.
ఫోటో జర్నలిజం విభాగంలో..
ఏ ఉపేంద్రచారి (ఖమ్మం) తీసిన ఫోటోకు ప్రథమ, ఎండీ అలీముద్దీన్ (హైదరాబాద్) తీసిన ఫోటోకు ద్వితీయ, కె. భజరంగ్ ప్రసాద్ (నల్లగొండ) తీసిన ఫోటోకు తృతీయ బహుమతులు లభించాయి.
తొలి మూడు స్థానాలలో నిలిచిన ఫోటో గ్రాఫర్లకు 15 మలు, 10 మలు, 6 వేల రూపాయల నగదు బహుమతిని, 4, 5 స్థానాలో నిలిచినవారికి 3 వేల రూపాయల నగదును కన్సోలేషన్ బహుమతిగా అందజేశారు.
మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆగస్ట్ 19న నిర్వహించిన సభలో విజేతలకు బహుమతులు అందజేసి సన్మానించారు. ఈ సమావేశంలో సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ బి.పి. ఆచార్య, డైరెక్టర్ సుభాష్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆగస్ట్ 23 వరకు ప్రదర్శించారు.