తెలంగాణ రథసారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లక్ష్యం బంగారు తెలంగాణ సాకారం. ఈ లక్ష్య సాధనకు ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, చేపట్టిన పథకాలు, వాటి అమలు, సాధిస్తున్న ఫలితాలు, విజయాల సారాంశమే ‘ఈ బంగారుబాట’ వ్యాస సంకలనం.

ఇందులో తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం తొలి ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర రావు బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే రాష్ట్రంలో అంతకుముందు కమ్ముకున్న అంధకారాన్ని తరిమికొట్టి, విద్యుత్‌ రంగంలో సాధించిన, సాధిస్తున్న విజయాలనుంచి 2018లో జరిగిన సాధారణ ఎన్నికలలో టి.ఆర్‌.ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించి రెండవసారి కె.సి.ఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేవరకూ అనేక అంశాలపై గటిక విజయ్‌ కుమార్‌ రాసిన వ్యాసాల సంకలనం ఈ ‘బంగారుబాట’ పుస్తకం. తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయిన తరువాత ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ కు ప్రజాసంబంధాల అధికారిగా పనిచేస్తున్న గటిక విజయ్‌ కుమార్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని, అమలుచేస్తున్న పథకాలను అత్యంత సన్నిహితంగా గమనిస్తూ ఈ వ్యాస పరంపరను కొనసాగించారు.ఈ వ్యాసాలను చదివినవారికి తెలంగాణ ప్రభుత్వ పాలనా విధానం, ప్రభుత్వ ప్రాధాన్యతలు, సాధించిన విజయాలపై మంచి అవగాహన కలుగుతుంది. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత, తొలి ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఇక్కడి ప్రజల అవసరాలే ప్రామాణికంగా రూపొందించిన వీవిధ పథకాల వెనుకగల సదుద్దేశ్యాలు, అవి సాధించిన విజయాలను ఈ వ్యాసాలలో రచయిత వివరించారు.

సంపద సష్టించాలి..దాన్ని పేదలకు పంచాలి అనేది ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ ప్రగతి సూత్రం. అందుకే రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. పేకాట, సట్టా లాంటి జూదాలకు అలవాటుపడి నాశనమవుతున్న కుటుంబాలను దష్టిలో పెట్టుకొని పేకాట క్లబ్బులను మూసేశారు.ఆన్‌ లైన్‌ రమ్మీలు, జూదాలకు కూడా రాష్ట్రంలో అవకాశం లేకుండా చేశారు. తెలంగాణ వ్యాప్తంగా భూరికార్డుల ప్రక్షాళన, మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి మిషన్‌ భగీరథ, రికార్డు సమయంలో భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తిచేసిన వైనం, ప్రజలకు చేరువగా పాలనను అదించేందుకు జిల్లాల పునర్విభజన, కొత్తజిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు, విద్య, వైద్యరంగాల ప్రక్షళన …తదితర అనేక అంశాలు ఈ వ్యాస సంకలనంలో చోటుచేసుకున్నాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే….,/ అన్నార్తులు, అనాథలుండని

ఆ నవయుగమదెంత దూరం??/ కరువంటూ కాటకమంటూ

కనిపించని కాలాలెపుడో ??

అంటూ దాశరథి ఏనాడో రాసిన పాట ఉద్యమ కాలంలోనేకాదు, ముఖ్యమంత్రిగా కూడా కే.సి.ఆర్‌ ఆలోచనలకు పదునుపెట్టింది. దానిఫలితమే రాష్ట్రంలో నిరుపేదల కన్నీరు తుడిచే అనేక సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టేలా చేసింది. ఒకటికాదు..రెండు కాదు… ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినవి, చెప్పనివి పెద్ద సంఖ్యలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలలోని మానవతా కోణాలు.. ఇలా ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో మనం చదవచ్చు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పేర్కొన్నట్టు ప్రభుత్వం ఎదుర్కొన్నసవాళ్ళు, సాధించిన విజయాలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనంచేసి తీర్చిదిద్దిన పుస్తకం ఇది. ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ సమర్థవంతమైన పాలనకు , ఆలోచనా సరళికి, మానవతా హదయానికి ఈ పుస్తకంలోని వ్యాసాలు అద్దంపడుతాయి. పాఠకులకు, పోటీపరీక్షలకు హాజరయ్యేవారికి కూడా బంగారుబాటలు వేసే ఇదొక రిఫరెన్స్‌ పుస్తకంలాగా ఉపయోగపడుతుంది.

Other Updates