తెలంగాణ రాష్ట్రంలో వరుసగా అయిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. నాపై విశ్వాసంతో ఈ గురుతర బాధ్యతను అప్పగించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దిగ్విజయంగా దాదాపు నాలుగేళ్లు పూర్తి కావచ్చింది. కొద్దినెలల్లో అయిదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో రాష్ట్ర సాధనకు మూడున్నర కోట్ల ప్రజానీకం చేసిన బహుముఖ పోరాటం, ఆ పోరాటం వెనుకున్న ఎదురులేని నాయకత్వం, ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలతో మనకు జరిగిన అన్యాయం, రాష్ట్రం ఏర్పడిన నాడు ఉన్న అస్తవ్యస్థ పరిస్థితులు, ఆ పరిస్థితులను చక్కదిద్దే దిశగా వినూత్నమైన పథకాలను ప్రారంభించి రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిలోకి తెచ్చిన అంశాన్ని మనం తప్పకుండా మననం చేసుకోవాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మొదలైన ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించాము. 45 నెలల స్వల్పకాలంలో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించాం. చీకటినుంచి వెలుగులోకి, అపనమ్మకంనుంచి ఆత్మ విశ్వాసంలోకి, అణగారిన స్థితి నుంచి అభ్యున్నతిలోకి, వలస బతుకుల నుంచి వ్యవసాయ ప్రగతివైపు రాష్ట్ర ప్రజలను నడిపిస్తున్నాం. ఈ ప్రస్థానంలో భాగంగా సంక్షేమం, అభివృద్ధి ఫలాలను పేద లకు అందించాలనే ముఖ్యమంత్రి ఆశయానికి అద్దంపడుతూ రాష్ట్ర అయిదవ బడ్జెట్‌ను రూపొందించాము.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
సమైక్య పాలనలో చివరి రెండేళ్లలో అనగా 2012-13, 2013-14 సంవత్సరాలలో తెలంగాణ ప్రాంత జీఎస్డీపీ వృద్ధిరేటు, స్థిర ధరల్లో, దేశ సగటుకన్నా తక్కువగా ఉండేది. పై రెండు సంవత్సరాలలో దేశ సగటు వృద్ధిరేటు 5.9 శాతం ఉండగా తెలంగాణ ప్రాంత సగటు వృద్ధి రేటు వేలం 4.2 శాతం నమోదు అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో గణనీయంగా ప్రగతిని సాధించాము.
సమైక్య రాష్ట్రంలో 2013-14 సంవత్సరంలో 5.4 మాత్రమే ఉన్న తెలంగాణ ప్రాంత జీడీపీ వృద్ధిరేటు రాష్ట్రం ఏర్పడ్డాక మెరుగుపడింది. 2014-15 సంవత్సరంలో అది 6.8 శాతంగా నమోదు అయింది. రాష్ట్ర జీడీపీ ఏటేటా పెరుగుతూ 2015-16లో 8.6 శాతంగా, 2016-17లో 10.1 శాతంగా నమోదు అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2017-18 సంవత్సరానికి రాష్ట్ర జీడీపీ వృద్ధిరేటు 10.4 శాతంగా ఉండగలదని అంచనా. జీడీపీ జాతీయ వృద్ధిరేటు 6.6 శాతంతో పోలిస్తే మన రాష్ట్ర వృద్ధిరేటు ఎంతో మెరుగ్గా ఉండడం ప్రశంసనీయం.
పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలువల్ల కలిగిన ప్రారంభ ప్రతిూల పరిణామాలను అధిగమించి జీడీపీ వృద్ధిలో జాతీయ ధోరణిని సైతం తోసిరాజని రెండంలె వృద్ధిరేటు సాధించామని సగర్వంగా విన్నవిస్తున్నాను.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతపు తయారీ రంగ పరిశ్రమ పరిస్థితి ఎప్పుడూ ఏటికి ఎదురీదినట్లే ఉండేది. తయారీ రంగంలో వృద్ధిరేటు ఏటేటా పడిపోతూ ఉండేది. రాష్ట్రం ఏర్పడ్డాక, విద్యుత్‌రంగంలో సంస్కరణలు, పారిశ్రామిక రంగంలో పెట్టుబడులకు అనుూల విధానం ప్రవేశపెట్టాము. నూతన పారిశ్రామిక విధానంవల్ల, 2015-16 సంవత్సరంలో తయారీరంగంలో 6.4 శాతం వృద్ధి నమోదయింది. 2016-17 నాటికి అది మరింత మెరుగుపడి 7.4 శాతంగానూ, ముదస్తు అంచనా ప్రకారం అది 2017-18 సంవత్సరంలో 7.6 శాతంగాను నమోదు కావడం గమనించాలి.
విద్యుత్‌రంగంలో, నీటి పారుదలలో వచ్చిన అభివృద్ధివల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడులు పెరిగాయి. వ్యవసాయ అభివృద్ధి ఆశాజనకంగా ఉన్నది. వ్యవసాయం దాని అనుబంధ రంగాల అభివృద్ధి 2017-18లో 6.9 శాతానికి చేరుకున్నది. ప్రాజెక్టులు, చెరువుల ద్వారా సాగునీరు లభించడం, కోతల్లేని 24 గంటల కరెంటు సరఫరా, భూగర్భజలాల సద్వినియోగంతో 2018-19లోూడా వ్యవసాయ అభివృద్ధి గణనీయంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. దీనికితోడు సకాలంలో వానలు కురవాలని మనం కోరుకుందాం. మొత్తానికి జీఎస్డీపీ ప్రస్తుత ధరల ప్రకారం, గతేడాది 6,41,985కోట్ల రూపాయలు ఉండగా, 2017-18లో 7,32,657 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. గతేడాదితోపోలిస్తే రికార్డుస్థాయిలో 14.1 శాతం అభివృద్ధి చెందింది.
రాష్ట్ర తలసరి ఆదాయం ఏటేటా మెరుగుపడుతున్నది. ప్రస్తుత ధరల్లో రాష్ట్ర తలసరి ఆదాయం 2016-17 సంవత్సరంలో రూ.1,54,734. ఇది 2017-18 సంవ త్సరంలో రూ. 1,75,534 ఉంటుందని అంచనా. గత సంవత్సరంతోపోలిస్తే వృద్ధిరేటు 13.4 శాతం వున్నది. ఇది జాతీయ వృద్ధిరేటు అయిన 8.6 శాతంతో పోల్చితే ఎంతో ఎక్కువ.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి గమనిస్తే పురోగతి కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నది. విధానాల రూపకల్పనలో, ప్రజామిత కార్య క్రమాల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గుణాత్మకమైన మార్పువల్లనే ఈ విజయం సాధ్యమైంది. మనకున్న వనరులను, మనకున్న అవసరాలను సరిగ్గా అంచనా వేసుకుని, దానికి అనుగుణంగా ప్రణాళికలు రచించుకుని ముందుకు సాగడంవల్లనే రాష్ట్రం ప్రగతిని సాధిస్తున్నది. ఇదే ఒరవడిలో రూపొందించిన 2018-19 బడ్జెట్‌లోని ప్రధాన టాేయింపులను మీ ముందు ఉంచుతున్నాను.
సమగ్ర భూ సర్వే
రైతుకు పెట్టుబడి సహాయం అందించాలి అని అంటే, భూ రికార్డులు సమగ్రంగా ఉండడం అనివార్యం. భూ రికార్డులను సమగ్రంగా సర్వే చేయించే మహత్తరమైన పనిని మా ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో 10,823 గ్రామాల్లోని భూరికార్డులను రెవిన్యూ శాఖకు చెందిన 1,507 బృందాలు ఖాతా వారీగా, అనగా 72,13,111 ఖాతాలు పరిశీలించి కావలిసిన మార్పులు చేశారు. రాత్రింబవళ్ళు కష్టపడి 100 రోజుల్లోనే భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేశారు. 96 శాతం భూరికార్డులు వివాదరహితమని ధృవీకరించాము. రాష్ట్రంలోని భూమి రికార్డుల వివరాలు అన్ని పొందుపరిచిన ధరణి వెబ్‌సైటును త్వరలో ఆవిష్కరించనున్నాము.
సులభతర భూ రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజి స్ట్రేషన్లు సులభతరం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సేల్‌డీడ్‌ను ప్రామాణీకరిస్తున్నాము. రిజిస్ట్రేషను ఆఫీసులేని మండలాల్లో భూములు రిజిస్ట్రేషను చేసే బాధ్య తను మండల రెవిన్యూ అధికారులకు అప్పగించనున్నాము. దీనితో భూముల రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డులలో మార్పులు ఏకకాలంలో జరుగుతాయి.
రైతు సమన్వయ సమితి
అసంఘటిత రంగంలోని వర్గాలు హక్కులు సాధించుకోలేకపోతున్నాయి. వారిని పట్టించుకున్నవారే లేరు. సరిగ్గా తెలంగాణ రైతాంగానిది అదే పరిస్థితి. తమ హక్కులు, ప్రయోజనాల సాధనలో తెలంగాణ రైతాంగం ఎంతో వెనుకబడి ఉన్నది. సంఘటిత శక్తిలోని బలాన్ని గ్రహించకపోవడంవల్లనే రైతాంగానికి ఇన్ని సమస్యలు. ఆ బలానికి ఉన్న ప్రభావం ఒక్కసారి రైతుల అనుభవంలోకి రావాలి. రైతుల మధ్య ఐక్యతను, సమన్వయాన్ని సాధించాలన్న ముఖ్యమంత్రి ఆలోచనకు ప్రతిరూపమే రైతు సమన్వయ సమితి ఆవిర్భావం.
రాష్ట్ర వ్యాప్తంగా 1,61,000 రైతులు సభ్యులుగా రైతు సమన్వయ సమితి ఏర్పాటైంది. గ్రామస్థాయిలో 15మందితో, మండలస్థాయిలో 24 మందితో, జిల్లాస్థాయిలో 24 మందితో, రాష్ట్రస్థాయిలో 42మందితో రైతు సమితుల ఏర్పాటు జరిగింది. రాష్ట్రస్థాయి రైతు సమితులలో రైతు ప్రతినిధులతో పాటు వ్యవసాయధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయరంగ నిపుణులు సభ్యత్వం కలిగి ఉంటారు.
ప్రభుత్వానికి, రైతులకు మధ్య అనుసంధానంగా రైతు సమన్వయ సమితి పనిచేస్తుంది. రైతుల మధ్య పరస్పర సహకార భావం ఏర్పరచడం, వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారానికి కావాల్సిన చైతన్యాన్ని కలిగించడం, పండిన పంటకు మద్దతు ధర సాదించడమే రైతు సమన్వయ సమితియొక్క ప్రధాన కర్తవ్యాలు. ఇందుకోసం రైతులకు, కొనుగోలుదారులకు మధ్య మధ్యవర్తిత్వం చేస్తుంది. ఒకవేళ మార్కెట్లో మంచి ధర రానట్టయితే స్వయంగా రంగంలోకి దిగి నేరుగా పంటను రైతు నమస్వయ సమితి కొనుగోలుచేస్తుంది. పంట కొనుగోలులో ప్రభుత్వం పూచీదారుగా ఉంటుంది మరియు తగిన నిధులు సమూరుస్తుంది.
రైతు వేదికలు
రైతులు పరస్పరం చర్చించుకోవడానికి వారికి ఒక వేదిక అవసరం. ప్రతీ ఐదువేల ఎకరాలు ఒక క్లస్టర్‌గా విభజించి ప్రతీ క్లస్టర్‌కు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని ప్రభుత్వం ఇదివర నియమించింది. అదేవిధంగా ప్రతి క్లస్టర్‌కు ఒక రైతు వేదికను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం
నగరీకరణను మాత్రమే అభివృద్ధి అనుకుంటాము. అది తప్పు. అభివృద్ధి ఎప్పుడైనా పునాదుల నుంచి ప్రారంభం కావాలి. గ్రామీణ సమాజంలో వికాసం కలిగినప్పుడే అభివృద్ధి సమగ్రతను సంతరించుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించే ప్రణాళికను అమలు చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తగిన జీవిక ఏర్పడడానికి అవసరమైన కార్యాచరణను ప్రారంభించింది. వ్యవసాయాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతూనే, వ్యవసాయ అనుబంధ రంగాలకు కావాల్సిన ఆర్థిక మద్దతును ప్రభుత్వం అందిస్తున్నది. గ్రామీణ వృత్తులమీద ఆధారపడిన వర్గాలకోసం ప్రత్యేక పథకాలను రూపొందించింది.
గ్రామాల సమగ్ర అభివృద్ధికోసం పంచాయితీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ అసెంబ్లీ సమావేశాల కాలంలోనే కొత్త పంచాయితీరాజ్ బిల్లు ప్రవేశపెడుతు న్నాము. స్థానిక సంస్థల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించవలసిన నిధులపై అధ్యయనం చేసేందుకు కొత్తగా తెలంగాణ రాష్ట్ర మొదటి ఫైనాన్స్ కమిషన్‌ను నియమించాము.
గొర్రెల పెంపకం
గొల్ల కురుమ సంప్రదాయ వృత్తి గొర్రెల పెంపకం, సరైన దృష్టితో ఆలోచిస్తే, గొర్రెల మందలు నిరంతరం పెరిగే పెద్ద సంపద. గత ప్రభుత్వాల ఉదాసీన వైఖరివల్ల ఎంతో నైపుణ్యం కలిగిన గొల్ల, కురుమలకు ఎటువంటి ప్రోత్సాహం లభించలేదు. ప్రస్తుతం గొర్రెల పెంపకాన్ని ఒక పరిశ్రమగా అభివృద్ధి చేసి, రాష్టవ్యాప్తంగా లక్షలాదిగా ఉన్న గొల్ల, కురుమల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం పెద్దెత్తున గొర్రెల పంపిణీ చేపట్టింది. మొదటి దశలో 4 లక్షల కుటుంబాలకు 84 లక్షల గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఈ ఏడాది ఇప్పటివరకు 2 లక్షల 35వేల కుటుంబాలకు, 50 లక్షల గొర్రెలను 75 శాతం సబ్సిడీపై పంపిణీ చేశాం. ఆ గొర్రెలు మరో 17 లక్షల గొర్రె పిల్లలను పెట్టడంతో తెలంగాణలో అదనంగా 67 లక్షల గొర్రెలు వచ్చి చేరినట్లయింది. గొర్రెల పంపిణీ మొదటి దశలో 5వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించిన పథకానికి బడ్జెట్ టాేయింపులే కాకుండా, బడ్జెటేతర పద్ధతిలో ఆర్థిక సంస్థలనుంచి రుణాల రూపంలో నిధులు సమూర్చడం జరుగుతున్నది. ఈ పథకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతున్నది. అదే సమయంలో రాష్ట్ర ప్రగతికి ఎంత గానో దోహదపడుతున్నది. రాష్ట్ర అవసరాలకు తగినంత మాంసాహారం రాష్ట్రంలోనే ఉత్పత్తి అవబోతుంది. మాంసోత్పత్తిలో రాషా్టన్ని దేశంలోనే ప్రథమస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. మాంసాన్ని ప్రాసెసింగ్ చేసి, దేశ విదేశాలకు ఎగుమతి చేసేందుకు పట్టణ ప్రాంతాల్లో మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారం భించడానికి ప్రభుత్వం తగు ప్రోత్సాహం చేస్తుంది.
చేపల పెంపకం
గంగపుత్ర, ముదిరాజ్, బోయ, బంటు కులస్తులు చేపలు పట్టడమే వృత్తిగా జీవిస్తున్నారు. తెలంగాణలో వీరి సంఖ్య అధికం. చేపల పెంపకానికి కావాల్సిన జల వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటి ఉన్న రిజర్వాయర్లు, చెరువులకు తోడుగా, ప్రభుత్వం కొత్తగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. మిన్ కాకతీయ ద్వారా వేలాది చెరువుల పునరుద్ధరణ జరుగుతున్నది. దీంతో వందలాది టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జల వనరులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నింటిలో చేపల పెంపకాన్ని చేపడితే రాషా్టనికి ఎనలేని మత్స్య సంపద చేూరుతుంది. రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ ఉపాధి ఏర్పడుతుంది. ఈ దిశగా ప్రభుత్వం పథకాన్ని రూపొందించి, అమలు చేస్తున్నది. ప్రతీ సంవత్సరం 3,20,000 టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. దీనికోసం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. చేపలు పట్టుకునే హక్కులను పూర్తి మత్స్యకారుల కల్పించింది. పట్టిన చేపలు అమ్ముకోవడానికి వీలుగా జిల్లాకు ఒకటి చొప్పున 31 ¬ల్‌సేల్ చేపల మార్కెట్‌లు, 200 రిటైల్ మార్కెట్‌లు నిర్మిస్తాము. ఈ పథకానికి బడ్జెట్ టాే యింపులేకాక బడ్జెటేతర పద్ధతిలో ఆర్థికసంస్థలనుంచి రుణాలు పొందడం ద్వారా నిధులు సమూర్చడం జరుగుతున్నది.
సంక్షేమ రంగం
పేద ప్రజలకు కనీసమైన భరోసా అందించాలని ప్రభుత్వం సంక్షేమరంగం మీద ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నది. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. ప్రతీ ఇంటికి సంక్షేమం, ప్రతీ ముఖంలోసంతోషం అనే నినాదంతో ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ పథకాలు కనీస జీవన భద్రత కల్పిస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రిగారి పరిపాలన సంక్షేమానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు.
ఆసరా పెన్షన్లు
అసహాయులైన వారికి ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రతినెలా పెన్షన్లు ఇస్తున్నది. వృద్ధులకు, వితంతువులకు, కల్లుగీత కార్మికులకు, నేత కార్మికులకు, ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డవారికి, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకి నెలకు 1000 రూపాయల చొప్పున, వికలాంగులకు, పేద వృద్ధ కళాకారులకు నెలకు 1500 రూపాయల చొప్పున సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. వీరేకాక, బోదకాలుతో బాధపడేవారి కష్టాలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించి, వీరికి ూడా జీవన భృతిని నెలకు 1000 రూపాయల చొప్పున అందించాలని నిర్ణయించింది.
గతంలో నెలకు రూ. 200 చొప్పున 31 లక్షలమందికి ఏడాదికి రూ. 853 కోట్లతో పెన్షన్లు ఇస్తే మా ప్రభుత్వం 41,78,291మందికి ఏడాదికి రూ. 5,300కోట్లతో పెన్షన్లు ఇస్తున్నాము. పేదలు, అసహాయుల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధకు ఇదొక నిదర్శనం.
మహిళా శిశు సంక్షేమం
సమాజంలో సగ భాగమైన మహిళలో తమకు సమన్యాయం లభించడం లేదనే ఆవేదన ఉంది. చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కావాలని మహిళలు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. సహేతుకమైన వారి డిమాండ్‌ను సమర్థిస్తూ మనం అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ప్రభుత్వం, రాష్ట్ర పరిధిలోఉన్న అని సంస్థలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాము. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్‌లలో మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలనే సదుద్దేశంతో వీరికి తొలిసారి, రిజర్వేషన్లను ప్రవేశపెట్టాము. పోలీసుశాఖలోూడా 33 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన ఘనత ఈ ప్రభుత్వాని దక్కుతుంది. మహిళా శిశు సంక్షేమంకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలయ్యేందుకు 16మంది మహిళా ఆర్గనైజర్లను సముచిత గౌరవ వేతనంతో నియమించాలం.
ఆరోగ్యలక్ష్మి , పోషకాహారం
తెలంగాణ రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీ ంద్రాలు ఉన్నాయి. వీటిలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మరియు ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు పోషక ఆహారాన్ని అందించడం జరుగుతుంది. తల్లిబిడ్డలు ఆరోగ్యంకోసం, శిశువుల సంపూర్ణ వికాసం చక్కటి సంపూర్ణమైన ఆహారంఅందించాలి అనే ఉద్దేశంతో, ఆరోగ్యలక్ష్మి అనే పథకాన్ని అమలు చేస్తున్నాము.
తెలంగాణ ఏర్పాటుకు పూర్వంవేలం 3నుంచి 6 సంవత్సరాల పిల్లలకు మినీ-వేడి భోజనం పెట్టేవారు. అంతేకాక గర్భిణీ, బాలింతలకు 81 ఐసీడీఎస్ ప్రాజెక్టులలో మధ్యాహ్నం వేడి భోజనం లభించేది. మా ప్రభుత్వం పేదలందరికీ కడుపునిండా భోజనం పెట్టాలని, రాష్ట్రంలో ఉన్న అన్ని అంగన్‌వాడి ంద్రాలలో, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు ప్రతిరోజూ, సమృద్ధిగా పోషక విలువలు ఉండే సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నది.
చిన్న పిల్లలకు గుడ్లతోపాటు గోధుమలు, పాలపొడి, శనగపప్పు, చ్కర, నూనెలతోూడిన రెండున్నర కిలోల ప్యాట్‌ెను ప్రతి నెల మొదటి తేదీన అందజేస్తున్నది. ఈ పథకం ద్వారా 9,46,115మంది ఏడు నెలలనుండి మూడు సంవత్సరాలలోపు పిల్లలు, 5,03,360 మంది మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలు మరియు 3,66,860 గర్భిణీ స్త్రీలు, బాలింతలు లబ్దిపొందుతున్నారు.
అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల భృతి రెండు విడతులుగా మన రాష్ట్రం వచ్చాకపెంచాము. సమాజంలో పేద మహిళలు, పిల్లలకు సేవలు అందిస్తున్న 67,411 సిబ్బంది తద్వారా లబ్దిపొందారు. అంగన్‌వాడీ వర్కర్లు అయితే రూ.4200 నుంచి రూ.10,500కు, హెల్పర్లు అయితే రూ. 2200 నుంచి 6,000 రూపాయలకు ప్రతినెలా, వీరి గౌరవ వేతనం పెంచాము.
ఉద్యోగుల సంక్షేమం
ఉద్యోగుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడిఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ వేతన పెంపుదలలో దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శంగా ఉంది. అదేవిధంగా ¬ంగార్డు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, అంగన్వాడీ ఉద్యోగులు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, విద్యా వాలంటీర్లు, వీఆర్‌ఏలు, పార్ట్‌టైం/ఫుల్‌టైం కాంటింజెంట్‌ఉద్యోగులు, సెర్ఫ్ ఉద్యోగులు 2,27,782మంది ఉద్యోగుల వేతనాలు సంవత్సరానికిరూ. 1023.84 కోట్ల ఖర్చుతోగతంలో ఎన్నడూలేని విధంగా పెంచిన ఘనత మా ప్రభుత్వానిదే. ఉద్యోగులు, జర్నలిస్టులకు కార్పొరేటు దవాఖానల్లోనగదు రహిత వైద్యం అందుబాటులోకి తెచ్చాం. వెల్‌నెస్ సెంటర్ల ద్వారా ఉద్యోగులకు ఓపీ సేవలు ూడా అందుబాటులోకి వచ్చాయి.
ఉద్యోగ నియామకాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఉద్యోగుల విభజన కోర్టు సుేలు వంటిఅనేక సమస్యలను అధిగమించి, ఇప్పటివరకు 1,10,012 నేరుగా నియామక ఖాళీలు గుర్తించడం జరిగింది. అందులో 83,048 ఉద్యోగాల భర్తీకి ఇప్పటి ఉత్తర్వులు జారీ చేశాము. 27,588 సంఖ్య ఉద్యోగాల నియామకాలు పూర్తి అయినవి. మిగిలిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయుటకు అన్ని చర్యలు తీసుకొనడం జరుగుతుంది.
2016-17 అకౌంట్లు
తెలంగాణ అకౌంటెంట్ జనరల్ ధృవీకరించిన లెక్కల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలోరూ. 1,33,823 కోట్లు ఖర్చు అయింది. రెవిన్యూ మిగులురూ. 1386 కోట్లు.
సవరించిన అంచనాలు 2017-18
2017-18 సవరించిన అంచనాల ప్రకారం మొత్తం ఖర్చు రూ. 1,42,506 కోట్లుగా అంచనా వేశాము. ఇందులో రెవిన్యూ వ్యయం రూ. 1,06,603 కోట్లుకాగా, క్యాపిటల్ వ్యయం రూ. 25,447 కోట్లు. ఇది సవరించిన అంచనాలలో 95 శాతం, జీఎస్టీ ప్రారంభించడం వల్ల కలిగిన ప్రారంభ ప్రతిూల పరిణామాల వల్ల ఆదాయం పెరుగుదల గత ఆర్థిక సంవత్సరంకంటే స్వల్పంగాతగ్గింది.
ముగింపు
అనేక ప్రతిూల పరిస్థితులు, అస్పష్టతలు, అను మానాలు, సవాళ్ల మధ్య ఏర్పడిన నూతన రాష్ట్రం అనతి కాలంలోనే అనేక విషయాల్లో దేశానికి ఆదర్శంగానిలిచే స్థాయికి ఎదిగింది. ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, పాలనా సంస్కరణల్లో తెలంగాణ చూపిన మార్గం తమకు ూడా అనుసరణీయమని ఇతరరాషా్టల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. వర్తమానంలో ప్రభుత్వం సాధిస్తున్న విజయాలతో భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆత్మ విశ్వాసంనేడు తెలంగాణా సమాజంలో తొణికి సలాడుతున్నది. ఆ విశ్వాసమే ప్రాతిపదికగా, బంగారు తెలంగాణా నిర్మాణం ధ్యేయంగా రాష్ట్ర ప్రజల సమగ్రా భివృద్ధి కోసం రూపొందించిన ఈ వార్షిక బడ్జెట్‌ను ఆమోదించవలసిందిగా గౌరవ సభ్యులను తమరిద్వారా కోరుతున్నాను.
జై హింద్ జై తెలంగాణ
ఈ బడ్జెట్ ఎంతో సానుకూలమైనది
సీఎం కేసీఆర్ ప్రశంస
రాష్ట్ర ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నిరంగాల అభివృద్ధికి, అన్నివర్గాల సంక్షేమానికి ప్రయోజనకారిగా వుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పరిపూర్ణ సమతుల్యంతో 2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపొందించారని అన్నారు. మన రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరులను, రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి సమన్వయం కుదురుస్తూ బడ్జెట్ తయారుచేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు.
రాష్ట్రం లోని అధికశాతం జనాభా వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి, అందుకనుగుణంగా వ్యవసాయరంగానికి అధికంగా నిధులను ప్రతిపాదించడం బహుదా ప్రశంసనీయమని, హర్షం వ్యక్తం చేశారు. పంట పెట్టుబడి మద్దతు పథకం, విద్యుత్ సబ్సిడీలకు, సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు సమకూర్చడం వల్ల, తెలంగాణలో వ్యవసాయరంగాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్న కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగుతాయని సీఎం కేసీఆర్ అన్నారు.
రాష్ట్రాభివృద్ధి కోసం ప్రణాళికలు సమర్థంగా అమలుచేసే విధంగా వార్షిక ఆర్థిక ప్రణాళిక రూపొందించిన ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థికశాఖ సలహాదారు జీఆర్ రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు.
గౌరవ అధ్యక్షా!