budgetరాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి ఈటల రాజేందర్‌ 2017-18 సంవత్సరానికి 1,49,646 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను మార్చి 13న శాసన సభలో ప్రవేశపెట్టారు. ప్రజలే కేంద్రంగా, ప్రజాసమస్యలే ఇతివృత్తంగా పాలన సాగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిరంతర మార్గనిర్దేశానికి అనుగుణంగా, అభివృద్ధి ఫలాలు అట్టడుగువర్గాలకు అందాలనే లక్ష్యంతో ఈ బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. ”మా ప్రభుత్వానికి ప్రజలే ప్రభువులు, వారికోసం పనిచేయడమే మాకర్తవ్యం” అని మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌ రాష్ట్ర శాసన సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇది నాల్గవసారి. రాష్ట్ర శాసన మండలిలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ బడ్జెట్‌ ను సమర్పించారు.

కాగా, ఎన్నడూ లేనివిధంగా సబ్బండ వర్ణాలకు ఈ బడ్జెట్‌లో సముచిత స్థానం దక్కడంతో ఆయా వర్గాలవారిలో సంబురాలు అంబరాన్నంటాయి. అన్ని కులవృత్తులకు భారీగా నిధులు, ప్రోత్సాహకాలు ప్రకటించిన ఈ బడ్జెట్‌ సకలజన హితం…సకలజన రంజకం…

Other Updates