గత నెల జనవరిలో ఒక స్టూడెంట్ కౌన్సిలింగ్‌కోసం వచ్చాడు. జశీఅషవఅ్‌తీa్‌ఱశీఅ లోపాలున్నాయి. మీ ూaతీవఅ్‌ం ను తీసుకొని రా! ఎందుకంటే ఒక్క రోజులో, ఒక్క సిట్టింగ్‌లో ఈ సమస్య తీరదు. అంటె, సరె! అని కాని మళ్ళీ ఆ రోజు ఎప్పుడొస్తుందో అన్నాడు? ఎందుకు! రేపు రండి అన్నాను. మానాన్న తిథి, నక్షత్రం చూసి రావాలి. ఇక్కడికి రావడానికి నాకు 3 నెలలు పట్టింది… ఇహ!! మా నాన్న రావాలి అంటె అవ్వన్ని కలవాలి. అప్పుడు మీరుండాలి? అన్నాడు. నేను అవాక్కయ్యాను?
పీకే సినిమాలో సమాజంలో మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలని హీరో అమీర్‌ఖాన్ ఒక రాత్రి బండను చెట్టు మొదట్లో పాతి తినే పాన్‌ను ఎర్రగా అయ్యేట్టు బండమీద వూసి దానిముందు చిల్లర డబ్బులు వేసి వెయిట్ చేస్తుంటాడు. కాలేజీ స్టూడెంట్స్ పరీక్షా సమయం… చదువుకుంటూ అక్కడికి వచ్చిన పిల్లలు వెంటనే ఆ బండకు దండం పెట్టడం, డబ్బులు వేసి గుంజీలు తియ్యడం… చాలా చిత్రంగా వుంటుంది. శాస్త్ర విజ్ఞానాన్ని చదువుకుంటూ… శాస్త్రాన్ని అనువర్తించకుండా వుండడం మన చదువుల్లో వున్న విషాదం.
టీవీల్లో, న్యూస్‌పేపర్లలో, సినిమాల్లో రంగురాళ్ళ గురించి, వాస్తు గురించి, బాబాల మాయలగురించి కథలు కథలుగా చెప్పుకుంటూ వాటిని పాటిస్తూ… నష్టం వచ్చినా సరే! మళ్ళీమళ్ళీ అలాంటి పాట్లే పడటం, నేటికి ఇంత ఆధునిక యుగంలో కూడా వాటి వల్లెనే మన జీవితాలు బాగుపడతాయని అనుకోవటం నేటి సమాజం ఇంకా ఎదగాల్సిన అవసరాన్ని చెపుతుంది. నిజానికి ఎందుకు ప్రజలు, చదువుకున్నవాళ్ళు, చదువుకోని వాళ్ళు, అధికారులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు. అందరూ ఒకరకమైన భయం. అభద్రతాభవాలతో వుండడంవలననే వాళ్ళు శక్తిపైన, నైపుణ్యాలపైన నిర్మించుకోవాల్సిన వ్యక్తిత్వం కాస్తా అపనమ్మకం, భయం పునాదులపైన నిర్మించబడుతుంది. దాంతో ప్రతి విషయం వారికి ఆందోళన కలుగజేస్తుంది. భయంతోనే జీవిస్తారు. పరీక్ష పాస్‌కావాలంటే కావాల్సింది ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరంలేదు. చదవాల్సిన సిలబస్‌ను అనుకున్న పర్సంటేజ్ కోసం చదివి దానిని అభ్యాసం చేస్తే తప్పకుండా ‘పాస్’ కాగలం అని ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది నిరూపిస్తూనే వున్నారు.
గత సంవత్సరం ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంకోసం వెతుకున్న అబ్బాయిని తల్లిదండ్రులు తీసుకొని వచ్చి కొండంత బాధలో వున్నామని, వాడికి వుద్యగం రావటంలేదని, ఉద్యోగంకోసం, పూజలు, వ్రతాలు, దీక్షలు బాబుతోపాటు మేము చేసామని చివరకు వాస్తుదోషాలు, ఉంగరాలు అన్నిరకాల సవరణలు భక్తితో చేసామని ఒక్కటి కూడా ఫలితం ఇవ్వలేదని, చివరకు ఒకరి సలహాతో ఇక్కడికి వచ్చామని ఎలాగైన మా బాబులో వున్న లోపాలను సవరించి ఉద్యోగం వచ్చేటట్టు చెయ్యండి అని అడిగారు.
పై సంఘటనలు వుదాహరణలు ఇలా మనకు రకరకాల పనులు అనుకున్నట్టు జరుగకపోతే వెంటనే ఎవరిమీదకు నెడదామా అని, మన పొరపాట్లకు ఎవరిని బాధ్యులను చేద్దామా అని, నింద తనమీదికి రాకుండా చూడడానికి తాపత్రయపడతారు. చివరకు తాను పెట్టుకున్న ఉంగరాలు, తిథి, వారాలను, గ్రహస్థితిని, దుష్టశక్తులను దేవుని అనుగ్రహాన్ని అన్నింటిమీద నెట్టి వాటి ఫలితమే ఈ చేటుకుకారణమేమో అని ఊహించుకుంటారేతప్ప, పని జరగక పోవడానికి తన బాధ్యత ఎంత అని ఆలోచించరు. తను అనుకున్న పని జరగాలంటే తనకు ఎన్ని నైపుణ్యాలు అవసరమో గుర్తించి వాటిని అభివృద్ధి పరచకుండా ఎవరి మీదకో ఒకరిమీద నెపం వేయడం, ఎవరూ లేకపోతే పై వాటిపై నెట్టివేసి తను సేఫ్‌గా వుండడం మనిషికి అలవాటు. దీనిని సైకాలజీలో ఖీశ్రీఱస్త్రష్ట్ర్ శీతీ టఱస్త్రష్ట్ర్ తీవంజూశీఅంవ అంటాము. వీలైతే పోరాడు… లేకపోతే పారిపో! మనం ఎక్కువగా పారిపోవటాన్ని రకరకాల మాధ్యమాల ద్వారా చేస్తాము.మరికొందరు అన్నీ బాగుగా జరిగితే తన గొప్పనే అని, తప్పు జరిగితే ఇతరుల తప్పు అని తలుస్తారు.
ఇక్కడ మనము గుర్తించాల్సింది ఇన్ని పూజలుచేసినా, వ్రతాలు చేసినా, చేతికి అదృష్టరాళ్ళు తగిలిగించుకున్నా, వాస్తు దోషాలు సవరించుకున్నా, ఇంట్లో వున్న ఎందుకు మనకు లాభం జరుగలేదనే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. ఎందరు వీటిని ధరించిన తర్వాత ఇంకా ఎక్కువ వత్తిడి వస్తుందో మనం విశ్లేషించుకోవాలి.
శ్వాసం వేరు, నైపుణ్యాలు వేరు. ఏదో ఒక పద్ధతికి విశ్వాసం సిద్ధి కేవలం విశ్వాసంతో నేను ఏ విధమైన శిక్షణ లేకుండా నేను ఎన్నటికి ఆంగ్లంలో గలగలా మాట్లాడలేను, నేను ఎర్రరంగు ఉంగరం ధరించినంత మాత్రాన ఏ శ్రమలేకుండా, ప్రయత్నం లేకుండా, ఏ పని చేయకుండా నేను ధనవంతుడని కాలేను. కాబట్టి విశ్వాసం వేరు. నైపుణ్యాలు నేర్చుకొని వాటిని అభ్యాసంలో పెట్టడంవేరు. ఆ అబ్బాయి విషయంలో జరిగిందేమిటంటే, ఇంగ్లీషులో సరిగ్గా మాట్లాడడం రాదు, ఆత్మవిశ్వాసంగా ఏ పని చేయలేడు. అందువల్ల ముందు అతనిని ఇంగ్లీషు బాగా మాట్లాడే విధంగా శిక్షణకు పంపించి, ఆత్మవిశ్వాసం పెంపొందించేె శిక్షణ తర్వాత, ఉద్యోగం వచ్చింది. తమ విశ్వాసాలకు, నైపుణ్యాలను జోడిరచకండి. అవి వేరువేరు సిద్ధాంతాలు. మీరు, మీకిష్టమైన ఏ మత విశ్వాసాలనైనా పాటించండి. లేదా పాటించకండి. కాని ఏ వృత్తిలోనైనా సరే మీరు రాణించాలంటే ఒక్కటే మార్గం. వృత్తికి సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకోవటం వాటిని తప్పకుండా ఆచరించటం వాటిని నిరంతరం అభ్యాసం చేయటంవల్ల అప్పుడు తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు.
అనుకున్నది అనుకున్నట్లు జరగనప్పుడే మన మెదడు ఆందోళనకు గురౌతుంది. ఇక ఇలాంటివి వరుసగా జరిగితే పూర్తిగా మానసిక జబ్బుగా దారితీస్తుంది. కాబట్టి సమస్య ఎదురుకాగానే బెంబేలుపడకుండా, సెంటిమెంటల్‌గా దేనికి అటాచ్ చేయకుండా, తరచితరచి చూస్తే సమస్య వెనకవున్న కారణం వెలుగులోకి వస్తుంది. ఆ కారణాన్ని పరిష్కరించే బాధ్యతను తీసుకోవడానికి ముందుండాలి. బాధ్యత ఎప్పుడైతే తీసుకుంటామో, అప్పుడు సమస్యపై ఆధిపత్యం వస్తుంది అన్నది సూత్రం. కాబట్టి మీ జీవితంపట్ల బాధ్యతగా మెలగండి. మీ జీవితంలో భాగం కానివి మీపై పెత్తనం చెలాయించె విధంగా మసలుకోవద్దు.. మీ బాధ్యత, మిమ్మల్ని మీ జీవితంలో జరిగే ప్రతీ పనిపై మీకు ఆధిపత్యం వస్తుంది. దాన్ని మనం ఆత్మ విశ్వాసం అంటాం. పని జరిగిన, జరుగకపోయినా ఆత్మవిశ్వాసంతో జరిగే పరిణామాలను ఆహ్వానించగలము. ప్రతి విజేత పాటించే సూత్రం ఇదే.