harish-raoఇరిగేషన్‌ శాఖకు సాంకేతికపరమైన సహకారం అందిస్తామని

ముందుకు వచ్చిన బిట్స్‌, ఐఐటి, నాబార్డ్‌ సంసశీవలతో కీలకమైన

ఒప్పందాలు చేసుకున్నారు. ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌ రావు.

ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ కే జోషి సమకూజుంలో ఫిబ్రవరి

4న ఈ యంఓయుల పై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో

ఐఐటి డైరెక్టర్‌ ప్రొ. దేశాయి, బిట్స్‌ డైరెక్టర్‌ ప్రొ. వి.ఎస్‌ రావు,

నాబార్డ్‌ డైరెక్టర్‌ సీ.వీ.వీ. సత్యనారాయణ లు ఉన్నారు. ఇరిగేషన్‌ శాఖ

ముఖ్యకార్యదర్శి అలాగే ఈ మూడు సంస్ధల ప్రతినిధులు ఒప్పంద

పత్రాలను మంత్రి హరీష్‌ రావు ముందు పరస్పరం మార్చుకున్నారు.

 

ఈ సందర్భంగా ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌ రావు మాట్లడుతూ… ఇరిగేషన్‌

శాఖ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ మూడు సంస్ధలతో ఎంఓయు చేసుకొని కొత్త

ఒరవడికి శ్రీకారం చుట్టింది. దీని ఫలితం రానున్న రోజుల్లో కనబడుతుంది. మిషన్‌

కాకతీయ లాంటి కార్యక్రమం ఇప్పటికే మంచి ఫలితాలు సాధిస్తుంది. ఐఐటీ, బిట్స్‌,

నాబార్డ్‌ లాంటి సంస్ధల సహాకారం తీసుకొని దేశానికే అదర్శంగా నిలుస్తుందని

పేర్కొన్నారు. ఇరిగేషన్‌ శాఖ ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లకూజ్యుంతో

ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో థర్డ్‌ పార్టీ చెక్‌ అవసరం అని భావిస్తున్నాం.

ఎక్కడ లోటుపాట్లు ఉన్నా సరి చేసుకొవడానికి వీలు ఉంటుంది. ఈ మూడు సంసశీవ

ల నుండి అలాంటి సహకారం ఇక ముందు నుంచి ఉంటుందన్నారు. నాబార్డ్‌కుఅనుసంధానంగా పని

చేస్తున్న వాప్కొస్‌ సంస్ధ

రాష్ట్రంలోని వివిధ జిల్లాలను

ఎంచుకొని మిషన్‌ కాకతీయ

ఫలితాలను విశ్లేషిస్తుంది.

ఐఐటీ, బిట్స్‌లు పైలట్‌

ప్రాజెక్టులను ఎంచుకొని

ఇరిగేషన్‌ శాఖలో

జరుగుతున్న పనులపై వారి

విద్యార్ధులు, అధ్యాపకులతో

అధ్యయనం చేయించాలని

వారికి సూచించారు. పీహెచ్‌

డిలు, యంటెక్‌లు చేస్తున్న

విద్యార్దులకు ఇరిగేషన్‌ శాఖ లో జరగుతున్న పనిపై

ప్రత్యేకమైన అసైన్‌ మెంట్‌లను రూపొందించాలని

తెలిపారు. ఈ మధ్య ఢిల్లీలో జరిగిన ప్రపంచ బ్యాంక్‌

సమావేశంలో నాగార్జున సాగర్‌ ఆధునీకరణ పనుల

విషయంలో, ప్రాజెక్టుల పని తీరు, పురోగతిపై

ఎప్పటికప్పుడు వాట్సప్‌ ద్వారా మానిటరింగ్‌ చేస్తున్న

విధానాన్ని ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులు ప్రశంసించిన

సంగతిని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.

ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజిలో వస్తున్న కొత్త పుంతలను

ఇరిగేషన్‌ శాఖకు బిట్స్‌, ఐఐటీ సంస్ధలు ఎప్పటికప్పుడు

తెలియ చేయాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు.

ఇరిగేషన్‌ శాఖలో పని చేస్తున్న ఇంజనీర్లకు ట్రైనింగ్‌

క్యాంప్‌లు నిర్వహించడంలో ఈ సంస్ధలు పూర్తిసాశీవయిలో

సహకరించాలని అన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు

సంబంధించిన సమగ్రమైన నాలెడ్జ్‌ డాట బేస్‌ను

రూపొందించడంలో పూర్తిసాశీవయిలో సహకరించాలని

అన్నారు. ఇరిగేషన్‌శాఖలో పారదర్శకత్వం పెంచడంలో

భాగంగా వెబ్‌ సైట్‌ సేవలను మరింత ఆధునీకరించడానికి,

విస్తృతపరచాడానికి సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా ఐఐటీ(హైదరాబాద్‌) డైరెక్టర్‌

దేశాయి, బిట్స్‌ (హైదరాబాద్‌)డైరెక్టర్‌ ప్రొ.వీఎస్‌ రావు ,

నాబార్డ్‌ డైరెక్టర్‌ సీవీవీ సత్యనారాయణలు మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రంగంలో కొనసాగుతున్న

అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పూర్తి సహకారాన్ని

అందిచాడనికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మిషన్‌

కాకతీయలాంటి కార్యక్రమంలో తమ సంస్ధలు పాల్గొన్నడం

సంతోషించాల్సిన సందర్భం అని వారు అన్నారు.

ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఇరిగేషన్‌ శాఖ ముఖ్య

కార్యదర్శి ఎస్‌.కె.జోషి మాట్లాడుతూ మూడు సంసశీవ్ధలతో

ఒకే రోజు ఎం.ఓ.యు కుదుర్చుకోవడం చరిత్ర అని

అన్నారు. వారి సేవలను సమర్ధవంతంగా

ఉపయోగించుకుంటామని అన్నారు

Other Updates