jogu-ramannaపూలే జయంతి సభలో మంత్రి జోగు రామన్న 

బీసీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని అటవీ, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 11న రవీంద్రభారతిలో జరిగిన మహాత్మా జ్యోతిబా పూలే 190వ జయంతి ఉత్సవ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటై రెండు సంవత్సరాలు పూర్తి కాకుండానే సంచార జాతుల కుంటుబాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. సంచార జాతులను జాగృతపరచి రెండు వేలమంది విద్యార్థులను గురుకుల విద్యాలయాల్లో చేర్పించామని తెలిపారు. జ్యోతిబా పూలే 1890లోనే మహిళా విద్యకు ప్రాధాన్యమి చ్చాడన్నారు. ఆయన ఆశయాలను అమలు పరచడానికి కృషిచేస్తామన్నారు. ప్రభుత్వ పథకాల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించడానికి కృషి చేస్తామన్నారు. తరచూ అగ్రవర్ణాలను నిందిస్తుండడం కాకుండా బీసీలు తమలోతాము సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక బిసి రెసిడెన్షియల్‌ కళాశాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నామమాత్రంగా నడుస్తున్న బీసీి స్టడీ సర్కిళ్ళ పనితీరును మెరుగుపరుస్తామని తెలిపారు. రూ. 3 కోట్ల వ్యయంతో బీసీి స్టడీ సర్కిల్‌ భవనాన్ని నిర్మించి ఏడాది పొడవునా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో బీసీ భవనాలు నిర్మిస్తామన్నారు.

ఏటా 50 వేలమందికి స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. బిసి సబ్‌ప్లాన్‌ అమలుకు కూడా అందరితో చర్చించి ప్రత్యేక నిధి ఏర్పాటగయ్యే విధంగా చూస్తామన్నారు. బీసీల అభివృద్ధి కోసం మేధావులు, బీసీ సంఘాలు చర్చించుకుని ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారని జోగు రామన్న తెలిపారు. శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ మాట్లాడుతూ కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా జ్యోతిబా పూలే ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకునేలా ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయాలన్నారు. ఎం.పి. వి.హన్మంతరావు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, టి.పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితర నాయకులు ప్రసంగించారు. ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన ఆనంద్‌ అనే విద్యార్థిని సత్కరించారు. పూలే జయంతి ఉత్సవ కమిటీ ఛైైర్మన్‌ చక్రహరి రామరాజు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

Other Updates