యూరోప్‌లోని పోర్చుగల్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ టూరిజం ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన ”విజిట్‌ తెలంగాణ ” ఫిల్మ్‌కు ‘బెస్ట్‌ ఆసియన్‌ టూరిజం ఫిల్మ్‌ అవార్డు’ గెలుచుకున్న సందర్భంగా అవార్డును తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం స్వీకరించారు. ఫిల్మ్‌ మేకర్‌ సత్యనారాయణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతర్జాతీయ స్థాయి టూరిజం ఫెస్టివల్‌లో ఇండియా లోనే తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మొదటిసారిగా’ బెస్ట్‌ ఆసియన్‌ టూరిజం ఫిల్మ్‌’ అవార్డు సాధించిందని టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు.

తెలంగాణ పర్యాటక శాఖ అరుదైన మైలురాయిని సాధించిందన్నారు. ఇంటర్నేషనల్‌ టూరిజం ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో తెలంగాణ టూరిజం కు అవార్డు రావడం వల్ల తెలంగాణ టూరిజం అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేందుకు అవకాశం ఉందన్నారు. గత సంవత్సరం అంతర్జాతీయ స్థాయి టూరిజం ఫెస్టివల్‌లో తెలంగాణ పర్యాటక శాఖ ‘బెస్ట్‌ లొకేషన్స్‌’ విభాగంలో ఫిల్మ్‌ అవార్డును గెలుచుకున్నట్లు వెల్లడించారు.

అంతర్జాతీయ స్థాయి టూరిజం ఫెస్టివల్‌ను హైదరాబాద్‌ నగరంలో నిర్వహించటానికి టూరిజం ఫెస్టివల్‌ నిర్వాహకులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. త్వరలో అంతర్జాతీయ టూరిజం ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకుల బందం హైదరాబాద్‌ నగరంలో పర్యటించటానికి వస్తారని వివరించారు.

Other Updates