tsmagazine

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ మొదటి జనరల్‌ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మొదటి విడతగా 200 మంది బ్రాహ్మణులకు ఆరోగ్య బీమా పథకం క్రింద హెల్త్‌ కార్డులను అందిస్తున్నట్టు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఛైర్మన్‌ మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణా చారి తెలిపారు.

గురువారం సచివాలంయలో 100 మంది బ్రాహ్మణ లబ్దిదారులకు నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో హెల్త్‌ కార్డులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ వనం జ్వాలా నర్సిహ్మరావు, ఢిల్లీ లో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా. ఎస్‌. వేణు గోపాలచారి, సభ్యులు యం.ఎల్‌.సి. పురాణం సతీష్‌, అష్టకాల రాంమోహన్‌ తదితర సభ్యులతో పాటు నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ రీజినల్‌ మేనేజర్‌ శ్రీమతి జి.సరళ , సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ జి.సుందర్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా.కె.వి.రమణా చారి మాట్లాడుతూ న్యూఢిల్లీ లో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా.ఎస్‌ వేణుగోపాల చారి చైర్మన్‌గా యం.ఎల్‌.సి పూరణం సతీష్‌ కుమార్‌, సి.ఎల్‌. రాజ్యం సభ్యులుగా ఉన్న కమిటీ పలు బ్రాహ్మణ సంఘాలు, అసోసియేషన్లతో సమావేశమై ప్రముఖ ఇన్సూరెన్స్‌ కంపెనీల నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తక్కువ రేటుకు కోటేషన్‌ ఇచ్చి నందుకు వారికి ఈ బాధ్యతను అప్ప గించినట్టు ఆయన తెలిపారు. వంద మంది బ్రాహ్మణ లబ్ధిదారులకు ఈ రోజు హెల్త్‌ కార్డులను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఉపాధ్యక్షులు వనం జ్వాలా నర్సింహ్మ రావు మాట్లాడుతూ, 1000 రూ. లతో ఇన్సూరెన్స్‌ చేస్తే 3900 రూ. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ చెల్లిస్తుంద న్నారు. ఏడాది పాటు ఈ ఇన్సూరెన్స్‌ వర్తి స్తుందని ఆయన తెలిపారు. జర్నలిస్టులు, ఉద్యోగస్తులకు ప్రభుత్వం కార్పొరేట్‌ తరహలో వైద్యాన్ని అందిస్తున్నట్లుగానే పేద బ్రాహ్మణులకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో హెల్త్‌ కార్డులు జారీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కుటుంబంలో 4 గురికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఏడాదికి 2 లక్షల రూపాయల వరకు వైద్యసేవలు పొందవచ్చన్నారు.

వేణుగోపాలచారి మాట్లాడుతూ 19 నుండి 60 సంవ త్సరాల వయసున్న ప్రతి ఒక్కరు ఈ హెల్త్‌ పథకం కింద అర్హులన్నారు. 60 సంవత్సరాల పైబడిన వారికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే సి.యం.ఆర్‌.ఎఫ్‌ ద్వారా 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందజేస్తామన్నారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కోసం ఆదాయ, కులధవీకరణ పత్రాలను ఆన్‌ లైన్‌ లో అప్‌ లోడ్‌ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పురాణం సతీష్‌ మాట్లాడుతూ, దేశలోనే మొదటి సారి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రాష్ట్ర బడ్జెట్‌లో 100 కోట్లు కేటాయించిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకే దక్కిందన్నారు. బ్రాహ్మణులలో కూడా ఎందరో నిరుపేదలు ఉన్నారని వారిని ఆదుకొనుటకు అక్షయ నిధిని ఏర్పాటు చేశామని ఉన్నతస్థానంలో ఉన్న బ్రాహ్మణులు, పేద బ్రాహ్మణులకు చేయూతనందించ డానికి విరాళాలు అందించాలని సూచించారు. అక్షయ నిధికి తన వంతుగా లక్షా ఒక వెయ్యి నూట పదహార్లు అందించారు. అదే విధంగా చకిలం అనిల్‌ కుమార్‌ లక్షా నూట పదహారు రూపాయల చెక్కును బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ చైర్మన్‌ డా.కె.వి.రమణాచారికి అందించారు.

ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించి నందుకు గాను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో డా.కె.వి.రమణాచారిని ఈ సందర్భంగా సన్మానించారు.

Other Updates