నీరు పంచభూతాల్లో ఒకటి. ఆకాశం, భూమి, అగ్ని, వాయువు, లేకుంటే మనిషి మనుగడకే ప్రమాదం. అలాగే నీరు లేకుంటే కూడా సృష్టిలోని సకల చరాచర జీవులు బతుకలేవు.
భూమి మీద 79 శాతం సముద్రం నీరు ఉన్నప్పటికీ, తాగటానికి పనికి రావు. సంవత్సరకాలంలో కేవలం మూడు లేదా నాలుగు నెలల పాటు కురిసే వర్షాలే సకల జీవకోటికి ఆధారం. పెరుగుతున్న కాలుష్యం, ఒజోన్ పొరకు ఏర్పడిన ప్రమాదం వలన ఆ వర్షాలు కూడా సరిగ్గా పడకపోవడంతో ప్రంపంచంలో మంచి నీటి కోసం యుద్దాలు మొదలవుతున్నాయి.
హైదరాబాద్ నగర జనాభా ఒక కోటి దాటింది. నగరం చుట్టూ పెరుగుతున్న పట్టణీకరణ ప్రభావం మంచి నీటి వ్యవస్థ పై పెను ప్రభావాన్ని చూపిస్తున్నది. అందరికీ మంచినీరు అందించాలనే లక్ష్యంతో 1989 లో ఏర్పడిన ‘హైదరాబాద్ మంచి నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల మండలి’ గత మూడేళ్ళ కాలంలో విస్త తమైన చర్యలకు శ్రీకారం చుట్టింది.
నాటి గండిపేట, హిమయత్ సాగర్, మంజీరా, సింగూరు జలాలకు అదనంగా కష్ణా, గోదావరి నదుల నుండి నీటిని తీసుకువస్తూ ప్రజలకు అందించడం జరుగుతున్నది. ఇది ఎన్నో వ్యయ ప్రయాసల కార్యక్రమం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు జలమండలి అధికారులతో సమావేశమయ్యారు. నగర ప్రజలకు మంచినీటిని అందించడంలో తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఇందుకోసం రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమావేశంలో విస్తతంగా చర్చించారు.
నగరానికి సరఫరా చేస్తున్న గండిపేట, హిమాయత్‌సాగర్, సింగూరు, మంజీరా నీటిని ప్రస్తుతానికి తగ్గించి కేవలం కష్ణా, గోదావరి నదుల నీటిని మాత్రమే ఉపయోగించే విధంగా చర్యలు తీసుకొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఎంత వ్యయమైనా భరిస్తుందని, నగర ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా కావలిసినన్ని రిజర్వాయర్లను నిర్మించాలని, నీటి సరఫరా అన్ని ప్రాంతాలకు జరిగే విధంగా పైప్ లైనులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బంగారు తెలంగాణ సాధనలో మహిళలు ఎవరు కూడా మంచినీటి కోసం బిందెలు, పాత్రలు పట్టుకొని మైళ్ళ దూరం నడిచి వెళ్ళే పరిస్థితి వుండవద్దని అధికారులను ఆదేశించడం జరిగింది.
ప్రస్తుతం 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న కష్ణా నుండి మంచి నీటిని తీసుకుని వస్తున్నాం. అలాగే, నగరానికి 180 కిలో మీటర్ల దూరంలోని గోదావరి నుండి కూడా మంచి నీటిని తీసుకుని వస్తున్నాము. నగరంలోని అన్ని ప్రాంతాలతో పాటుగా, నగర శివారు లోని ఔటర్ రింగ్ రోడ్ లోపల వున్న సుమారు 190 గ్రామాల ప్రజలకు కూడా మంచి నీటిని అందించే విధంగా హైదరాబాద్ జలమండలి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది.
రూ. 1900 కోట్ల వ్యయంతో హడ్కో ప్రాజెక్ట్ కింద కొత్తగా 56 రిజర్వాయర్లను నగరానికి చుట్టు పక్కల ఉన్న అన్ని మున్సిపల్ సర్కిళ్లలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. వీటిలో 20, ఏప్రిల్, 2017 న కూకట్‌పల్లి, హుడా మియాపూర్, నల్లగండ్ల, గోపన్నపల్లిలో రిజర్వాయర్లను రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కే. తారకరామారావు ప్రారంభించారు. మరికొన్ని రిజర్వాయర్లను ఆగస్ట్ 2017 నాటికి ప్రారంభించే అవకాశాలున్నాయి. మరోవైపు 338 కోట్ల వ్యయంతో ప్రపంచ బ్యాంకు ఆర్ధిక సహాకారంతో మల్కాజ్‌గిరి ప్రాంతం లో 9 రిజర్వాయర్లకు అంకురార్పణ జరిగింది. అన్ని రిజర్వాయర్లు అయిపోయిన రోజు నగర ప్రజలకు మంచినీటికోసం యుద్ధాలు చేయాల్సిన అవసరం ఉండదు.
ప్రస్తుతం ఉన్న 9.65 లక్షల కనెక్షన్లకు అదనంగా కొత్తగా నిర్మించిన రిజర్వాయర్లతో ఒక లక్ష కొత్త కనెక్షన్లు ఇవ్వాలని జలమండలి ప్రతిపాదించింది. ఇందుకోసం బి.పి.ఎల్. కుటుంబాలకు కేవలం ఒక్క రూపాయికే కొత్త కనెక్షన్లు ఇవ్వడంతో పాటుగా ఇతరులకు నిబంధన ప్రకారం డబ్బులు చెల్లించే విధంగా ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని స్వయం సహాయక బంద సభ్యుల ద్వారా జలమండలి విస్తత ప్రచారాన్ని కూడా నిర్వహించడం జరుగుతున్నది.కోటి మంది గొంతుల దాహాన్ని తీర్చేవిధంగా అపర భగీరథుడు ముఖ్యమంత్రి కే.సీ.ఆర్., మంత్రి కే.టి.ఆర్. ఆదేశాలతో జలమండలి పలు సంస్కరణలను చేపట్టింది. ఒక వైపు కొత్త రిజర్వాయర్లు, పైప్ లైన్ల నిర్మాణం. మరో వైపు నీటి సక్రమ వినియోగం కోసం సాంకేతికరంగాన్ని, నూతన టెక్నాలజీని ఉపయోగించు కుంటూ ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా కషి చేయడం జరుగుతున్నది. భవిష్యత్తులో జంట నగరాల ప్రజలు మంచినీటి కోసం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం రెండు భారీ రిజర్వాయర్లను నిర్మించే ప్రతిపాదనలతో సర్వే నిర్వహించడం జరుగుతున్నది. 20టిఎంసిల సామర్థ్యంతో గోదావరి జలాలను శామీర్‌పేట్‌కు దగ్గరలోని కేశవపూర్ గ్రామంలో, అలాగే
కష్ణా నీటిని రిజర్వ్ చేసుకునే విధంగా చౌటుప్పల్ దగ్గరలోని దేవలమ్మ నగరం లోను నిర్మించే ప్రతిపాదనలతో ఉంది.
బంగారు తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రజలకు మంచినీటి కోసం ఇబ్బందులు ఉండవు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ‘మిషన్ భగీరథ’తో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మంచినీరు అందించడం మరోవైపు నూతనంగా రిజర్వాయర్ల నిర్మాణంతో జంట నగరాలు, శివారు గ్రామాలకు కూడా మరో 30 ఏళ్ల వరకు నీటి కోసం ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. జలమండలి చేస్తున్న కషి మరో 30 ఏళ్ల వరకు నీటికోసం ఇబ్బందులు లేకుండా వుంటుంది.
నీరు ఎలాగు అందుబాటులో ఉంటుందని వధా చేయడం తగదు. ప్రజలు నీటి వధాని తమకు తామే అరికట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. వందల కిలో మీటర్ల దూరం నుండి తీసుకొస్తున్న మంచినీటి కోసం ప్రభుత్వం ప్రతి వేయి లీటర్లకు 45 రూపాయలు ఖర్చు చేస్తూ సబ్సిడిపై బస్తీల్లో కేవలం 7 రూపాయలకు, ఇతర ప్రాంతాల్లో 10 రూపాయలకే జలమండలి నీటిని అందిస్తున్నది. వేలాది మంది కార్మికులకు యంత్రాలు, టెక్నాలజీ తోడయితే గానీ మన ఇంటికి నల్లాల ద్వారా మంచి నీరు రాదు. రాబోయే తరానికి నీటిని అందించాలంటే మనం ఈ రోజు నుంచే నీటి పొదుపును అమలు చేయాలి.
కన్నొజు మనొహరాచారి