KCRవరంగల్‌ నగరంలోని భద్రకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున బంగారు కిరీటం తయారుచేయిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం కె.సి.ఆర్‌. దంపతులు మొదటిసారిగా జనవరి 11న అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నగరంలో పర్యటనలో భాగంగా భద్రకాళి ఆలయానికి విచ్చేసిన చంద్రశేఖరరావు దంపతులకు వేదపండితులు ఆయల మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పట్టువస్త్రాలను అందజేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహామండపంలో ముఖ్యమంత్రి దంతులకు వేదపండితులు, ఆలయ అర్చకులు మహదాశీర్వచనం చేశారు. భద్రకాళి ఆలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు ధర్మకర్తలను, పాలకమండలి సభ్యులను అధికారులను హైదరాబాద్‌కి రప్పించి, చర్చిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.

Other Updates