నాలుగువైపులా కిలోమీటర్ల దూరం విస్తరించి, కోటి జనాభాకి చేరుకుంది మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌. ఇతర రాష్ట్రాల ప్రజలతోపాటు, ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలు సైతం ఇక్కడ నివసిస్తున్నారు. వీరందరికి ఎన్నో అవసరాలు, మరెన్నో సమస్యలు. దేశంలోనే ఐదవ అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పన్నులు వసూలు చేయడం, ప్రజావసరాలను తీర్చడంలో, ఉపాధి అవకాశాలను కల్పించడంలో దేశంలోని ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్‌లతో పాటు ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.భాగ్యనగరానికి--‘బల్దియా’-నగిషీలు26

మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రజావసరాలను, ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు చేదోడువాదోడుగా ఉంటూ సహాయసహకారాలను అందిస్తోంది. కేవలం రికార్డు స్థాయిలో పన్నులు వసూలు చేయడమే కాకుండా నగరంలోని నిరుద్యోగులను, యువకులను, మహిళలను, ఇతర రంగాల వారిని ప్రోత్సహిస్తూ, కొత్తకొత్త పథకాలను రూపొందిస్తోంది జిహెచ్‌ఎంసి. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడంతో పాటు బంగారు తెలంగాణ సాధనలో తనవంతు పాత్రను పోషిస్తోంది.

మున్సిపల్‌ కార్పోరేషన్‌ అంటే కేవలం పన్నులు వసూలు చేయడమే కాదు, పన్నులు కడుతున్న ప్రజల అభివృద్ధి సైతం తమ లక్ష్యమంటూ దూసుకుపోతోంది. దేశంలో ఏ కార్పొరేషన్‌ చేయని, ప్రవేశపెట్టని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు పేద, బడుగు, బలహీన, నిరుద్యోగ యువతకు ఆసరాగా నిలుస్తున్నారు.

శ్రీ రూ.5 కే భోజన పథకం
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని గుర్తించిన బల్దియా, పేదలకు, భిక్షాటన చేసుకునే వారికి, అడ్డాకూలీలకు, కేవలం 5రూపాలయకే ఒక్కపూట వేడివేడి భోజనాన్ని పెడుతూ వారి కడుపు నింపుతోంది. ‘అక్షయ పాత్ర ఫౌండేషన్‌’ సహకారంతో ఈ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. 5 రూపాయలకే భోజన పథకాన్ని నగరంలోని కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, గ్రంథాలయాలు, అడ్డాకూలీలు ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. నగరంలో 50 సెంటర్లకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందించింది బల్దియా.

శ్రీ నైట్‌ షెల్టర్స్‌
హైదరాబాద్‌ నగరానికి ప్రతి రోజు కొన్ని వేల మంది వైద్య చికిత్స కోసం వస్తుంటారు. ఆస్పత్రుల వద్ద ఉండడానికి సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలా వచ్చే రోగుల బంధువులకు రాత్రి, రక్షణ నివ్వడానికి ‘నైట్‌ షెల్టర్‌’లను ఏర్పాటు చేసింది. వైద్యానికి వచ్చే ప్రజలు లాడ్జీలల్లో ఉండడానికి ఆర్ధిక స్థోమతలేకపోవడంతో రోడ్లపైనే నిద్రిస్తున్నారు. వీరికి సౌకర్యంగా ఉండేందుకు ఈ ‘నైట్‌ షెల్టర్‌’లను ఏర్పాటు చేసింది.

శ్రీ డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌
నిరుద్యోగులు ఉపాధి లేక దారితప్పకుండా వారికి అండగా ఉంటూ నగరంలోని డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగిన నిరుద్యోగ డ్రైవర్లకు ‘డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌’ పథకం ద్వారా కార్లను అందిస్తోంది. బ్యాంకు రుణాల ద్వారా కార్లను అందించి వాటిని జిహెచ్‌ఎంసి కార్యాలయాలతో పాటు నగరంలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ట్రావెల్స్‌, సాఫ్ట్‌వేర్‌ సంస్థలలో ఉపాధి అవకాశాలను కల్పించింది. కేవలం యువకులకే కాకుండా మహిళలను సైతం ప్రోత్సహించడానికి ‘షీ క్యాబ్‌’లను సైతం అందించింది. మొదటి దశలో 103 కార్లను, రెండవ దశలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేతులమీదుగా 303 మంది లబ్ధిదారులకు కార్లను అందించింది. మూడవ విడతలో మరో 600 కార్లను అందించనుంది జిహెచ్‌ఎంసి.

శ్రీ ఆల్‌టైం రికార్డు
ఆస్తి పన్ను వసూళ్లలో రికార్డును సృష్టించింది. పదకొండు వందల కోట్ల ఆస్తి పన్నును వసూలు చేసి ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. ఆస్తి పన్ను సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించడానికి ‘ఆస్తిపన్ను పరిష్కారం’ పేరుతో ప్రారంభించిన కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. 2015 మార్చి 31 వరకు ఆదివారాల్లో ప్రతి సర్కిల్‌ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆస్తిపన్ను, వాణిజ్యపన్ను, భవన నిర్మాణ అనుమతి తదితర పన్నులను చెల్లించేందుకు ‘నెట్‌ బ్యాంకింగ్‌’ను అమల్లోకి తీసుకు వచ్చింది. నగరంలోని వివిధ బ్యాంకులకు చెందిన 555 బ్రాంచీలతో జిహెచ్‌ఎంసి.

శ్రీ సిగ్నల్‌ ఫ్రీ
హైదరాబాద్‌ నగరాన్ని సేఫ్‌ సిటీగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ట్రాఫిక్‌, క్రైం పోలీసు, తదితర శాఖల సమాచారంతో నగరంలో అన్ని జంక్షన్ల, కూడళ్ల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. దీనితో పాటు ‘సిగ్నల్‌ ఫ్రీ’ హైదరాబాద్‌గా మార్చడానికి ప్రయోగాలు సైతం మొదలుపెట్టింది. జంక్షన్లు, ఇతర ప్రదేశాల్లోని ట్రాఫిక్‌ సిగ్నల్‌లను అనుసంధానం చేస్తూ ఒక్క సారి గ్రీన్‌ సిగ్నల్‌ వద్ద ప్రయాణం మొదలైతే ఆ రోడ్డులోని అన్ని సిగ్నల్ల వద్దకు నిర్ణీత సమయంలో చేరే సరికి రెడ్‌ సిగ్నల్‌ లేకుండా ప్రయాణం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో నగరంలోని ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు కాలుష్యం తగ్గే అవకాశం ఉంది.

గ్రీన్‌ కర్టెన్‌
గ్రేటర్‌ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా బహిరంగ మూత్ర విసర్జనను నిరోధించడంతో పాటు, గోడలపై వాల్‌ రైటింగ్‌లను నివారించడానికి ‘గ్రీన్‌ కర్టెన్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. నగరంలోని ప్రధాన మార్గాల ఫుట్‌ పాత్‌లపై ఆకర్షనీయమైన మొక్కలను పెంచడం, బయో టాయిలెట్లను ఏర్పాటు చేస్తోంది. స్త్రీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోంది. ‘గ్రీన్‌ కర్టెన్‌’లో భాగంగా సెక్రటేరియట్‌, ఏజి ఆఫీస్‌, రవీంద్రభారతి, రాజ్‌ భవన్‌రోడ్‌, జి.హెచ్‌.ఎం.సి ప్రధాన కార్యాలయం తదితర రోడ్ల వెంబడి గల ఫుట్‌పాత్‌ల వెంట ఏర్పాటు చేసిన మొక్కలతో సత్ఫలితాలు ఇవ్వడమే కాకుండా నగర అందాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ గ్రీన్‌ కర్టెన్‌ ను నగరంలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల విస్తీర్ణంలో పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు బల్దియా అధికారులు. దీనితో పాటు టాయిలెట్స్‌ లేని 100 ప్రభుత్వ, ఎయిడెడ్‌ బాలికల పాఠశాలలో టాయిలెట్లను నిర్మించి వాటి నిర్వహణను చేపట్టాలని నిర్ణయించింది.

పార్కుల అభివృద్ధి
జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని పరిరక్షించడానికి చర్యలు చేపట్టింది. బల్దియా పరిధిలో 3086 ఖాళీ స్థలాలున్నట్లుగా రికార్డులున్నాయి. వీటిని కబ్జాల నుంచి కాపాడడానికి ప్రహారీ గోడను నిర్మించడంతో పాటు వాటిలో చెట్లను పెంచాలని నిర్ణయించింది. పార్క్‌లను సుందరంగా తీర్చిదిద్ది కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. అఫ్జల్‌ గంజ్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో నిరుపయోగంగా ఉన్న అఫ్జల్‌పార్కును పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకువస్తోంది. దాదాపు 90 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ పార్కు ప్రస్తుతం కళావిహీనంగా మారింది. ఈ పార్కుకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ సహకారంతో పార్కును పునరుద్ధరించనున్నారు జిహెచ్‌ఎంసి అధికారులు.

శ్రీ కాల్‌ సెంటర్‌
పౌరసేవలకు సంబంధించిన ఫిర్యాదులను నేరుగా స్వీకరించడానికి, పరిష్కరించడానికి 24 గంటలు పనిచేసే కాల్‌ సెంటర్‌ 040 ` 21 11 11 11ను విజయవంతంగా నిర్వహిస్తోంది. దీని ద్వారా వర్షాలు పడినప్పుడు ఎక్కడైనా రోడ్లు నీటితో మునిగిపోయినా, డ్రైనేజీలు పొంగి పొర్లినపుడు, రోడ్డు మరమ్మతులు లాంటి అత్యవసర అవసరాలను సత్వరమే పరిష్కరిస్తోంది గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌.

శ్రీ సేవ్‌ పవర్‌
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యను దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ ఆదాలో బల్దియా తనవంతు సమాచారం అందిస్తోంది. ఇప్పుడున్న మెర్క్యురీ లైట్ల స్థానంలో ఎల్‌ఈడి లైట్లను వినియోగంలోకి తెస్తోంది. దీని ద్వారా దాదాపు 60 శాతం విద్యుత్‌ పొదుపు చేయవచ్చని జిహెచ్‌ఎంసి అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎల్‌ఈడీ లైట్లను చాంద్రాయణగుట్ట నుంచి నయాపూల్‌, హైటెక్‌ సిటీ నుంచి మాదాపూర్‌ వరకు పైలెట్‌ పద్ధతిన ఏర్పాటు చేశారు. ఇది సత్ఫలితాలివ్వడంతో ఈ లైట్లను నగరంలోని ఇప్పుడున్న నాలుగున్నర లక్షల వీధిలైట్ల స్థానంలో ఎల్‌ఈడీ లైటింగ్‌లను ఏర్పాటు చేయనున్నారు.

శ్రీ చెరువుల అభివృద్ధి
నగరంలోని చెరువులు మురికినీటి కుంటలు, కబ్జాలకు గురవుతున్నాయి. వీటి పరిరక్షణకు జిహెచ్‌ఎంసి నడుం బిగించింది. జిహెచ్‌ఎంసి పరిధిలో 138 చెరువులున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనిలో భాగంగా ప్రతి సర్కిల్‌లో కనీసం రెండు చెరువులను గుర్తించి వాటిలో ఆక్రమణలను తొలగించి విహార యాత్రా స్థలాలుగా అభివృద్ది చేయాలని నిర్ణయించారు. చిన్నపిల్లల ఆట వస్తువులు, బోటింగ్‌, వాకింగ్‌వే, క్రీడా స్థలం తదితర సౌకర్యాలను కల్పించనున్నారు. వీటి అభివృద్ధి నమూనాలను సిద్ధం చేసే ప్రాజెక్టు పనుల్లో ఇంజనీరింగ్‌ అధికారులున్నారు.

శ్రీ ‘వైట్‌ టాపింగ్‌’ రోడ్లు
నగరం అభివృద్ధి చెందాలంటే రోడ్లు సాఫీగా ఉండాలి. బల్దియా 18 సర్కిల్లలో 280 కిలోమీటర్ల రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రతి సర్కిల్‌లో అతి రద్దీగా ఉన్న కనీసం 10 కిలోమీటర్ల రోడ్లను నాలుగు లైన్లుగా మార్చడం, రోడ్లకిరువైపులా ఫుట్‌పాత్‌, డివైడర్లను ఏర్పాటు చేయనున్నారు. లేెటెస్ట్‌ టెక్నాలజీతో కొత్త రకం రోడ్లను వేయనున్నారు. ఇప్పటికే ముంబాయి, చెన్నై నగరాల్లో ఉన్న ‘వైట్‌ టాపింగ్‌’ రోడ్ల తరహాలో హైదరాబాద్‌లో వేయనున్నారు. సిమెంటు, ఇసుక, బూడిద, క్వాలీ ఫైబర్‌ మిశ్రమంతో 5 అంగుళాల మందంతో రోడ్లు వేయడం, ఇవి దాదాపు 20 సంవత్సరాల వరకు పాడవకుండా ఉండడమేకాకుండా, రోడ్లపై వైట్‌ కలర్‌లో జీబ్రా క్రాసింగ్‌లు కూడా రావడం ఈ రోడ్ల ప్రత్యేకత. అతి త్వరలోనే ఇలాంటి రోడ్లు వేయనున్నట్లు జిహెచ్‌ఎంసి కమీషనర్‌ తెలిపారు.

శ్రీ ఈ ` ఆఫీస్‌
బల్దియా సేవలను మరింత త్వరితగతిన ప్రజలకు అదించడం, అవినీతిని తగ్గించడంతో పాటు, ఉద్యోగులలో జవాబుదారీ తనాన్ని కల్పించడం కోసం కాగిత రహిత ఫైలింగ్‌ విధానంలో భాగంగా జిహెచ్‌ఎంసి ఈ ` ఆఫీస్‌ను ప్రవేశపెట్టింది. దేశంలోనే ఈ ` ఆఫీస్‌ను ప్రవేశపెట్టిన తొలి మున్సిపల్‌ కార్పొరేషన్‌గా జిహెచ్‌ఎంసి చరిత్రకెక్కింది. రికార్డు అసిస్టెంట్‌ నుండి కమీషనర్‌ వరకు ప్రతి ఒక్కరు తమ ఫైళ్లను ఎలక్ట్రానిక్‌ విధానంలోనే పరిష్కరించవలసి ఉండడంతో పాటు, ఏ అధికారి వద్ద ఫైల్‌ ఉందనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. దాదాపు 50 వేల ఫైళ్లను స్వీకరించడం రికార్డు అని ఎన్‌ఐసి ఢల్లీి సీనియర్‌ అధికారులు అభినందించారు.

శ్రీ గౌరవ సదన్‌ల ఏర్పాటు
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన చర్యలో భాగంగా భిక్షాటన నిర్మూలించడానికి పలు పథకాలు చేపట్టింది. దీనిలో భాగంగా ప్రధాన కూడళ్ళలో భిక్షాటన చేసే యాచకులకు ‘గౌరవ సదన్‌’ పేరిట పునరావాసాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ పునరావాస కేంద్రాల ఏర్పాటులో నగర ట్రాఫిక్‌ విభాగం, మహిళా శిశు సంక్షేమ శాఖతోపాటు, స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని జిహెచ్‌ఎంసి తీసుకోనుంది.

శ్రీ డ్రిప్‌ విధానం
పలు గార్డెన్‌ల నిర్వహణకు నీటి వృధాను అరికట్టడానికి డ్రిప్‌ విధానాన్ని ప్రవేెశపెట్టింది. ప్రాథమిక దశలో పి.వి. ఎక్స్‌ప్రెస్‌ హైవే మార్గంలో ఉన్న పూల కుండీలకు డ్రిప్‌ విధానంలో నీటిని అందించే ప్రక్రియను అమలు చేస్తోంది. ఈ విధానం వల్ల నీటి వృధాను అరికట్టడంతో పాటు మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరడగానికి దోహదపడుతుంది.

శ్రీ ఆర్వో ప్లాంట్లు
మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆయా ప్రాంతాల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. కేవలం 4 రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని అందించే ఏర్పాటు చేయనుంది. మహిళా సంఘాలకు,

Other Updates