వసవాదం, సామ్రాజ్యవాదాకు వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన స్వాతంత్య్రోద్యమం, కు నిర్మూనకోసం జరిగిన సామాజిక సంస్కరణోద్యమాు కన్న ముద్దుబిడ్డ డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్. భారతదేశ స్వరాజ్య ఉద్యమంతో, తదనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణంతో ముడిపడిన జగ్జీవన్‌రామ్ జీవితం రాజకీయ, సామాజిక, చారిత్రిక ప్రాధాన్యత కలిగి ఉంది. జగ్జీవన్‌రామ్‌ని స్మరించుకోవడం అంటే భారతదేశ స్వాతంత్య్రం, సామాజికోద్యమా ప్రాంగణాన జరిగిన, ఉప్పొంగిన సమరోజ్వ సమున్నత ఘట్టాను గుర్తు చేసుకోవడమే.
జగ్జీవన్‌రామ్ మహోన్నత నాయకత్వం, వ్యక్తిత్వం, సేమ భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థకు, సంస్థకు మహాబలాన్ని చేకూర్చిపెట్టాయి. భారత రిపబ్లిక్ తొలి లోక్‌సభ (1952)లో ప్రవేశించిన జగ్జీవన్‌రామ్ వరుసగా ఎనిమిదిసార్లు గెలిచాడు. ముప్ఫైమూడు సంవత్సరాు కేంద్రమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశంలో ప్రజారాజ్య నిర్మాణానికి నిరంతరం కృషి సాగించాడు. మొదటి శ్రేణి పార్లమెంటే రియన్‌గా నిలిచాడు.
హేతుబుద్ది, సానుకూ దృక్పథం, స్పష్టమైన దార్శనికత, విస్తృతమైన అధ్యయనం, గొప్ప మేధాశక్తి, స్థిరమైన సంక్పబం, నిత్యకృషీవత్వం, ఓరిమి, కారుణ్యం, చర్చించే గుణం, ఒప్పించే గుణం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవానిరతి, కార్యనిర్వహణాదక్షత మొదగు క్షణా నిండుదనంతో బమైన సుగుణశీ వ్యక్తిత్వం, తనకితాను నిర్మించుకున్న భారతదేశ ‘అమ్యూరత్నం’ డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్.
1908 ఏప్రిల్ ఐదవ తేదీన జగ్జీవన్‌రామ్ బీహారు రాష్ట్రంలో షాబాద్ (ప్రస్తుతం భోజ్‌పూర్) జిల్లాలోని చిన్నగ్రామమైన చాంద్వాలో జన్మించాడు. తల్లిదండ్రు వసంతీదేవి, శోభీరామ్. సామాన్య కుటుంబం. చర్మకార కుం. ఆరేళ్ళ వయసులో 1914లో జగ్జీవన్‌రామ్ గ్రామ పాఠశాలో చదువుకివెళ్ళాడు. చిన్ననాటే తండ్రి చనిపోవడంతో సాంఘిక, ఆర్థిక ఇక్కట్లమధ్య తల్లి వసంతీదేవి సంరక్షణలో జగ్జీవన్‌రామ్ తన చదువు కొనసాగించాడు. తన పదకొండవ సంవత్సరాన 1919లో ఏడవ తరగతి పాసయ్యాడు.
1920లో ఆరా పట్టణంలోని ఇంగ్లీషు మీడియం మాధ్యమిక పాఠశాలో జగ్జీవన్‌రామ్ ఎనిమిదవ తరగతిలో చేరాడు. రాత్రింబవళ్ళు పట్టుదతో చదివి, ఇంగ్లీషు భాషపై మంచిపట్టు సంపాదించాడు. అణగారిన కులా విద్యార్థుకు ఇచ్చే స్కార్‌షిప్‌ను తీసుకోవడానికి నిరాకరించాడు. అదే సమయంలో విద్యలో ప్రతిభ కనబరిచిన ఇతర విద్యార్థుకు ఇచ్చే స్కార్‌షిప్పును పొందాడు. జగ్జీవన్‌రామ్ చిన్న నాటే భోజ్‌పురితోపాటు హిందీ, ఇంగ్లీషు, బెంగాలి, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు.
జగ్జీవన్‌రామ్ 1922లో ఆరా టౌన్ స్కూల్‌లో చేరాడు. ఇక్కడ మంచినీళ్ళకుండని అంటుకోనివ్వని రూపంలో మొదటిసారిగా అంటరానితనం, కు అణచివేత జగ్జీవన్‌రామ్‌కి ఎదురయ్యింది. తరతరాుగా తన కు జీవితాకు విధించ బడుతున్న నిర్హేతుకమైన సామాజిక విధి నిషేధాలే ఇక్కడ జగ్జీవన్‌రామ్‌పైనా అము జరిగాయి. జగ్జీవన్‌రామ్ ముట్టుకున్న కుండలోని నీరును తాగడానికి కొందరు ఆధిపత్య కులా విద్యార్థు నిరాకరించారు. దీంతో ఎస్సీ కులా విద్యార్థుకు స్కూల్లో ప్రత్యేక మంచినీటి కుండను ఏర్పాటు చేశారు. ఈ అవమానాన్ని సహించలేని జగ్జీవన్‌రామ్, పెట్టిన ప్రతి కుండను పగగొట్టసాగాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న స్కూు హెడ్మాష్టర్ చివరికి అందరికీ ఒక్కటే మంచినీటి కుండని ఏర్పాటు చేశారు. తాను ఎదుర్కోవసి వచ్చిన ఈ వివక్షాపూరిత విధానాకు తీవ్ర ఆవేదన, ఆగ్రహం మనసులో రగిలింది` జగ్జీవన్‌రామ్‌లో. స్కూల్లో అందరు విద్యార్థుకంటె మిన్నగా గణితం, సంస్క ృతాలో వందశాతం మార్కుతో మెట్రిక్యులే షన్ మొదటి శ్రేణిలో పాసయ్యాడు. దీనివ్ల అందరిలో జగ్జీవన్‌రామ్‌కు గౌరవ ప్రతిష్టు పెరిగాయి.
1925లో ఆరా పట్టణంలో జరిగిన ఒక సభకు జగ్జీవన్‌రామ్ స్వాగతం పలికాడు. ఆ సభలో పాల్గొన్న పండిత మదన్‌మోహన్ మావ్య బనారస్ హిందూ విశ్వవిద్యాయం (బి.హెచ్.యు.)లో చదువుకోవటానికి రావల్సిందిగా జగ్జీవన్‌రామ్‌ని ఆహ్వానించాడు.
బి.హెచ్.యు.లో ఇంటర్ పాసైన తర్వాత జగ్జీవన్‌రామ్ కకత్తాలోని విద్యాసాగర్ కాలేజీ డిగ్రీలో ప్రవేశించాడు. కకత్తా విశ్వవిద్యాయం నుంచి డిస్టింక్షన్‌లో బిఎస్సీ డిగ్రీ పట్టభద్రుడయ్యాడు. జగ్జీవన్‌రామ్ కకత్తావచ్చిన ఆరు నెల్లోనే విల్లింగ్టన్ స్క్వేర్‌లో ముప్ఫైjైుదువే మంది కార్మికును కూడగట్టి భారీ ర్యాలీ నిర్వహించాడు. ఈ విజయంతో జగ్జీవన్‌రామ్ సుభాష్‌చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి చాలామంది జాతీయ నాయకు దృష్టికి వచ్చాడు. కమ్యూనిస్టు మేనిఫెస్టో, పెట్టుబడి గ్రంథాతోపాటు ఇతర సోషలిస్టు సాహిత్యం అధ్యయనం చేశాడు. అప్పటికే కురహిత, వర్గరహిత భావజాం కలిగిన జగ్జీవన్‌రామ్‌పై ఇది ఎంతగానో ప్రభావం చూపింది. బ్రిటిష్‌వసవాద సంకెళ్ళుతెంపి, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాని, సామాజిక సమానత్వం నిర్మించాని జగ్జీవన్‌రామ్ విద్యార్థి దశలోనే సంకల్పించుకున్నాడు.
1934లో జగ్జీవన్‌రామ్ కకత్తాలో అఖిభారతీయ రవిదాస్ మహాసభను స్థాపించాడు. గురు రవిదాస్ జయంతి ఉత్సవాను పురస్కరించుకుని అనేక జిల్లాల్లో రవిదాస్ సమ్మేళనాు నిర్వహించాడు. సాంఘిక సంస్కరణ కోసం వ్యవసాయ కార్మికు మహాసభను, ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్‌లీగ్ మొదలైన సంఘాను స్థాపించాడు. షెడ్య్డూు కులా నాయకును ఐక్యంచేసి, ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూ, మరోవైపు సాంఘిక సంస్కరణ కోసం రాజకీయ ప్రాతినిధ్యం వహించాడు.
బీహారులో 1934లో వచ్చిన భయంకరమైన భూకంపం సందర్భంగా జగ్జీవన్‌రామ్ ప్రజకు సహాయ, పునరావాస చర్యు చేపట్టాడు. తన బృందంతో ఆహోరాత్రు శ్రమించి ఆహారం, బట్టు, ఔషధాు, మంచినీరు, ఆశ్రయం మొదగు సౌకర్యాు బాధితుకు అందేవిధంగా సహాయ శిబిరాు జగ్జీవన్‌రామ్ నిర్వహించాడు. ఈ సందర్భంలోనే మొదటిసారిగా గాంధీని జగ్జీవన్‌రామ్ కుసుకోవడం తటస్థించింది.
1935లో కాన్పూర్‌లో జరిగిన డిప్రెస్డ్ క్లాసెస్‌లీగ్ కాన్ఫరెన్స్‌కు జగ్జీవన్‌రామ్ అధ్యక్షత వహించాడు. ఈ సంస్థకు 1936నుంచి 1942వరకు జగ్జీవన్‌రామ్ అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
1935 జూన్ ఒకటిన కాన్పూర్‌కి చెందిన సంఘసేవకుడు డాక్టర్ బీర్బల్ కుమార్తె ఇంద్రాణిదేవితో జగ్జీవన్‌రామ్ వివాహం జరిగింది. ఇంద్రాణిదేవి స్వాతంత్య్ర సమరయోధురాు మాత్రమేగాక, విద్యావేత్తకూడా. స్వాతంత్య్రోద్యమ కామంతా తోడుగా పోరాడిన వీరిద్దరికీ ఇరువురు సంతానం. కుమారుడు సురేష్. కుమార్తె మీరా. తండ్రి జగ్జీవన్‌రామ్ ఆదర్శాతో కుమార్తె మీరాకుమార్ కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా దేశానికి సేవందించారు. సాంఘిక సంస్కరణకోసం చేస్తున్న ఉద్యమంలో భాగంగా అణగారిన కులావారికి ఓటు హక్కు కావాని 1935 అక్టోబర్ 19న రాంచి వచ్చిన హేమండ్ కమిటీముందు జగ్జీవన్‌రామ్ ప్రాతినిధ్యం వహించాడు. 1936లో బీహార్ శాసనసభలో ఎమ్మెల్యేగా నియామకం అయ్యి, 28 ఏళ్ళ వయస్సులో జగ్జీవన్‌రామ్ తన శాసనిక జీవితం ప్రారంభించాడు. 1937లో బీహారు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డిప్రెస్డ్ క్లాసెస్‌లీగ్ నుంచి 14 రిజర్వుడు స్థానాకు జగ్జీవన్‌రామ్ అభ్యర్థును పోటీకి నిలిపాడు. ఎటువంటి వ్యతిరేకత లేకుండా 14మంది అభ్యర్థు గెవడంతో జగ్జీవన్‌రామ్ ఒక రాజకీయ నిర్ణయాత్మకశక్తిగా, కింగ్‌మేకర్‌గా ఎదిగాడు. ఈ సమయంలోనే, తమతో చేతు కపవసిందిగా జగ్జీవన్‌రామ్‌కి కాంగ్రెస్‌పార్టీ నుంచి ఆహ్వానం అందింది.
1937 బీహార్ శాసనసభలో వ్యవసాయం, సహకార పరిశ్రము, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు పార్లమెంటరీ సెక్రటరీగా జగ్జీవన్‌రామ్ నియామకం అయ్యాడు. కాగా, అండమాన్ ఖైదీపట్ల, భారతదేశాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలోకి దించాని నిర్ణయించిన బ్రిటిషు విధానాకు నిరసనగా శాసన్లోంఘన ఉద్యమంలో పాల్గొని 1940 డిసెంబర్ పదిన ఆరాలో జగ్జీవన్‌రామ్ అరెస్టు అయ్యాడు. హజారీబాగ్ జైుకు పంపబడినాడు. ఆనాడు రాజకీయ ఖైదీకు జైళ్ళు శిక్షణా కేంద్రాుగా ఉండేవి. సాటి సోషలిస్టు ఖైదీతో మార్కి ్సజం నుంచి అనేక అంశాపై జరిపిన లోతైన చర్చ ప్రభావం జగ్జీవన్‌రామ్‌పై బంగా ఉండేది. జగ్జీవన్‌రామ్ జైునుంచి విడుద అయ్యాక శాసన్లోంఘన, సత్యాగ్రహ ఉద్యమాల్లో పూర్తిగా మునిగిపోయాడు. వాటితో స్ఫూర్తి పొందాడు. వార్దా వెళ్ళాడు. అక్కడ గాంధీ ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉన్నాడు.
జగ్జీవన్‌రామ్, గాంధీ పొద్దున్నే నడుస్తూ అనేక అంశాపై చర్చించుకునేవారు. మూఢనమ్మకాు, సామాజిక వివక్షు, అసమానతు లేని ఒక స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య సోషలిస్టు సమాజ నిర్మాణం జగ్జీవన్‌రామ్ దార్శనికతలో రూపుదిద్దుకున్నది. 1942లో జగ్జీవన్‌రామ్ బొంబాయిలో అగ్రనేత సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అప్పుడే, కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా తీర్మానం చేసింది. ‘స్వాతంత్య్రమో లేక మరణమో!’, ‘సాధించు లేక మరణించు!’ నినాదాు దేశమంతా మిన్నుముట్టాయి. ఆలిండియా ‘డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్’ను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది.
క్విట్ ఇండియా ఉద్యమంలో జగ్జీవన్‌రామ్ పాత్ర మకుటాయమానమయింది. బీహార్‌లో గొప్ప ప్రజా ఉద్యమాన్ని నడిపాడు. 1942 ఆగస్టు 19న పాట్నాలోని స్వగృహంలో జగ్జీవన్‌రామ్ అరెస్టు అయ్యాడు. 1943 అక్టోబర్ 5న జైునుంచి విడుదయ్యాడు. జగ్జీవన్‌రామ్ ఈ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వ అణచివేతల్ని ఖండిస్తూ దేశ స్వాతంత్య్ర సాధనకోసం అనేక సభు, సమావేశాు, ర్యాలీను నిర్వహించాడు.
1946లో జరిగిన కేంద్ర ఎన్నికల్లో ఈస్ట్ సెంట్రల్ షాబాద్ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా జగ్జీవన్‌రామ్ ఎన్నికయ్యాడు. ఇదే ఏడాది సిమ్లాలో బ్రిటిష్ కేబినెట్ మిషన్‌ముందు అణగారిన వర్గా హక్కుకు ప్రతినిధిగా గొంతునిచ్చాడు. 1946 ఆగస్టు 30న భారతదేశంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చెయ్యవసిందిగా బ్రిటిష్ వైస్రాయి ప్రభువు ఆహ్వానించిన పన్నెండుమంది దేశ నాయకుల్లో జగ్జీవన్‌రామ్ ఒకరు. 1946 సెప్టెంబర్ 2న దేశానికి ఏర్పాటు చెయ్యబడిన మధ్యంతర ప్రభుత్వంలో కార్మికశాఖమంత్రిగా, అణగారిన సామాజికవర్గాకు ఏకైక ప్రతినిధిగాను జగ్జీవన్‌రామ్ వున్నాడు. మంత్రిమండలిలో పిన్న వయస్కుడైన జగ్జీవన్‌రామ్‌ను అందరూ ‘బేబి మినిష్టర్’ అని పిలిచేవారు.
ముప్పైమూడేళ్ళకు పైగా కేంద్ర కేబినెట్‌మంత్రిగా, దేశ ఉప ప్రధానమంత్రిగానూ డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ తీసుకున్న అసంఖ్యాక నిర్ణయాు, ఆయన నాయకత్వాన చేసిన అనేక ముఖ్యమైన మౌలికమైన చట్టాు దేశ సామాజిక పరివర్తనలో, అము జరిగిన సామాజిక న్యాయంలో ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తున్నాయి. దేశంలోని పేదవర్గాు, శ్రామిక ప్రజు, సగటు మనుషు, వెనుకబడినవర్గాు, ముఖ్యంగా షెడ్య్డూు కులాు, షెడ్య్డూు తెగ వారి హక్కు, అభివృద్ధికోసం జగ్జీవన్‌రామ్ తీవ్రంగా కృషి చేశారు.
మొరార్జీదేశాయ్ ప్రధానమంత్రిగా కేంద్రంలో జనతాపార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో (1977) జగ్జీవన్‌రామ్ కేంద్ర రక్షణశాఖామంత్రిగా విధు నిర్వహించారు. అంతేగాక, 1979 జనవరి 24న డిప్యూటీ ప్రధానమంత్రిగా జగ్జీవన్‌రామ్ బాధ్యతు స్వీకరించారు.
1969లో అధికార కాంగ్రెస్ పార్టీకి జగ్జీవన్‌రామ్ అధ్యక్షుడయ్యారు. 1977లో ఇందిరాగాంధీ నియంతృత్వ విధానాతో విభేదించి, కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు ప్రకటించి బయటకు వచ్చిన జగ్జీవన్‌రామ్ ‘ప్రజాస్వామ్య కాంగ్రెస్’ (కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ) అనే పార్టీని స్థాపించారు. 1980 మార్చిలో ‘కాంగ్రెస్ (జె)’ పేరుతో పార్టీని స్థాపించారు. దామోదరం సంజీవయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చెయ్యటంలో జగ్జీవన్‌రామ్ కీకపాత్ర నిర్వహించారు. 1949లో హైదరాబాద్ సందర్శించారు. 1950లో సికిందరాబాద్ కర్బలా మైదానంలో జరిగిన గొప్ప బహిరంగసభలో పాల్గొన్నారు. 1976లో జరిగిన ఆంధ్రప్రదేశ్ హరిజన మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జగ్జీవన్‌రామ్ గొప్ప దార్శనికత, అనుభవం వున్న రచయిత అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన హిందీలో, ఇంగ్లీషులో రచను చేశారు. 1. భారత దేశంలో కుం సవాళ్ళు (2) జీవన సరళి`వ్యక్తిత్వ వికాసం అను రెండు విశిష్ట గ్రంథాను జగ్జీవన్‌రామ్ రాశారు. ఆయన గొప్ప సమ్మోహనశక్తిగ వక్త. విస్తృత అధ్యయనశీలి. ఉజ్జయినిలోని విక్రమ విశ్వవిద్యాయం 1967లో జగ్జీవన్‌రామ్‌కి ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 1968లో కాన్పూర్ విశ్వవిద్యాయం జగ్జీవన్‌రామ్ సేవకు గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ప్రజు జగ్జీవన్‌రామ్ ను ప్రేమగా ‘బాబూజీ’ అని పిలిచేవారు. ‘కొలిమి జ్వాల్లో వన్నెదేలిన బంగారంలా ఎదిగిన జగ్జీవన్‌రామ్ పట్ల నా ఆత్మ గౌరవాభిమానాతో ఉప్పొంగుతున్నది, జగ్జీవన్‌రామ్ ‘అమ్యూరత్నం’’ అని గాంధీ ఒక సందర్భంలో రాశారు. 1986 జూలై 6వతేదీన బాబూజీ భౌతికంగా మనను వీడారు. యావత్తు భారతజాతి ఘనంగా నివాళుర్పించింది.
ఈ దేశం, ఈ ప్రజ బాబూజీ సేవను ఎప్పటికీ గుర్తుంచుకోగదు. సామాజిక, రాజకీయ బానిసత్వాపై జీవితాంతం యుద్ధం చేసిన బాబూజీ ఎప్పటికీ, ఎ్లరకీ స్ఫూర్తిదాత. ఆదర్శనీయుడు. అణగారిన సమూహా మహానాయకుడు, నిజమైన భారత ‘రత్న’ డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్.
(జులైౖ 6 జగ్జీవన్‌రామ్ వర్ధంతి)