రాజునుబట్టి రాజ్యం ఉంటుందంటారు. పాలకుడి ఆలోచనలు, కార్యాచరణ సత్సంకల్పంతో ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుందనడానికి తెలంగాణలో నిండుదనంతో కళకళ లాడుతున్న వేలాది చెరువులే ప్రత్యక్ష నిదర్శనం . తెలంగాణ జీవనాధారమే వ్యవసాయం . రైతుల కష్టాలు తెలిసిన కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో జీవచ్చవం లా మారిన చెరువులకు ప్రాణం లేచి వచ్చింది . తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొత్తం చెరువుల వివరాలు యుద్ధ ప్రాతిపదికన అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు . సుమారు లక్ష వరకు ఉండాల్సిన చెరువులకు గాను 50 వేల పైనే ఆక్రమణలు సమాధి అయిపోయాయి . ఇక 43,815 చెరువులు మాత్రమే మిగిలి ఉన్నట్లు గుర్తించారు . వాటిని ఏటా 8000 చెరువుల చొప్పున పునరుద్ధరించి బలంగా కట్టలు పోసి వాటికి నీరు అందించే ఫీడర్ ఛానల్లను పునరుద్ధరించారు . మొత్తం రెండేళ్లలో కృష్ణా, గోదావరి జలాలతో కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ద్వారా తెలంగాణకు సాగు నీటిని అందించవచ్చని ఈ రెండేళ్లు ప్రకృతి సహకరిస్తే చెరువులు కుంటలు నింపుకుంటే భూగర్భజలాలు పెరిగి రైతులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. చాలా ఏళ్ళ తర్వాత భారీ వర్షాలు కురవడంతో తెలంగాణలో అత్యధికంగా 380 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది . దీంతో 32 వేల చెరువుల్లోకి పుష్కలంగా నీరు చేరింది . కొన్ని వేల చెరువులు పొంగి పొర్లి పోయినయి . ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద చెరువులను పునర్నిర్మించి ఉండకపోతే కొన్ని వేల చెరువులు వరద తీవ్రతకు తెగిపోయేవి . మిషన్ కాకతీయ వల్ల నిండిన చెరువులతో పాటు గోదావరి , కృష్ణా బేసిన్‌లో సాగు నీటి ప్రాజెక్టుల ద్వారా కొన్ని వందల చెరువులు నింపే విషయంలో నీటి పారుదల శాఖ తీవ్రంగా కృషి చేస్తున్నది . ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు ఇతర ఉన్నతాధికారులు చెరువులను నింపే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నరు .
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో చెరువులు నిండడంతో భూగర్భజలాలు భారీ స్థాయిలో పెరిగినయి . తెలంగాణ రాష్ట్రంలో సగటున ఇదే ఏడాది మే నెలలో భూమికి దిగువన ( బీ జీ ఎల్ ) 15.62 మీటర్ల స్థాయిలో భూగర్భజలాలు ఉండగా గత అక్టోబర్ లో అది 7.11 మీటర్లకు చేరింది . సెప్టెంబర్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణ భూగర్భంలో సుమారు 500 టి.ఎం.సి ల నీరు చేరి ఉండవచ్చని ఒక అంచనా . భూగర్భానికి మించిన అద్భుతమైన రిజర్వాయర్ మరొకటి లేదని అందుకే మిషన్ కాకతీయను చేపట్టినట్లు సాగు నీటి సమీక్షల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ ప్రస్తావిస్తుంటారు . ఈ సారి భూగర్భజలాలు భారీగా పెరగడం వల్ల రబీలో రైతులకు భారీ ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నయి . బోర్లలో నీరు పెరగడంతో సాగు విస్తీర్ణం బాగా పెరుగుతుందన్న అంచనా ఉంది . ప్రభుత్వం వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు ఇవ్వడం వల్ల రబీ పంటల దిగుబడి బాగా వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.
తెలంగాణలో భూగర్భజల సంపద భారీగా పెరిగిన భూగర్భజలాలు భూగర్భంలో సుమారు 500 టి.ఎం.సి ల నిల్వ ! సెప్టెంబర్ లో 380 మి.మీ రికార్డ్ వర్షపాతం 7 మీటర్లకు చేరిన భూగర్భజలాలు సీ.ఎం.కేసీఆర్ ముందు చూపుతో రైతులకు వరం తెలంగాణ రైతులకు మిషన్ కాకతీయ ఫలాలు భారీ వర్షానికి నిండిన వేలాది చెరువులు బోర్ల ఆధారిత వ్యవసాయానికి భారీ మేలు
మిషన్ కాకతీయ అనంతరం పెరిగిన భూగర్భ జలమట్టాలు
జిల్లా బీజీఐ మీటర్లు
(భూగర్భ జలాలు)
మే-2016 అక్టోబర్-2016
మహబూబ్‌నగర్ 18.41 12.29
నాగర్‌కర్నూల్ 20.52 14.60
వరంగల్ 12.14 8.53
జోగులాంబ
గద్వాల్ 11.83 4.31
రంగారెడ్డి 19.44 12.96
మేడ్చల్ 16.33 6.97
వికారాబాద్ 19.05 7.30
మెదక్ 29.09 11.80
సంగారెడ్డి 23.90 10.18
సిద్ధిపేట 28.74 11.58
నిజామాబాద్ 21.23 6.55
కామారెడ్డి 20.81 10.89
ఆదిలాబాద్ 14.70 2.87
నిర్మల్ 15.32 4.57
మంచిర్యాల 7.47 3.11
కుమ్రుం భీం
ఆసిఫాబాద్ 8.97 5.26
కరీంనగర్ 15.65 5.27
పెద్దపల్లి 11.61 5.44
జగిత్యాల 11.15 4.16
రాజన్న సిరిసిల్ల 17.95 6.15
వరంగల్ (అర్బన్) 12.86 3.40
వరంగల్ (రూరల్) 11.4 5.37
జయశంకర్
భూపాలపల్లి 11.92 6.47
మహబూబాబాద్ 10.41 4.61
జనగామ 16.42 7.95
ఖమ్మం 10.43 5.52
నల్లగొండ 16.14 7.57
సూర్యాపేట 14.86 5.84
యాదాద్రి
భువనగిరి 17.07 9.29
హైదరాబాద్ 10.99 4.12
మిట్టా సైదారెడ్డి