జిల్లా కలెక్టర్ల ప్రతిజ్ఞ
ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు అరుదైన ఘనతను సాధించారు. భూమి, పర్యావరణ రక్షణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేయటంతో పాటు, రోజంతా ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం హరితహారం పర్య వేక్షణలో గడిపారు. అదీ ముఖ్యమంత్రి క.చంద్రశేఖర రావు సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో అటవీ శాఖ కార్యక్రమాలు, అభివృద్ది కార్యక్రమాలను రోజంతా పరిశీలించారు.
సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగు ఫారెస్ట్ రీసెర్ఛ్ కాలేజీకి కలెక్టర్ల బృందం ఉదయమే చేరుకుంది. అనంతరం ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ అధికారులు కలెక్టర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈప్రతిజ్ఞ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బందితో పాటు ఇతర శాఖలకుచెందిన అధికారిక యంత్రాంగం కూడా పొల్గొన్నారు.
”రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్య కారకాల నుంచి, ప్లాస్టిక్ వినియోగం నుంచి భూమాతను రక్షించే ప్రయత్నంలో భాగస్వామ్యులం అవుతాం. భూమాతకు పచ్చని ఆభరణమైన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తెలంగాణను ఆకుపచ్చని రాష్ట్రంగా మారుస్తామని, సమాజంలో అందరినీ ఈ దిశగా చైతన్య పరుస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను” అంటూ అందరు కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ప్రతిన పూనారు.
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నదని, రాష్ట్రంలోనేకాకుండా దేశానికే ఆదర్శంగా నిలిచిన సిద్ధిపేట జిల్లాను సందర్శించిరావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు కలెక్టర్ల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు ఈ పర్యటన జరిపారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రమైనములుగు ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌లో సమావేశమై అక్కడి నుంచి ఈ బృందం పర్యటన ప్రారంభించారు. గెస్ట్‌హౌస్‌లో తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పి.కె.జా కలెక్టర్లకు అటవీ శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలను, సహజంగా అటవీ పునరుద్ధరణ, ఎవెన్యూ ప్లాంటేషన్ విధానంపై వివరించారు. జిల్లాలో జరిగిన అటవీ అభివ ద్ధి, మొక్కలునాటిన విధానం, ప్రభుత్వ లక్ష్యాలను సవివరంగా చెప్పారు.
ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ల బృందంతిలకించింది. ఆ తర్వాత రిసెర్చ్ నర్సరీని సందర్శించారు. ములుగు బీట్లో నర్సంపల్లి-ఆర్‌ఎఫ్ బ్లాక్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ అటవీ శాఖ జిల్లాలో చేపడుతున్న పలు కీలకమైనఅంశాలను వివరించారు.అక్కడ హరిత హారం కోసం సిద్ధం చేసిన మొక్కల నర్సరీ నిపరిశీలించారు. ములుగు నర్సరీలో 2.5 లక్షల మొక్కలను హరితహారనికి సిద్ధం చేశామని అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ తెలిపారు. అనంతరం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణాలను, ఇళ్లలోకి వెళ్లి పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లనిర్మాణం విశేషాలను జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ రెడ్డి కలెక్టర్ల బృందానికి వివరించారు. రోడ్డు నిర్మాణం, ప్లాంటేషన్ , వాటికి అవసరమగు నిధులు, జిల్లాలో నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణాన్ని గురించి పూర్తి స్థాయిలో వివరించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
వర్గల్ మండలం సింగాయిపల్లి వద్ద సహజసిద్ధమైన అటవీపెంపకం, చెట్ల సంరక్షణ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్ల బృందం. సింగాయిపల్లి నుంచి గజ్వేల్ రహదారిలో ఎవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. ఆ తర్వాత కోమటిబండ చేరుకున్న అధికారులు అక్కడ అటవీ శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను,మిషన్ బగీరథ పనితీరును తెలుసుకున్నారు.
అనంతరం కేజీ టూ పీజీలో భాగంగా నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్‌ని సందర్శించారు. బాల, బాలికలకోసం వేర్వేరుగా నిర్మించిన భవనసముదాయాలను పరిశీ లించారు. స్కూల్, ఇంటర్, డిగ్రీ, కళాశాలల భవనాలను, హాస్టల్ భవనాలను, ల్యాబ్‌లలో కలెక్టర్ల బృందం కలియతిరిగింది. గజ్వేల్ పరిధిలో పనులను చూసిన కలెక్టర్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తమ జిల్లాలో కూడా అభివృద్ది పనులు జరుగుతున్నా, గజ్వేల్ మోడల్ సమీకృత అభివద్ధికి నిదర్శనంగా ఉందని, తమ జిల్లాలో కూడా ఇదే మోడల్ ను అమలు చేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల అమలును, వాటికోసం నిధుల సమీకరణను కలెక్టర్లు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.