నవజాత శిశు సంరక్షణలో మరో అవార్డు వచ్చింది. నవజాత శిశు సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్‌ టూగా నిలిచింది. నవజాత శిశు సంరక్షణ ఇండెక్స్‌ ఆధారంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలంగాణ దేశంలో రెండో అత్యుత్తమ రాష్ట్రంగా గుర్తించింది. మొదటి రాష్ట్రంగా హరియాణ నిలిచింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జాతీయ శిశు ఆరోగ్య సమీక్షలో ఈ విషయాన్ని ప్రకటించింది. కాగా సీఎం కేసీఆర్‌ దార్శనికత వల్లే వైద్య ఆరోగ్య శాఖ అభివృద్ధి చెందడంతో పాటు అవార్డులు కూడా పొందుతున్నదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి అన్నారు. కేసీఆర్‌కి కృతజ్ఞతలు చెబుతూ, ఇందుకు సహకరించిన అందరినీ మంత్రి అభినందించారు. దేశంలో రెండో స్థానంలో నిలబడటం వెనుక తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కృషి ఎంతగానో ఉంది. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడాలేని విధంగా నవజాత శిశు సంరక్షణకు పాటుపడుతున్నది.

ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాత శిశు సంరక్షణ మీద ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల ప్రభుత్వ దవాఖానాల్లో సౌకర్యాలు పెరిగి IMR (INFANT MORTALITY RATE) 39 నుండి 31కి తగ్గిందని, ఇది జాతీయ సగటు లో సగం. దీనితో మన రాష్ట్రం దేశం లోని ఆరోగ్యసేవలో అత్యుత్తమ రాష్ట్రాలైన కేరళ , తమిళనాడు సరసన నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 21SNCU నవజాత శిశు సంరక్షణ కేంద్రాలున్నాయి. 7 SNCUలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రతి జిల్లాకు ఒక SNCU  ఏర్పాటు చేయడానికి 7 క్రొత్త SNCUలకు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని మంత్రి తెలిపారు. గత సంవత్సరంలో 21 SNCUలలో 29,000 శిశువులను చేర్చుకుని సంరక్షించడం జరిగిం దని, SNCUల్లో చేర్చుకున్న శిశువుల్లో 75% కన్నా ఎక్కువ మంది శిశువులు ఆరోగ్యంగా ఇంటికి పంపించడం జరిగినదని మంత్రి వివరించారు.

Other Updates