అన్నం పరబ్రహ్మ స్వరూపం….. అన్న సామెతను నిజం చేస్తుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్. బతుకుదెరువు కోసం పల్లెల నుంచి పట్నానికి వచ్చి అడ్డాకూలీలుగా పనిచేస్తూ బుక్కెడు బువ్వకోసం అలమటిస్తున్న వారికి రాజధానిలో మేమున్నా మంటూ బరోసా ఇస్తుంది జిహెచ్‌ఎంసి. పూటకు పట్టెడన్నం కోసం ఆరాట పడుతున్న వారికి జీహెచ్‌ఎంసీ ఆపన్నహస్తం అందించడానికి ఒక బృహత్తర పథకానికి నాంధి పలికింది బల్దియా. ఆ పథకమే ఐదు రూపాయలకే భోజనం పథకం. మహానగరాభివృద్ది, పౌరసేవలే కాకుండా సామాజిక సేవ వైపు కూడా గ్రేటర్ మున్సిపాలిటీ దృష్టి సారించిమన్ననలను పొందుతున్నది.
అ దేశంలోనే మొదటి సారి
అ నిరుపేదకు తక్కువ ధరకు భోజనాన్ని అందించే
కొత్త కార్యక్రమానికి జిహెచ్‌ఎంసి శ్రీకారం
అ ఐదు రూపాయలకే వేడివేడి భోజనం
అ గ్రేటర్ లో 50 ప్రాంతాల్లో అమలుకు ప్రణాళికలు
అ ప్రతి రోజు 15వేల మందికి భోజనం
ఐదు రూపాయలకు సింగిల్ చాయ్ కూడా రాని ఈరోజుల్లో నిరుపేదల కడుపు నింపాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది. నిరుపేదలకు, అడ్డా కూలీలకు, చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఫుట్ పాత్‌లపై నివసించే వారికి, యాచకుల కోసం కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన రుచికర భోజనాన్ని అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నది. కేవలం వీరి కోసమే కాకుండా అనారోగ్య సమస్యలతో వైద్య సేవలకోసం భాగ్యనగరానికి వచ్చే రోగులకు, వారి కుటుంబ సభ్యులకు సైతం ఈ భోజనాన్ని అందచడానికి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద సైతం ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. పేద ప్రజలకు కడుపునిండా అన్నంపెట్టే ఈ 5రూపాలయకే భోజన పథకాన్ని మార్చి మూడవ తేదీన మేయర్ మాజిద్ హుస్సేన్, జిహెచ్‌ఎంసి కమీషనర్ సోమేశ్ కుమార్‌తో నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద గల సరాయి హోటల్ వద్ద లాంఛనంగా ప్రారంభించారు. హరేరామ హరే కృష్ణ వారి అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి సహకారంతో భోజనాన్ని అందజేస్తున్నారు. అన్నం, పప్పు, సాంబర్, కూరగాయల ను రుచికరమైన భోజనాన్ని ఆయా సెంటర్లకు ఫౌండేషన్ చేరవేస్తుంది ఈ ఫౌండేషన్. ప్రతి ఒక్కరికి 20 రూపాయల ఖర్చవుతుండగా కేవలం 5 రూపాయలను వినియోగదారుడు చెల్లిస్తే మిగతా 15 రూపాయలను సబ్సీడి కింద అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు జిహెచ్‌ఎంసి చెల్లిస్తుంది. ఈ పథకానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సమర్థవంతంగా అమలు జరిగేందుకు 2014-15 సంవత్సరానికి గాను బడ్జెట్‌లో 11కోట్ల రూపా యలను బల్దియా పాలక మండలి విడుదల చేసింది.
ఈ కేంద్రాలను నాంపల్లి సరాయి, కోఠి, చింతల్ బస్తీ, సికింద్రాబాద్, జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయాల వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో విశేష స్పందన లభిస్తుంది. ఈ కేంద్రాలను నగరంలోని 50 సెంటర్లకు విస్తరించాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒక్కో సెంటర్ లో రోజుకు 300 మందికి చొప్పున ప్రతి రోజు 15వేల మందికి పౌష్టికాహారం అందించడమే లక్ష్యమంటున్నారు. భోజనానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల కలుగకుండా ఉండేందుకు వారికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండ, వానలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు శాశ్వత ఏర్పాట్లు చేశారు. నీడనిచ్చేందుకు షెడ్‌లు, కూర్చొని తినేందుకు కుర్చీలను, మంచినీటి వసతులను ఏర్పాటు చేశారు.
ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో కేవలం 5 రూపాయలకు భోజనాన్ని అందించడం వరమంటున్నారు ప్రజలు. ఇలాంటి భోజనం హోటల్లో అయితే యాభైరూ పాయల ఖర్చవుతుందంటున్నారు. అంత ఖర్చుపెట్టలేని తమకు జిహెచ్‌ఎంసి ఆసరాగా నిలిచి నాణ్యమైన భోజనాన్ని 5రూపాయలకే అందిస్తుందని అభినందిస్తున్నారు. ఈ పథకంతో తమకు ఆర్థికంగా కూడా లాభం చేకూరుతుందంటున్నారు ప్రజలు. ఐదు రూపాయలకే భోజన పథకానికి సహకరించిన అధికారులను అభినందించారు బల్దియా మేయర్ మాజిద్ హుస్సేన్. పేద ప్రజలకు తక్కువ ధరకే భోజనాన్ని అందించడం సంతోషకరమన్నారు. ఈ పథకానికి ఎలాంటి అవరోధాలు లుగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పథకం విజయవంతం కావడంతో దీనిలాగే ఒక్క రూపాయికే అల్పాహారం పథకాన్ని ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మేయర్ తెలిపారు. ఈ అల్పాహారంలో ఇడ్లీ, లేదా ఉప్మా, దోశ, పూరీ, చట్నీ, సాంబారు అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీనికి అసలు ఖర్చు పదిరూపాయలు అవుతుండగా తొమ్మిది రూపాయలు జిహెచ్‌ఎంసి భరిస్తుందని, దీనికి ఏడాదికి
హైదరాబాద్‌లో ఒక్క పూట భోజనం చేయాలంటే సగం పర్సు ఖాళీ అవడం గ్యారంటీ. అలాంటిది కేవలం ఐదు రూపాయలకే ఒక్క పూట భోజనం పెట్టడం గర్వంగా ఉందన్నారు జిహెచ్‌ఎంసి కమీషనర్ సోమేశ్ కుమార్. కేవలం వారం రోజుల్లోనే పథకాన్ని రూపొందించి అమలు చేయడం బల్దియా చరిత్రలో ఈ పథకానికి దక్కుతుందన్నారు. పేద ప్రజలకు సేవ చేయడం తనకు సంతోషాన్ని స్తుందని, ఈ పథకాన్ని విడతల వారిగా నగరంలో యాభై సెంటర్లకు విస్తరిస్తామంటున్నారు కమీషనర్. నగరంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం రాష్ట్రం అంతటా అమలు కావాలని ఆశిస్తునానని, దేశంలోనే మొట్టమొదటి సారిగా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కమీషనర్ సోమేశ్ కుమార్.
– సోమేశ్ కుమార్, కమీ
రెండు కోట్ల డెబ్బై లక్షల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.
ర్ మాజిద్ హుస్సేన్ తెలిపారు.