ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించారు. కొత్తగా ఆరుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కొత్తగా మంత్రివర్గంలో చేరిన టి.హరీష్ రావు, కె.టి. రామారావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ లతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీనితో మంత్రివర్గ సభ్యుల సంఖ్య 12 నుంచి 18కి పెరిగింది. రాజ్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, పలువురు మంత్రులు, శాసన సభ్యులు, అధికారులు హాజరయ్యారు. అనంతరం కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి శాఖలను కేటాయించారు. టి హరీష్ రావుకు ఆర్థిక శాఖ, కె. తారక రామారావుకు ఐ.టి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖలు, సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ, గంగుల కమలాకర్ కు బి.సి సంక్షేమం, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, సత్యవతి రాథోడ్ కి ఎస్టీ, మహిళా సంక్షేమం, పువ్వాడ అజయ్ కుమార్ కు రవాణా శాఖ కేటాయించారు.
హోం
»