తెంగాణ రాష్ట్రంలో నెకొల్పే పరిశ్రమల్లో స్థానికుకు ఎక్కువ
ఉద్యోగ అవకాశాు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తెంగాణ రాష్ట్రం ఏర్ప డిన తర్వాత ప్రభుత్వం టిఎస్‌ ఐపాస్‌ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతు విధానం తెచ్చింది. దీనివ్ల పెద్ద ఎత్తున పరిశ్రము రాష్ట్రానికి వస్తున్నాయి. అయితే ఇలా వస్తున్న పరిశ్రమల్లో తెంగాణ యువకుకు ఎక్కువ అవకాశాు దక్కేలా విధానం రూపొందించాని ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశ్రమ శాఖను ఆదేశించారు.

దీనిపై మంత్రి కేటీ రామారావు ఆధ్వర్యంలో కసరత్తు చేసిన పరిశ్రమ శాఖ ముసాయిదా తయారు చేసింది. దీనిపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం విస్తృతంగా చర్చించింది. తెంగాణలో నెకొల్పే పరిశ్రమల్లో స్థానికుకు ఎక్కువ అవకాశాు రావాని కేబినెట్‌ అభిప్రాయపడిరది. స్థానికుకు ఎక్కువ ఉద్యోగాు ఇచ్చే పరిశ్రమకు అదనపు ప్రోత్సాహకాు అందించాని కేబినెట్‌ నిర్ణయించింది.

హైదరాబాద్‌ నగరంలో ఐటి పరిశ్రము ఒకే చోట కాకుండా నగరం నువైపులా విస్తరించాని కేబినెట్‌ అభిప్రాయపడిరది. హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల ఐటి కంపెనీు పెట్టే వారికి అదనపు ప్రోత్సహకాు అందించే హైదరాబాద్‌ గ్రిడ్‌ (Gతీశీష్‌ష్ట్ర Iఅ ణఱంజూవతీంఱశీఅ) పాసిని కేబినెట్‌ ఆమోదించింది.

పెరిగిపోతున్న వాహనా వ్ల ఎక్కువయ్యే వాయు కాుష్యాన్ని తగ్గించడానికి తెంగాణ రాష్ట్రంలో ఎక్ట్రిక్‌ వాహనా వాడకాన్ని ప్రోత్సహించాని కేబినెట్‌ నిర్ణయించింది. ప్రత్యేక రాయితీు ఇచ్చి రాష్ట్రంలో ఎక్ట్రిక్‌ వాహనా తయారీ పరిశ్రమను ప్రోత్సహించాని నిర్ణయించింది. తెంగాణ స్టేట్‌ ఎక్ట్రానిక్‌ వెహికిల్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజ్‌ స్యొూషన్‌ పాసీని కేబినెట్‌ ఆమోదించింది.సెక్రటేరియట్‌ కొత్త భవన సముదాయం నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిజైన్లను ఆమోదించింది.


కరోనాపై అందోళన వద్దు
కరోనా వ్యాప్తి – వైరస్‌ సోకిన వారికి అందుతున్న చికిత్స- ప్రభుత్వ వైద్యాన్ని మరింత పటిష్టం చేసే అంశాపై రాష్ట్ర మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. దాదాపు రెండున్నర గంట పాటు నిపుణు, వైద్యుతో చర్చించింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, వివిధ విభాగాధిపతును సమావేశానికి ఆహ్వానించి చర్చించారు. ఈ సందర్భంగా వైద్యాధికాయి కరోనా పరిస్థితిపై వివరాు అందించారు.

‘‘ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాకు పాకిన కరోనా ప్రస్తుతం పెద్ద నగరాల్లో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌ లోనూ కేసు తగ్గుతున్నాయి. తెంగాణలో మరణా రేటు తక్కువగానూ, కోుకుంటున్న వారి రేటు ఎక్కువగానూ నమోదవుతున్నది. కాబట్టి ప్రజు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని వైద్య నిపుణు కేబినెట్‌ కు వివరించారు.
ప్రజు పెద్దగా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కేబినెట్‌ కోరింది. ఎన్ని కేసు వచ్చినా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఎక్కువ వ్యయం చేసి ప్రైవేటు ఆసుపత్రుకు పోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతు, మందు, నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, వారిని ఉపయోగించుకోవాని కేబినెట్‌ ప్రజను కోరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సిన మందు, పరికరాు, వసతు ఏర్పాటు చేయడానికి ఎన్ని డబ్బులైన వెనుకాడేది లేదని స్పష్టం చేసింది.


రైతన్నకు అభినందనలు
ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత సాగు పద్ధతిలో ఈసారి వానాకాం పంటు వేసిన రైతును రాష్ట్ర కేబినెట్‌ అభినందించింది. నియంత్రిత పద్ధతిలో సాగు విధానం వ్యవసాయ రంగంలో గొప్ప విప్లవానికి నాంది అని, ప్రభుత్వం చెప్పింది తమకోసమే అని రైతు గ్రహించడం వారి చైతన్యానికి, పరివర్తనాశీతకు నిదర్శనమని కేబినెట్‌ అభిప్రాయపడిరది.
రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన అంశాపై కేబినెట్‌ దాదాపు రెండున్నర గంటు చర్చించింది. నియంత్రిత పద్ధతి ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 1.13 కోట్ల ఎకరాల్లో పంటు వేసారని, మరో 10-12 క్ష ఎకరాల్లో పంటు వేయాల్సి
ఉందని, 8.65 క్ష ఎకరాల్లో వివిధ రకా తోటున్నాయని వ్యవసాయ శాఖ అధికాయి చెప్పారు. గత వానాకాంలో రాష్ట్రంలో కోటి 22 క్ష ఎకరాల్లో సాగు జరిగితే, ఈ సారి కోటి 30 క్షకు పైగా ఎకరాల్లో సాగు జరుగుతున్నదని వారు వివరించారు. తెంగాణలో వ్యవసాయ విస్తీర్ణం, పంట దిగుబడి పెరగడం పట్ల కేబినెట్‌ హర్షం వ్యక్తం చేసింది. తెంగాణ వ్యవసాయం దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని, ఇటీవ ఎఫ్‌.సి.ఐ. సేకరించిన ధాన్యంలో రాష్ట్రం వాటా 55 శాతంగా తేడం ఈ విషయం నిరూపించిందని కేబినెట్‌ అభిప్రాయపడిరది.

దేశంలో మరెక్కడా లేని విధంగా తెంగాణ రాష్ట్రంలో మాత్రమే అమవుతున్న రైతుబంధు ద్వారా ఈ వానాకాంలో ఒకేసారి పెద్ద మొత్తంలో రైతుకు నగదు సహాయం అందిందని, కరోనా కష్టకాంలో ఇది రైతుకు పెద్ద సహాయంగా ఉపయోగపడిరదని మంత్రు అన్నారు. కోటి 45 క్ష ఎకరాకు సంబంధించి, 57.62 క్ష మంది రైతుకు, రూ.7,251 కోట్ల రూపాయు అందించడం అసాధారణమని పేర్కొన్నారు. ఇంకా ఎక్కడైనా రైతు మిగిలిపోయినా వారిని గుర్తించి సహాయం అందించాని అధికారును కోరింది.

వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచాని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ యంత్రా గణన చేపట్టాని, ఇంకా ఎన్ని అవసరమో గుర్తించాని అధికారును కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతు వేదిక నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాని సిఎం కోరారు. రైతు వేదికకు స్థం ఇచ్చినా, నిర్మాణానికి నిధు ఇచ్చినా వారు సూచించిన వారి పేరును వేదికకు పెట్టాని సిఎం ఆదేశించారు.

వ్యవసాయం లాభసాటిగా మారడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాు పెంచడం క్ష్యంగా రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రము పెంచాని కేబినెట్‌ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌ు పెట్టానే సిఎం నిర్ణయాన్ని కేబినెట్‌ అభినందించింది. రైతుకు లాభసాటి ధర రావడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాు పెంపొందించడం క్ష్యంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌ ు నెకొల్పాని అభిప్రాయపడిరది. ఇందుకోసం సమగ్ర విధానం తీసుకురావాని నిర్ణయించింది. త్వరలోనే మంత్రు, అధికాయి సమావేశమై విధాన రూపక్పన చేస్తారు.


వలస కార్మికుల సంక్షేమం
లాక్‌ డౌన్‌ సమయంలో వస కార్మికు కష్టాను ప్రపంచమంతా కళ్లారా చూసిందని, భవిష్యత్తులో వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాపై ఉందని కేబినెట్‌ అభిప్రాయపడిరది. తెంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రా నుంచి వచ్చిన కార్మికు పనిచేస్తున్నారని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక పాసీ తయారు చేయాని నిర్ణయించింది. పుట్టిన ఊరిని, కన్న వారిని, కుటుంబాన్ని వదిలి పనికోసం తెంగాణకు వచ్చే కార్మికు ఇదే తమ ఇు్ల అనే భావన, భరోసా కలిగించేలా చర్యు తీసుకోవాని అభిప్రాయపడిరది. వస కార్మికు సంక్షేమ పాసీ రూపొందించాని అధికారును ఆదేశించింది.

భవన నిర్మాణ అనుమతును సరళతరం చేస్తూ రూపొందించిన టిఎస్‌ – బిపాస్‌ పాసీని మంత్రివర్గం ఆమోదించింది. టిఎస్‌ ఐపాస్‌ లాగానే టిఎస్‌ బి-పాస్‌ కూడా అనుమతు విషయంలో పెద్ద సంస్కరణ అని కేబినెట్‌ అభిప్రాయపడిరది.
దుమ్ముగూడెం బ్యారేజికి సీతమ్మ సాగర్‌, బస్వాపూర్‌ రిజర్వాయర్‌ కు నృసింహ స్వామి రిజర్వాయర్‌, తుపాకుగూడెం బ్యారేజికి సమ్మక్క బ్యారేజిగా నామకరణం చేస్తూ కేబినెట్‌ తీర్మానించింది.

మున్సిపాలిటీు, గ్రామ పంచాయతీు, ప్రభుత్వ కార్యాయాు చెల్లించాల్సిన కరెంటు బ్లిును ప్రతీ నెలా క్రమం తప్పకుండా చెల్లించాని కేబినెట్‌ ఆదేశించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. గ్రామ పంచాయతీు, మున్సిపాలిటీు గతంలో ఉన్న విద్యుత్‌ బకాయిను వన్‌ టైమ్‌ సెటిల్‌ మెంట్‌ ద్వారా చెల్లించే వెసుబాటు ఇవ్వాని కేబినెట్‌ నిర్ణయించింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖకు చెందిన పనికి రాని పాత వాహనాను అమ్మేయడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాను అనుసరించి పాఠశా విద్యార్థుకు ఆన్‌ లైన్‌ క్లాసు నిర్వహించాని, ఇందుకోసం దూరదర్శన్‌ను వినియోగించుకోవాని కేబినెట్‌ నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ ఖరారు చేయాని అధికారును ఆదేశించింది. అన్ని ప్రవేశ పరీక్ష నిర్వహణకు షెడ్యూల్‌ రూపొందించాని ఆదేశించారు. డిగ్రీ, పీజీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్ష నిర్వహణ విషయంలో కోర్టు ఆదేశా మేరకు నడుచుకోవాని నిర్ణయించింది.

Other Updates