ktrతెలంగాణ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. పంచాయతీరాజ్‌, ఐటి శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామా రావుకు లైఫ్‌స్టైల్‌ మ్యాగజైన్‌ రిడ్జి పత్రిక, జాతీయ చానళ్లలో ప్రముఖమైన సీఎన్‌ఎన్‌-ఐబిఎన్‌ చానల్‌వారు సంయుక్తంగా ఇచ్చే ”అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తి” (మోస్ట్‌ ఇన్‌స్పిరేషనల్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌) అవార్డు అందుకున్నారు. డిసెంబరు 13న బెంగుళూరులోని తాజ్‌ వెస్ట్‌ఎండ్‌ హోటల్‌లో కన్నుల పండుగగా జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు ఈ అవార్డును కేటీఆర్‌కు అందచేశారు. దేశంలో ఆయా రంగాల్లో విశేషమైన ప్రతిభ కనబరచిన వారికి భిన్న అంశాల ప్రాతిపదికన విశ్లేషించి నిర్వాహకులు ఎంపిక చేశారు. ప్రజా జీవితంలో అద్భుతమైన పురోగతిసాధించిన వారి క్యాటగిరీలో కేటీఆర్‌ను ఎంపిక చేశారు. తెలంగాణలో ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్న తెలివైన నాయకుడు మంత్రి కేటీఆర్‌ అని అవార్డుల కమిటీ పేర్కొన్నది.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి గుర్తింపుగా అవార్డు వచ్చిందని పేర్కొన్నారు. 18 నెలల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళుతున్నామన్నారు. ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చామన్నారు. పారదర్శక పనితీరుతో ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నామన్నారు. దేశంలోని పలు రంగాలలో విశేషమైన ప్రతిభ కనబరచిన వారిని వివిధ అంశాల ప్రాతిపదికన విశ్లేషించి ఎంపికచేసే ఈ అవార్డుకు తనను ఎంపిక చేయడం తెలంగాణ ప్రజానీకాన్ని గౌరవించడమే అన్నారు. కాగా రిడ్జి-సీఎన్‌ఎన్‌ అవార్డుకు కేటీఆర్‌ను ఎంపిక చేసిన సందర్భంగా ప్రజా జీవితంలో అద్బుత పురోగతిని సాధించినందుకు గాను ఎంపిక చేసినట్లు రిడ్జ్‌-సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌లు అవార్డు ప్రకటించిన సందర్భంగా తెలియచేశాయి.

పరిపాలనా పద్దతులు, ఆలోచన విధానాలతో ఉన్నత ప్రమాణాలు నిలిపేందుకు కృషి చేస్తున్న తెలివైన నాయకుడని, ప్రజల అవసరాలపై అపారమైన జ్ఞానమున్న కొత్త తరం నాయకుడని ఎంపిక కమిటీ జ్యూరీ అభిప్రాయపడింది.

Other Updates