ktrమారిషస్‌ ప్రధానమంత్రి అనిరుధ్‌ జగన్నాథ్‌తో మంత్రి కె.తారకరామారావు సమావేశం

ఇన్నోవేషన్‌, టూరిజం, స్కిల్లింగ్‌, ఆయుష్‌ రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చ

ముంబైలో మారిషస్‌ ప్రధానమంత్రి అనిరుధ్‌ జగన్నాథ్‌ను నవంబర్‌ 19న కలిసిన మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి తారకరామారావు, పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య వారధిగా వ్యవహరిస్తు టాస్క్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న శిక్షణ కార్యక్రమాల వివరాలను ఆయనతో పంచుకున్నారు. తెలంగాణలో నైపుణ్య శిక్షణా కార్యక్రమాల కోసం టాస్క్‌ ఏర్పాటుచేసి ఇప్పటికే చాలా మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు, యువ కులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని కె.తారకరామారావు చెప్పారు. నైపుణ్య శిక్షణా రంగంలో మారిషస్‌ సాధించిన అద్భుతమైన ప్రగతి, అనుభవాలను తెలంగాణతో పంచుకో వాలని కోరా రు. ఇందుకోసం అధికారికంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఇన్నోవేషన్‌ రంగంలో దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిన టీ హబ్‌ మొన్ననే ఏడాది పూర్తి చేసుకుందని మారిషస్‌ ప్రధానమంత్రికి గుర్తుచేశారు. దేశంలో ఇన్నోవేషన్‌ ఎకో సిస్టాన్ని టీహబ్‌ బలోపేతం చేసిందని, విజయవంత మైన ఈ ప్రయోగాన్ని విస్తృత పరిచేం దుకు టీ హబ్‌-2ను నిర్మిస్తున్నట్టు మం త్రి కేటీఆర్‌ వివరించారు. తెలంగాణ, మారిషస్‌ మధ్య అవగాహన ద్వారా ఇన్నోవేషన్‌ రంగంలో పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇంతేకాకుండా తెలంగాణ నుంచి మారిషస్‌కు టూరిస్టులు భారీగా వెళతారని, తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను మారిషస్‌కు పరిచయం చేసేందుకు ఈ పరిణామాన్ని ఉప యోగించుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు. పర్యాటక రంగంలో తెలంగాణ, మారిషస్‌ పరస్పరం సహకరించుకోవాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. పలుసార్లు తెలంగాణను సందర్శించిన తమ దేశ ప్రతినిధి బృందాలు తెలంగాణ ప్రగతిని, ప్రభుత్వ విధానాల గురించి సానుకూలంగా మాట్లాడారని అనిరుధ్‌ చెప్పారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన రెండేళ్లలోనే తెలంగాణ సాధించిన ప్రగతి అభినందనీయమన్నారు. విభిన్న రంగాల్లో అభివద్ధి దిశగా దూసుకెళుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రంతో పరస్పర అవగాహనకు, భాగస్వామ్యానికి మారిషస్‌ సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్‌కు అనిరుధ్‌ హామీ ఇచ్చారు.

Other Updates