అతడు
ఉషోదయాన్ని కలగన్నాడు
నిరంతర గాయాలను ఛేేదిస్తూ..
అతడు
అస్తిత్వ నావను దరిచేర్చాడు
పెను ఉప్పెనల నెదిరిస్తూ..
అతడు
సుందర స్వప్నాల్ని ముద్దాడాడు
ఆధిపత్యం మీద స్వేచ్ఛ ను ఎగరేస్తూ..
అతడు
స్వరాష్ట్రాన్ని సాధించ
పాంచజన్యమై మోగాడు
పర్జన్యమై ఉరిమాడు
ఖలుల కుట్రలు,సమ్మెట పోటులు అధిగమిస్తూ…
అతడు
సమరశీల చరిత్రై
జీవ నదిలా సాగిపోయాడు
దాడులకు ఎదురొడ్డుతూ
శిఖరంలా నిలబడ్డాడు
అతడు
గాలి, వాన, తుపాను, సునామి
భూకంప అష్ట కష్టాలేకమైనా
ఒకే ఒక్కడు
ఏనుగుల సవ్వారై పోరాడాడు
విజేతై నిలిచాడు…
అతడే
సర్వ మతాతీత ఆదిత్యుడు
మంగళాచరణుడు
దేశానికే దిక్సూచి
మన అశోకుడు
– వనపట్ల సుబ్బయ్య