-మంగారి రాజేందర్
శాసనం అంటే ఏమిటి? అన్న ప్రశ్న సాధారణంగా తలెత్తుతుంది. మన నడివడికను నిర్దేశంచే నియమాలని ఆధికారికంగా గుర్తించడమే శాసనం. శాసనంలో ఇవి ఇమిడి వుంటాయి. ఈ నియమాలు నిబంధనలని అమలు చేసే ప్రక్రియని మనం ‘న్యాయ వ్యవస్థ’ అంటాం.
మన భారత దేశ న్యాయ వ్యవస్థలో ఎన్నో అంశాలు వున్నాయి. వాటి మూలాలు మరెన్నో. అవి – మత పరంగా లౌకికంగా, ఆచార వ్యవహారాల ద్వారా వచ్చినవి, శాసనం ద్వారా న్యాయవ్యవస్థ ద్వారా ఖ్వాసీ న్యాయవ్యవస్థ ద్వారా వచ్చినవి.
భారత న్యాయవ్యవస్థలోని ముఖ్యాంశాలు :
భారత న్యాయవ్యవస్థలో ఈ ముఖ్యాంశాలు వుంటాయి.
అవి –
ఎ) మన రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులు అన్ని శాసనాలని పర్యవేక్షిస్తాయి.
బి) ఫెడరల్ ప్రభుత్వ విధానం వల్ల రెండు రకాల శాసనాలు మన దేశంలో వుంటాయి. కేంద్ర శాసనాలు, రాష్ట్రాలు చేసే శాసనాలు.
సి) శాసనాలకి ఆధారంగా పూర్వ ప్రమాణాలని కూడా గుర్తించడం జరిగింది. మన దేశం ‘కామన్ లా’ కుటుంబంలోని భాగం.
డి) వివిధ విషయాల మీద సంపూర్ణమైన కోడ్‌లు
ఇ) విరోధి పద్దతిలో ప్రొసీజర్
ఎస్) న్యాయపాలన
ముఖ్యమైన ప్రాధమిక హక్కులు
ప్రాధమిక హక్కులన్నీ ముఖ్యమైనవే. వ్యక్తి జీవితం స్వేచ్ఛలు ఎంత ముఖ్యమో, పార్లమెంట్, శాసన వ్యవస్థలు చేసిన చట్టాలు ఈ ప్రాథమిక హక్కులకి అనుగుణంగా వున్నాయా లేదానన్నది చూడటం కూడా అంతే ముఖ్యం.
శాసనాల విషయానికి వచ్చినప్పుడు ప్రాధమిక హక్కులు అన్నింటి కన్నా ముఖ్యమైనవి. ఈ హక్కులకి విరుద్ధంగా ఏదైనా చట్టం వుంటే అది చెల్లదు. భారత రాజ్యాంగంలోని అధికరణ 13 ఈ విషయాన్నే చెబుతుంది. కోర్టులు ఈ విషయాలని పరిశీలిస్తాయి. దీన్నే న్యాయ సమీక్ష అని అంటారు.
సమాఖ్య రాజకీయ విధాన ప్రభావం
సమాఖ్య రాజకీయ విధన ప్రభావం మన న్యాయ వ్యవస్థ మీద కూడా వుంది. సమాఖ్య రాజకీయ విధానంలో శాసనాలు తయారు చేసే వ్యవస్థలు రెండు వుంటాయి. అవి – యూనియన్, స్టేట్. ఈ రెండింటి అధికార పరిధిని మాన రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించారు. మన దేశంలోని పౌరులు ఈ రెండు శాసనాల పరిధికి లోబడి వుంటాడు. అయితే కొన్ని కోడ్‌లు దేశానికి కంతటికీ వర్తించే విధంగా వున్నాయి. అందుకని న్యాయవ్యస్థ అని ప్రభావం చేయలేదు.
మన దేశంలో ముఖ్యమైన అంశాల మీద తయారు చేసిన శాసనాలు దేశ మంతటికీ వర్తిస్తాయి. ఉదాహరణకి సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారతీయ సాక్ష్యాధారాల చట్టం, ఆస్తి బదాలయింపు చట్టం, కాట్రాక్ట్ చట్టం మొదలైనవి.
కామన్ లా ఫోల్డ్ అంటే ఏమిటి?
పూర్వ ప్రమాణాలని అంటే గతంలో పై కోర్టులు ఇచ్చిన తీర్పుల సారాంశాలని మన దేశంలోని న్యాయవ్యవస్థ గుర్తిస్తుంది. ఇది సివిల్ లా వ్యవస్థకి పూర్తిగా విరుద్ధం. గత తీర్పులని ఆ వ్యవస్థ ఒప్పుకోదు. గత తీర్పులని, పూర్వ ప్రమాణాలని గుర్తించే దేశాలను కామన్ లా దేశాలని, దాన్ని కామన్ లా ఫోల్డ్ అని అంటారు.
శాసనానికి, కేసులాకి సంబంధం వుంది. అదే విధంగా బేధం వుంది.
ఎక్కడైతే శాసనం మౌనంగా వుంటుందో అక్కడ కేసులో లాగ చెప్పిన విషయం ప్రామాణికం అవుతుంది.
అయితే కేసులో లాగ చెప్పిన విషయాన్ని శాసన వ్యవస్థ మార్పు చేయవచ్చు. తొగించవచ్చు. కొంత స్పష్టతని కూడా ఇవ్వవచ్చు. అయితే ఇది రాజ్యాంగానికి లోబడి మాత్రమే చేయాల్సి వుంటుంది.
అయితే ఈ విధంగా మార్పు చేసిన చట్టం న్యాయసమీక్షకు లోబడి వుంటుంది.
భారత శాసనాలకి ఆధారం
భారత శాసనాలని ముఖ్యంగా వీటి నుంచి పొందడం. అవి శాసనాలు, అధికార ప్రధాన శాసనాలు, పూర్వ ప్రమాణాలు (కేసులా) ఆచారం.
అయితే శాసనాలని తయారు చేసే ఆధికా రాలు మాత్రం ఈ రెండింటికే వుంటాయి. అవి –
భారత పార్లమెంట్.. రాష్ట్ర శాసన వ్యవస్థలు
పూర్వ ప్రమాణాలు శాసనాలకి ఆధారం ఆవడం అంటే…
కేసులా గానీ పూర్వ ప్రమాణం కానీ శాసనానికి ఆధారం అవుతుంది. ఈ విషయంలో మన దేశం కామన్ లా ఫోల్ట్‌లో వుటుంది. హై కోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఏదైనా కేసుని నిర్ధారించినప్పుడు ఆ తీర్పులో రెండు అంశాలు వుంటాయి.
మొదటిది : ఆ తీర్పు ఆ కేసులోని పార్టీలకి పాలనీయం అవుతుంది (ంంంంంం)
రెండవది : ఏదైనా లీగల్ పాయింట్ మీద తీర్పు వుంటే అది క్రింది కోర్టుల మీద పాలనీయమై వుంటుంది. అలాంటి తీర్నులో ఆ క్రింది కోర్టులు సుప్రీం కోర్టు నిర్దేశించిన రీతిలో తమ తీర్పులని వెలువరించాల్సి వుంటుంది.
గతంలో ఇచ్చిన తీర్పుని అదే హై కోర్టులోని పెద్ద బెంచి రద్దు చేయవచ్చు. హై కోర్టులు ఇచ్చిన తీర్పులని సుప్రీం సుప్రీం కోర్టు రద్దు చేయవచ్చు. ఆ విధంగా రద్దు చేయనంత వరకు అవి క్రింది కోర్టుల మీద పాలనీయం అవుతాయి. దీన్నే ఇంగ్లీసులో ప్రిసిడెంట్ అని తెలుగులో పూర్వ ప్రమాణం అని అంటారు.
శాసనాలు ఎంత జాగ్రత్తగా తయారు చేసినప్పటికీ కొన్ని విషయాలని అవి కవర్ చేయలేక పోతాయి. ఆ ఖాళీని తీర్పులలో చెప్పిన విషయాలు పూరిస్తాయి.
ఒక విషయం మీద శాసనం వున్నప్పటికీ దాన్ని వ్యాఖ్యానించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అలాంటి సందర్భాలలో కోర్టులు అంటే హై కోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన వ్యాఖ్యానాలు శాసనంగా క్రింది కోర్టులు భావించాల్సి వుంటుంది.
రెండు హై కోర్టు ఒకే విషయం మీద రెండు రకాల తీర్పులని ప్రకటిస్తే
ఒకే విషయం మీద రెండు హైకోర్టులు రెండు రకాలైన తీర్పులని ప్రకటించే అవకాశం వుంది. అలాంటి సందర్భాలలో ఆయా రాష్ట్రాల హైకోర్టులోని క్రింది కోర్టులు ఆ హైకోర్టు తీర్పును పాటించాల్సి ఉంటుంది. ఈ విషయం మీద సుప్రీం కోర్టు మరో తీర్పు ద్వారా స్పష్టత ఇచ్చే వరకు ఇలా పాటించాల్సి వుంటుంది.