sdఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి పాలకుల వైఖరి, నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ ప్రాంతం సాంస్కృతికంగా, చారిత్రకంగా ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడిరది. ఈ ప్రాంత పండుగలకు, ఆచార వ్యవహారాలకు, చివరకు ఈ ప్రాంత నాయకులకు కూడా గుర్తింపు లేకుండా పోయింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత స్వపరిపాలనలో తిరిగి పూర్వ వైభవం సంతరించుకొనే దిశగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పలు నిర్ణయాలు గైకొన్నారు.

కాకతీయ తోరణం, చార్మినార్‌, అశోక చక్రం, సత్యమేవ జయతే, గవర్నమెంట్‌ ఆఫ్‌ తెలంగాణ అని ఉన్న చిహ్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నంగా రూపొందించారు.

తెలంగాణలో జరుపుకునే బతుకమ్మ, బోనాల పండుగను స్టేట్‌ ఫెస్టివల్స్‌ లాగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బోనాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇందులో స్వయంగా పాల్గొన్నారు. బతుకమ్మ పండుగను కూడా అధికారికంగా ఘనంగా నిర్వహించారు. రంజాన్‌, క్రిస్‌మస్‌ సందర్భంగా కూడా అధికారికంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసింది.

  • శ్రీ ఎన్నో పదవులు ఆలంకరించి, చివరికి దేశ ప్రధానిగా అయిదేళ్లు పనిచేసి ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన తెలంగాణ బిడ్డ పి.వి. నర్సింహారావుకి సమైక్య పాలకులు సరైన గౌరవం, గుర్తింపు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీవిని సమున్నత రీతిలో గౌరవించాలని నిర్ణయించింది. జూన్‌ 28న పి.వి.జయంతిని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది ప్రభుత్వం. తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి పీవి పేరు పెట్టాలని నిర్ణయించింది. పీవికి భారత రత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు కూడా చేసింది. వరంగల్‌లో పీవి విగ్రహం కూడా ఏర్పాటు అయింది.
  • శ్రీ ప్రజాకవి కాళోజి నారాయణరావు తెలంగాణ వ్యవహారిక భాషకు ప్రాచుర్యం కల్పించారు. ‘నా గొడవ’ పేరుతో అనేక రచనలు చేశారు. అనేక పోరాటాలు, ఉద్యమాలలో పాల్గొన్నారు. కేంద్రం పద్మ విభూషణ్‌ అవార్డుతో గౌరవించినా, సమైక్య రాష్ట్రంలో ఆయనకు సరైన గౌరవం దక్కలేదు. తెలంగాణ రాష్ట్రం కాళోజిని గొప్పగా గౌరవించింది.కాళోజి జయంతిని అధికారికంగా నిర్వహించింది. 9,సెప్టెంబర్‌,2014 న కాళోజి శత జయంతిని అటు వరంగల్‌లో, ఇటు హైదరాబాద్‌లో నిర్వహించారు. కాళోజి శత జయంతి, కేసిఆర్‌ ప్రభుత్వం కొలువుతీరి వంద రోజులు అవడం ఈ రెండు ఒకేరోజు రావడం యాధృచ్చికమే అయినా, తెలంగాణ సమాజానికి ఓ మధురమైన క్షణం. కాళోజి కళా కేంద్రం పేరుతో వరంగల్‌ బాల సముద్రంలో మూడెకరాల స్థలంలో ఆడిటోరియం, ఉద్యానవనం నిర్మిస్తున్నారు. అదే ప్రాంగణంలో పెద్ద కాళోజి విగ్రహం కూడా నెలకొల్పనున్నారు.
  • శ్రీ పద్యాన్ని పదునైన ఆయుధంగా మార్చుకుని తెలంగాణ ప్రజలను చైతన్య వంతులను చేసిన దాశరథి కృష్ణమాచార్య జయంతిని ప్రభుత్వం 22, జూలై 2014న అధికారికంగా నిర్వహించింది. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని దాశరథి పేరిట అవార్డు నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. పేదరికంలో వున్న ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది.
  • శ్రీ హైదరాబాద్‌లో పలు జలాశయాల నిర్మాణానికి రూపకల్పన చేసిన ప్రఖ్యాత ఇంజనీర్‌ నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ జయంతిని జూలై 11న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. హైదరాబాద్‌లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు. జంగ్‌ జయంతిని ‘తెలంగాణ ఇంజనీర్స్‌ డే’గా ప్రభుత్వం ప్రకటించింది.
  • శ్రీ 15,ఆగస్టు,2014న భారత స్వాతంత్య్ర దిన వేడుకలను తెలంగాణ ప్రభుత్వం మొదటి సారిగా గోల్కొండ కోటలో నిర్వహించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ రరావు గోల్కొండ కోటలోనే పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జెండా ఎగురవేశారు. తెలంగాణ చారిత్రక వారసత్వాన్ని ఘనంగా చాటేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
  • శ్రీ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014 సెప్టెంబర్‌ 27న పద్మశాలి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పాల్గొని కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహన్ని ఆవిష్కరించారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టిస్తామని సిఎం హామీనిచ్చారు.
  • శ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవసరమైన వార్తా ప్రసారాలు అందించడం కోసం దూరదర్శన్‌ ఓ ప్రత్యేక ఛానల్‌ ప్రారంభించింది. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ‘యాదగిరి’ అనే పేరు పెట్టారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడు దూరదర్శన్‌ ‘సప్తగిరి’ అనే పేరుతో తెలుగు ప్రేక్షకులందరికి కలిపి ఒకే ఛానల్‌ వుండేది. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక ఛానల్‌ వుండాలని కెసిఆర్‌ ప్రభుత్వం ప్రతిపాదించడంతో ప్రత్యేక ఛానల్‌ వచ్చింది.
  • శ్రీ ‘తెలంగాణ’ ప్రజలకు అభివృద్ది, సంక్షేమ వార్తలు, విశే షాలు అందించడం కోసం, తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటం కోసం ‘తెలంగాణ’ పేరుతో ఓ మాసపత్రికను ప్రభుత్వం వెలువరిస్తోంది. ప్రతీ నెలా వచ్చే ఈ సంచికను సద్దుల బతుకమ్మ రోజు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆవిష్కరించారు.
  • శ్రీ ఇక్కడి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలకు అద్దం పట్టేలా అధికారిక చిహ్నాలను ఎంపిక చేశారు. రాష్ట్ర జంతువుగా జింకను, రాష్ట్ర పక్షిగా పాలపిట్టను, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టును, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును ఖరారు చేశారు. అధికారిక చిహ్నాల ఎంపికలో చరిత్ర, పౌరాణిక నేపథ్యం, సంస్కృతి, సంప్రదాయాలు, అలవాట్లు తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు.
  • శ్రీ హైదరాబాద్‌ బంజారా హిల్స్‌ రోడ్డు నెం.10 లోని ప్రభుత్వ భూమిలో బంజారా, ఆదివాసీల కోసం చెరొక భవన్‌ నిర్మించాలని నిర్ణయించారు. . ఒక్కో భవనానికి ఒక్కో ఎకరం స్థలం కేటాయించారు. ఒక్కో భవన నిర్మాణానికి గాను 2.5 కోట్ల చొప్పున మొత్తం 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. బంజారా భవన్‌ పేరుతో బంజారాలకు, కుంమురం భీమ్‌ భవన్‌ పేరుతో ఆదివాసీలకు ప్రత్యేక భవనాలు నిర్మించేందుకు ముఖ్యమంత్రి డిసెంబర్‌ 11, 2014న శంఖుస్థాపన చేశారు.
  • శ్రీ తెలంగాణ రాష్ట్రంలోని అర్చకులకు, బ్రాహ్మణ పరిషత్‌ సమాజానికి ప్రత్యేకంగా ఒక భవనం రూ. 10 కోట్లతో హైదరాబాద్‌ లో నిర్మిస్తారు. జనవరి 9, 2015న వరంగల్‌ లో నిర్వహించిన బ్రాహ్మణ సదస్సులో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు వేతనాలు పెంచేందుకు కూడా నిర్ణయించారు.
  • శ్రీ క్రిస్టియన్ల కోసం హైదరాబాద్‌ నగరంలో రూ.పది కోట్లతో క్రైస్తవ భవన్‌ నిర్మించి ఇస్తామని డిసెంబర్‌ 18, 2014న నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గ్గొన్న ముఖ్యమంత్రి ప్రకటించారు. అందుకు అనుగుణంగా భవన నిర్మాణానికి వెంటనే శంకుస్థాపన కూడా చేశారు. మంచి ఆర్కిటెక్చర్‌తో అంతర్జాతీయ స్థాయిలో దీని నిర్మాణం ఉంటుంది.
  • శ్రీ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వెంకన్నతో పాటు తెలంగాణలోని పలు దేవాలయాలకు కానుకలు, ఆభరణాలు సమర్పిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పెట్టుకున్న మొక్కుబడులు నెరవేరనున్నాయి. రాష్ట్రప్రభుత్వం మొక్కుబడులకు సంబంధించి బంగారు ఆభరణాల తయారీకి నిధులు విడుదల చేసింది. మొత్తం అయిదు దేవాలయాలకు కలిపి రూ. 5.59 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ ఆభరణాల తయారీకి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
  • శ్రీ తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఆజ్మీర్‌ దర్గాలో వసతి గృహాన్ని నిర్మిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రూ.5కోట్లు మంజూరు చేస్తూ ఫిబ్రవరి 4, 2015న ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లే యాత్రికుల కోసం ఈ వసతి గృహాన్ని నిర్మించనున్నారు. మక్కాలో ఉండే మక్కాభవన్‌ మాదిరిగా దీన్ని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడిరచారు.
  • శ్రీ ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన పోరాట యోధుడు కొమరం భీమ్‌ 74వ వర్దంతిని 8, అక్టోబర్‌ 2014న జోడే ఘాట్‌లో అధికారికంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొమరం భీమ్‌ స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. రూ. 25 కోట్లతో ఏర్పాటు చేసే కొమరం భీమ్‌ స్మారక చిహ్నానికి శంకుస్థాపన చేశారు.కొమరం భీమ్‌ కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. జోడే ఘాట్‌ కేంద్రంగా 100 ఎకరాల స్థలంలో పర్యాటక కేంద్రం అభివృద్ది చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
  • శ్రీ తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాతల్లో ఒకరైన ఈశ్వరీబాయి వర్దంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించింది. ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో పొందుపరుస్తామని ముఖ్యమంత్రి వెల్లడిరచారు.
  • శ్రీ రవీంద్రభారతిలో జనవరి 20, 2015న జరిగిన జి.వెంకటస్వామి సంస్మరణ సభలో సిఎం పాల్గొన్నారు. ప్రతి ఏడాది అధికారికంగా జి. వెంకటస్వామి(కాకా) జయంతి, వర్థంతిని ప్రభుత్వమే నిర్వహించనున్నది.
  • హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో ప్రజలందరూ నిత్యం దర్శించుకునే విధంగా మెమోరియల్‌ ఏర్పాటు చేస్తారు. ఇందుకు అనువైన స్థలం సేకరించి, సభలు నిర్వహించుకోవడానికి వీలుగా నిర్మాణం చేపట్టి, అందులో విగ్రహం కూడా నెలకొల్పుతారు. ఈ నిర్మాణ భాద్యతలను ప్రభుత్వం హెచ్‌.ఎం.డి.ఎ.కు అప్పగించింది.
  • శ్రీ ప్రతి ఏటా బడ్జెట్‌లో 100 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా కేటాయిస్తూ యాదగిరిగుట్టను సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం ప్రారంభమైంది. ఇందుకు గాను 2015-16 రాష్ట్ర బడ్జెట్‌ లో రూ.100 కోట్లు కేటాయించారు. రాయగిరి నుండి యాదగిరిగుట్ట వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మించాలని ఆర్‌ అండ్‌ బి అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. శ్రీ చినజీయర్‌ స్వామితో కలిసి ముఖ్యమంత్రి ఈ క్షేత్రాన్ని సందర్శించి అభివృద్ధి నమూనాను పరిశీలించారు. యాదగిరిగుట్టకు ‘యాదాద్రి’ గా నామకరణం చేశారు. రోజు రోజుకీ ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య, ఆదాయం పెరుగుతుండటం విశేషం.
  • శ్రీ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను అధికారికంగా, ఘనంగా నిర్వహించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 10 కోట్లు విడుదల చేసింది. సద్దుల బతుకమ్మ రోజు హైదరాబాద్‌లో 25 వేల మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపు నిర్వహించారు. ముఖ్యమంత్రి, గవర్నర్‌ దంపతులతో సహ అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ కోసం మహిళా ఉద్యోగులకు మధ్యాహ్నం రెండు గంటల వరకే పనిచేసే వెసులుబాటు కల్పించారు. అన్ని జిల్లాలు, గ్రామాలలో కూడా బతుకమ్మ పండుగ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
  • శ్రీ ప్రభుత్వం చేపట్టే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి సెప్టెంబర్‌ 30, 2014న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రజాహిత కార్యక్రమాలను అట్టడుగు స్థాయి వరకు, గ్రామ గ్రామానికి చేరవేసే విధంగా ఇది పనిచేస్తుంది. తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా మానకొండూర్‌ ఎమ్మెల్యే, ప్రముఖ కళాకారుడు ఏర్పుల (రసమయి) బాలకిషన్‌ ను ప్రభుత్వం నియమించింది. సాంస్కృతిక సారధి ఛైర్మన్‌కు క్యాబినెట్‌ హోదా కల్పించారు.

gf

Other Updates