కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో ప్రతిస్టాత్మక అవార్డు లభించింది. ూఎaత్‌ీ ఔa్‌వతీ డ ఔaర్‌వ ఔశీతీశ్రీస పత్రిక యాజమాన్యం ఈ అవార్డులను చెన్నైలో ప్రదానం చేసింది.
పత్రిక సంపాదక వర్గం దేశ వ్యాప్తంగా సాగునీరు, వ్యర్థ జలాల శుద్ధి, పట్టణ తాగు నీటి సరఫరా, సంబంధిత రంగాల్లో 30 ప్రభుత్వ రంగంలోని ప్రాజెక్టులను పరిశీలించి 11 ప్రాజెక్టులను అవార్డుకు ఎంపిక చేశారు.ఆయా రంగాల్లో ఈ ప్రాజెక్టులను అత్యుత్తమ ప్రాజెక్టులుగా పరిగణించి ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులను ఈ అవార్డు కోసం ఎంపిక చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు చెన్నై వెళ్ళి జల్ సభ -2019లో ఈ అవార్డును స్వీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ అవార్డు దక్కినందుకు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ గా గర్వపడుతున్నాని నల్ల వెకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తనకు చీఫ్ ఇంజనీర్ గా ఈ ప్రాజెక్టులో అవకాశం ఇచ్చిందని, ఆ అవకాశాన్నిజీవిత కాలపు అదష్టంగా భావించి పని చేస్తున్నామని అన్నారు. ”ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మొదటి నుంచి చీఫ్ ఇంజనీర్‌గా భాగస్వామి అయినందుకు నా జన్మ చరితార్థం అయ్యింద”ని అన్నారు. ఈ అవకాశం నాకిచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రాజెక్టును నిర్దేశిత కాలంలో పూర్తి చేసి ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు అందిస్తామని అన్నారు. మిషన్ భగీరథ తరపున అవార్డును ఈఈ రాజేశ్వర్ రావు స్వీకరించారు.