tsmagazine
సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను జూలై 29వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున అన్నిరకాల ఏర్పాట్లను చేస్తున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ వెల్లడించారు. సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ఎక్సైజ్‌శాఖ మంత్రి టి. పద్మారావుగౌడ్‌తో కలిసి వివిధ శాఖల ఉన్నత అధికారులతో మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిపారు. ఈ సంవత్సరం అమ్మవారికి ప్రభుత్వం తరపున బంగారు బోనం సమర్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సుమారు కోటి రూపాయల ఖర్చుతో 3 కిలోల 80 గ్రాముల బంగారంతో బోనం తయారు చేస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా బంగారుబోనం నమూనాను మంత్రులు ఆవిష్కరించారు. ఎంతో విశిష్టత కలిగిన మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి ూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. 1813 సంవత్సరంలో మిలటరీలో పనిచేస్తున్న సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన నురిటి అప్పయ్య మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీ అయ్యారని, కొన్ని రోజుల తర్వాత ఉజ్జయినీలో కలరా వ్యాధి సోకి వేలాదిమంది మరణించారని మంత్రి తెలిపారు. అప్పయ్య అనుచరులు ఉజ్జయినిలో మహంకాళి అమ్మవారిని దర్శించి కలరా వ్యాధి నుండి కాపాడారని, అనేక వేల మంది రక్షించబడ్డారని పేర్కొన్నారు. 1815 సంవత్సరంలో అమ్మవారిని ప్రతిష్ఠించి నిత్యపూజలు చేశారని, నాటి నుండి ఈ బోనాల జాతర నిర్వహిస్తు వస్తున్నారని, మహంకాళి ఉత్సవాలకు అంతటి ప్రాశస్త్యం ఉందని ఆయన వివరించారు. జూలై 15వ తేదీ నుండి ఘటం ఎదుర్కోలు ప్రారంభమవుతాయని, జూలై 29వ తేదీన అమ్మవారికి బోనాలు, 30వ తేదీన రంగము (భవిష్యవాణి) కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వపరంగా నిర్వహించే బోనాలకు వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయాశాఖల అధికారులకు సూచించారు. బోనాల నిర్వహణకు జూలై 27వ తేదీ నాటి ఏర్పాట్లు పూర్తిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. బోనాల సందర్భంగా అమ్మవారిని ఏనుగుపై ఊరేగింపు నిర్వహించే రహదారులపై ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అన్నారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు అమ్మవారి ఆలయ పరిసరాలలో పారిశుధ్య నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అమ్మవారి దర్శన సమయంలో భక్తులు తోపులాటకు గురికాకుండా బారిడ్‌ేలను ఏర్పాటు చేయాలని, ూ్యలైన్‌లోని భక్తులకు త్రాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అమ్మవారి దర్శనం కోసం ప్రముఖులు ూడా పెద్ద ఎత్తున వస్తారని, ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. జాతర సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారని, దీనిని దృష్టిలో ఉంచుకొని వాహనాలను ఉత్సవాలు ముగిసేవరకు దారిమళ్ళించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు, ట్రాఫిక్‌ అధికారులకు సూచించారు. సీసీ మెెరాల ద్వారా నిఘాను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. షీ టీవ్స్‌ు, మఫ్టీ పోలీసులు విధులు నిర్వహిస్తారని అన్నారు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున దానిని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయం ఆవరణలో 24 లక్షల రూపాయల ఖర్చుతో భారీ షెడ్డును నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి చేపట్టవలసిన పనులను గుర్తించి యుద్ధప్రాతిపదికన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో కార్పోరేటర్లు అత్తెల్లి అరుణగౌడ్‌, ఆకుల రూప, కలెక్టర్‌ యోగితారాణా, వాటర్‌వర్క్స్‌ ఎండీ దానకిషోర్‌, అడిషనల్‌ పోలీస్‌ కమిషనర్‌ డి.ఎస్‌.చౌహాన్‌, డిపిసి సుమతి, ఐ అండ్‌ పీఆర్‌ సీఐఐ కిషోర్‌బాబు, జీహెచ్‌ఎంసీ ప్లానింగ్‌ ఏసిపి స్నేహ, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, ఆర్‌ అండ్‌ బి ఈఈ నర్సింగరావు, కల్చరల్‌ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, మహంకాళి ఆలయ ఈఓ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Other Updates