ప్రభుత్వాలు మహిళా ఉద్యోగులకు వసతులు కల్పించే విశయంలో దేశలో తెలంగాణ రాష్ట్రం ద్వితీయ స్థానంలో నిలిచింది. మొదటి స్థానాన్ని సిక్కిం రాష్ట్రం చేజిక్కించుకుంది. వివిధ వసతి సౌకర్యాలపై మొత్తం 40 మార్కులకు గాను తెలంగాణ 28.5 మార్కులు సాధించి రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. అమెరికాకు చెందిన వ్యూహాత్మక, అంతర్జాతీయ అధ్యయనాల కేంద్రం (సీఎస్‌ఐఎస్), నాథన్ అసోసియేట్స్ కలిసి చేపట్టిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రధానంగా నాలుగు విషయాలను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వేను నిర్వహించారు. వీటిలో 1) పరిశ్రమల్లో మహిళా ఉద్యోగుల పనిగంటలపై పరిమితులు. 2) మహిళలు బాధితులుగా ఉన్న నేరాలపై వ్యవస్థలు స్పందిస్తున్న తీరు. 3) రాష్ట్రంలో మహిళా ఉద్యోగుల సంఖ్య 4) రాష్ట్రంలో మహిళా వ్యాపారవేత్తలకు అందుతున్న ప్రోత్సాహకాలు. ఈ నాలుగు ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు ప్రకటించారు.
హోం
»