1969 జూన్‌ 19న తెలంగాణ సమస్యపై ఏదో ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశం తీసుకునే అవకాశం వున్నందున రెండు రోజు ముందే పిసిసి అధ్యక్షుడైన కాలకాని వెంకటరత్నంను వెంటబెట్టుకుని ఢిల్లీకి చేరుకున్నారు బ్రహ్మానందరెడ్డి.

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులైన నిజలింగప్పతో, ప్రధానికి సన్నిహితంగా వున్న మరో ముఖ్యనేత కామరాజ్‌తో బ్రహ్మానందరెడ్డి సమావేశమై రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడినట్లు, బంద్‌ సందర్భంగా శాంతి భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా సమర్థవంతంగా అదుపు చేయగలిగినట్లు గొప్పలు చెప్పుకున్నారు.

తెలంగాణ సమస్యపై కేంద్రనాయకుల సలహాలు తీసుకోవడానికై తాను ఢిల్లీ వచ్చినట్లు పత్రిక వారికి చెప్పుకున్న ముఖ్యమంత్రి, ఇందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితులో ఇవ్వకూడదని కేంద్రనాయకులకు తానే సలహా ఇచ్చారు.

ఒక ప్రక్కన బ్రహ్మానందరెడ్డి నిజలింగప్పతో సుదీర్ఘంగా చర్చిస్తున్న సమయంలోనే రాష్ట్రం నుండి తెలంగాణ ఇవ్వవద్దని నిజలింగప్పను కోరుతూ వందలాది టెలిగ్రామ్లు వచ్చినాయి. ఇతర కేంద్ర నాయకులకు కూడా అసంఖ్యాకంగా ఇలాంటి టెలిగ్రాంలే వచ్చాయి. ఈ టెలిగ్రాంలలో ‘‘రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే ప్రతిపాదన అనుచితమ’’ని, ‘‘పార్టీ నాయకత్వంలో మార్పు తెస్తే మొత్తం రాష్ట్రంలోనే కాంగ్రెస్‌పార్టీ నాశనమై పోగలద’’ని హెచ్చరించారు. ఈ టెలిగ్రామ్లో బ్రహ్మానందరెడ్డి సృష్టించినవే.

ఒక ప్రక్కన తెలంగాణ ఎన్‌.జి.ఓ.లు వారం రోజుల నుండి నిరవధికంగా సమ్మె చేస్తుంటే తను సృష్టించిన పోటీ సంఘంతో ‘‘తెలంగాణ డిమాండ్‌ను తాము వదిలివేస్తున్నట్లు ప్రకటన చేయించిన ముఖ్యమంత్రి ఢిల్లీలో ‘‘తెలంగాణ ఎన్‌.జి.ఓ.లు తమ తెలంగాణ కోర్కెలను ఇప్పుడు విడిచిపెట్టినారని విలేఖరులతో అన్నారు. ‘‘తెలంగాణలో ముల్కీకు కేటాయించిన 2వేల ఉద్యోగాలో వెయ్యి ఉద్యోగాలు ముల్కీకే ఇచ్చినట్లు’’ చెప్పినారు. తెలంగాణకు తానేమి అన్యాయం చేయడంలేదనే అభిప్రాయాన్ని ఢిల్లీ మీడియాకు కలిగించే ప్రయత్నం చేసినారు బ్రహ్మానందరెడ్డి. ‘‘పరిస్థితి చక్కబడిన తర్వాత తెలంగాణ నాయకునికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి రాజకీయ సర్దుబాట్లు చేస్తామని’’ తెలిపినారు. అంటే ఢిల్లీ వర్గాల్లో ‘‘కొంతమంది పదవుల కోసమే తెలంగాణ ఉద్యమాన్ని లేవదీసారనే” అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేశారు.

మరో ప్రక్కన ‘‘తెలంగాణ ప్రజలకు నిరాశ కల్గించడం ప్రమాదకరమని’’ కేంద్రాన్ని చెన్నారెడ్డి హెచ్చరించారు. 19న ఢిల్లీలో జరుగనున్న కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశం ఎజెండాలో తెలంగాణ అంశం వున్న దృష్ట్యా ఆయన ఈ ప్రకటన చేశారు. లింగంపల్లిలోని సమితి కార్యాయంలో చెన్నారెడ్డి పత్రిక వారితో మాట్లాడుతూ ‘‘ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది. అటు పార్టీ, ఇటు ఆంధ్ర ప్రభుత్వం తమ స్వంత లోకంలోనే జీవిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

డా॥ చెన్నారెడ్డి ఇచ్చిన పిలుపునందుకొని 1969 జూన్‌ 17వ తేదీన తెలంగాణ జిల్లాల్లో, జంటనగరాల్లో పెద్ద ఎత్తున మహిళలు, నాయకుల కుటుంబ సభ్యుల సత్యాగ్రహాలు చేశారు.

హైదరాబాద్‌ మేయర్‌ కుముద్‌ నాయక్‌ మొదటి సత్యాగ్రహ జట్టుకు నాయకత్వం వహించి ఆబిడ్స్‌లోని నెహ్రూ విగ్రహం వద్దకు వస్తుంటే నిషేధాజ్ఞు ధిక్కరించారనే నెపంతో ఆమెను, సహచర మహిళను అరెస్టు చేశారు పోలీసు. హైదరాబాద్‌ ప్రథమ పౌరులు, ఒక మేయర్‌ సత్యాగ్రహం చేయడం, అరెస్టు కావడం దేశ చరిత్రలో ప్రథమం. ఫ్లకార్డు పట్టుకొని ‘జైతెలంగాణ’ అని నినదిస్తూ ఆమె వీధుల్లో నడిచింది. మేయర్‌ అరెస్టుకు నిరసనగా అప్పటికప్పుడు రెండు వేల మంది కార్పొరేషన్‌ సిబ్బంది, కార్మికుల సమ్మెకు దిగినారు. ఉద్యమనేత డా॥ చెన్నారెడ్డి సతీమణి సావిత్రీదేవి ఆధ్వర్యంలో రెండోజట్టు సుల్తాన్‌ బజార్‌లో సత్యాగ్రహం చేసింది. మాజీ ఉపముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి మూడో కూతురు స్నేహతా రెడ్డి మూడో జట్టుకు నాయకత్వం వహించారు. నాల్గో కూతురు సాధన, మనుమరాళ్ళు అనురాధ, అరుణ, కోడలు విమల, పెద్దకూతురు సుమిత్రారెడ్డి తదితరులు ఈ సత్యాగ్రహ జట్టులో ఉన్నారు. చెన్నారెడ్డి సతీమణితో సహా ఈ మహిళందరినీ పోలీసు అరెస్టు చేసినారు.

సచివాలయం వద్ద రిపబ్లికన్‌ పార్టీ కార్యదర్శి, ఎం.ఎల్‌.ఏ ఈశ్వరీ బాయి మరో 25 మంది మహిళలు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. పోలీసుల వాహనాలు రావడంలో జాప్యం జరగడం వలన వీరంతా రోడ్డుపై కూర్చోవడంతో ట్రాఫిక్‌ కు అంతరాయం ఏర్పడింది.మోజంజాహి మార్కెట్‌ వద్ద మాజీమంత్రి సదాలక్ష్మి, మాజీ ఎం.ఎల్‌.ఏ, శాంతాబాయి మరికొందరు సత్యాగ్రహం చేశారు.

తెలంగాణ ప్రజాసమితి మహిళా విభాగానికి చెందిన లక్ష్మీరెడ్డి చార్మినార్‌ క్రాస్‌ రోడ్‌ వద్ద సత్యాగ్రహం జట్టుకు నాయకత్వం వహించారు. సికింద్రాబాద్‌, బొల్లారం, కంటోన్మెంట్‌ తదితర ప్రదేశాల్లో, జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లలో సత్యాగ్రహంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అరెస్టయినారు.

వ్యానుల్లో మహిళలను పోలీసులు తీసికెళ్తుంటే ఇంత మంది మహిళలు సత్యాగ్రహంలో పాల్గొనడం పట్ల డా॥ చెన్నారెడ్డి, కొండాక్ష్మణ్‌ తదితరా నేతలు హర్షధ్వానాలు చేశారు.

జూన్‌ 17ను ‘తెలంగాణ మహిళా దినం’ గా ప్రజాసమితి పరిగణించి వివిధ ప్రాంతాల్లో సత్యాగ్రహాలు చేయడానికి వివిధజట్లను ఎంపిక చేసింది.

బంద్‌, సత్యాగ్రహాలు శాంతియుతంగా జరిగి జయప్రదం కావడంతో చెన్నారెడ్డి జూన్‌ 19నుంచి తెలంగాణ ఉద్యమం తాలుకా స్థాయికి విస్తరించాలని సంకల్పించారు. సమష్టి సత్యాగ్రహాలకు పిలుపు నిచ్చారు. ఉద్యమంలో ఇదొక ‘మలుపు’గా చెన్నారెడ్డి అభివర్ణించారు. తెలంగాణ నేతలు వెంకటస్వామి, అంజయ్యలు ఢిల్లీలో నిజలింగప్ప, కామరాజ్‌, జగ్జీవన్‌రాంను కలిసి తెలంగాణ పరిస్థితిని వివరించారు. గత 6 నెలలుగా తెలంగాణలో పోలీసురాజ్యం నెలకొన్నదని, శాంతిభద్రతలు సన్నగిల్లుతున్నాయని, బ్రహ్మానందరెడ్డిని గద్దె దింపాలని, రాష్ట్రపతి పాలనను విధించాని ఈ నేతలు కోరినారు.

మార్క్సిస్టు వ్యతిరేకత:

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ కలకత్తాలో జరిగిన మార్క్సిస్టు పార్టీ పోలిట్‌బ్యూరో ప్రకటన చేసింది. ‘‘వేర్పాటు వాదు ప్రారంభించిన ద్వేషించే ఉద్యమాన్ని అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ‘‘1947-48 నాటి రజాకార్ల దుష్కృత్యాల్ని పోలిన విధంగా డా॥ చెన్నారెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తు దోపిడీలు, హింసాకాండ, దౌర్జన్యాలు సాగిస్తున్నారని” ఈ ప్రకటనలో తెలిపారు.

‘‘రక్తం చిందించి సాధించిన విశాలాంధ్రను పరిరక్షించుకోవాలని ప్రజలకు మార్క్సిస్టు పిలుపునిచ్చారు. మరో కమ్యూనిస్టు పార్టీ అయిన సి.పి.ఐ. రాష్ట్ర శాఖ మాత్రం బ్రహ్మానందరెడ్డిని గద్దె దింపాలని, వెంటనే రాష్ట్రపతి పాలనను ఏర్పాటు చేయానే తెలంగాణవాదులతో గొంతు కలిపి ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రలోనూ ధర్నాలు, నిరాహారదీక్షలు సాగిస్తూ తమపై పడిన ‘‘తెలంగాణ ద్రోహులనే” అపవాదులను ఎంతో కొంత తొలగించుకునే ప్రయ త్నం చేస్తున్నారు. జూన్‌ 18 నుంచి పికెటింగ్‌ ఉద్యమం జరపాలని సిపిఐ పిలుపు నిచ్చింది. ఈ పికెటింగ్‌ ఉద్యమానికి చండ్ర రాజేశ్వరరావు, ఆరుట్ల కమలాదేవి నాయకత్వం వహించారు.

ఢిల్లీలో ఉన్నతస్థాయి చర్చలు

ఢిల్లీలోనే మకాం పెట్టిన ముఖ్యమంత్రి జూన్‌ 18న ప్రధాని, దేశీయాంగమంత్రి, లోకసభ స్పీకర్‌గా వున్న నీలం సంజీవరెడ్డితో తెలంగాణ సమస్యపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ పరిస్థితిలోనూ ఏర్పాటు చేయవద్దని, కావాలంటే సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణ ప్రయోజనాలకు తగిన రక్షణ వుండగలదని తెలంగాణ ప్రజలకు హామీనిచ్చే పథకం గురించి ఆలోచిస్తే మంచిదని పెద్దలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు బ్రహ్మానంద రెడ్డి. ‘‘తనను ఎందుకు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోవసిందిగా కోరరాదనే విషయంలో బ్రహ్మానంద రెడ్డి అదనపు కారణాలను కూడా ప్రధానికి వివరించారు.
రాష్ట్రంలోని శాసనసభ్యులో మెజారిటీ సభ్యుల మద్దతు చూరగొనలన్న నాయకున్ని రాజీనామాలు యివ్వమనడం ప్రజాస్వామ్య విరుద్ధమని బ్రహ్మానంద రెడ్డి అన్నారు. కేంద్రం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన పక్షంలో సత్వరం సాధారణ పరిస్థితి పునరుద్ధరణకి తనకు ఎట్టి చిక్కుండవని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే వుంటూ అహింసాయుత ఆందోళన లేక రాజ్యాంగ బద్ధమైన పరిష్కార మార్గా పట్ల ఎట్టి గౌరవం లేనివారి అరెస్టు పట్ల వున్న భయసందేహాలు తనకు అవరోధంగా వున్నట్లు బ్రహ్మానందరెడ్డి కేంద్ర నాయకులకు వివరించారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి సమావేశం

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశానికి హాజరై తెలంగాణపై చర్చించాని చెన్నారెడ్డిని, కొండా లక్ష్మణ్‌ను మరికొందరు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను కాంగ్రెస్‌ అధ్యక్షులు నిజలింగప్ప ఆహ్వానించారు. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గం వైఖరి దృష్ట్యా చర్చలు నిరుపయోగమని చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీలు నిజలింగప్ప ఆహ్వానాన్ని తిరస్కరించారు.
జూన్‌ 19న సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ 2 గంటలపాటు తెలంగాణ సమస్యపై చర్చించింది. కేవలం దామోదరం సంజీవయ్య తప్ప ఏ ఒక్క నేత కూడా బ్రహ్మానందరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ‘‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశానికే హానికరమ’’ని దాదాపు నేతలంతా అభిప్రాయపడగా, ‘‘బ్రహ్మానందరెడ్డి పరిస్థితిని అదుపు చేయడంలో విఫలమైనందున రాష్ట్రపతి పాలనతప్ప మరో ప్రత్యామ్నాయం తనకు కనిపించడం లేద’’ని సంజీవయ్య అన్నారు. మరునాడు జరిగే సమావేశానికి చొక్కారావును, నూక రామచంద్రారెడ్డిని ఆహ్వానించారు.

(చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ అరెస్టు `
రాజమండ్రి జైలుకు తరలింపు)

Other Updates