కాల్పనిక సాహిత్యంతో పాటు కథలు, కవితలు రాయడమనేది కొంత సులభమే కావచ్చు గానీ చారిత్రక విషయాలు, జీవిత చరిత్రలు రాయడమనేది అన్ని రకాల శ్రమతో పాటు ఒకింత సాహసం చేయడమే అని చెప్పవచ్చు. అలా రాయడంలో సిద్ధ హస్తులైన కపిలవాయి లింగమూర్తి యీ ”గురుగోవిందమాంబ జీవిత చరిత్ర” రాయడం ఒకింత ఆనందదాయకమే మరి.

16వ శతాబ్దంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి, మఠం, ఆ తర్వాత స్వామి వారి మనమరాలు ఈశ్వరమ్మ మఠం లాగానే 18వ శతాబ్దంలో నెల్లూరు జిల్లాలోని ”మారెళ్ల” తాలూకాలో వున్న అనుమనగిరిలో శ్రీశివరామ బ్రహ్మం మఠం. ఆ పిదప ”మోర్జంపాడులో వారి కూతురు గోవిందమాంబ మఠం వెలిసినా ఒకదానికొకటి ఏ సంబంధం లేకుండా దేనికదే ప్రత్యేక తను కల్గివుందని తెలుస్తుంది.శిష్యుల విషయంలో, బోధనల విషయంలో కొంత పోలికవున్నా రెండింటికి మాత్రం సంబంధం లేదనే చెప్పవచ్చు. గోవిందమ్మ చిన్నప్పటినుండి ఆధ్మాత్మిక భావాలతో వుండి ఎవరే ప్రశ్నలడిగినా ఆధోరణిలోనే జవాబులు చెబుతుండేది. వీరాచారి అడిగిన ప్రశ్నకు జవాబుగా సృష్టికి మొదట విశ్వకర్మ జననం గురించి చెప్పడం, ఆ తర్వాత గోవుకు, గుర్రానికి మధ్యవున్న విశ్వాసం గురించి చెబుతూ పంచేంద్రియాలు గుర్రం కోవకు చెందినవని అందుకే వాటినెప్పుడూ బంధించి వుంచాలని చెపుతుంది. ఖమ్మంలోని దొడ్డవరంలో అక్కడి వారికి సంతానోత్పత్తి, పిండం ఎదుగుదల గురించి చెప్పడం, నరసరావుపేటలో భక్తి గురించి యిచ్చిన ప్రవచనంతో పాటు శ్రవణం, కీర్తనం, విష్ణునామ స్మరణ, పాదసేవ, అర్చన, వందనం, దాస్యం, సఖ్యత, ఆత్మ నివేదన మొదలైన వాటి గురించి వివరించడంతో పాఠకులకు చాలా చాలా సంగతుల గురించి తెలుస్తుంది.

– కన్నోజు లక్ష్మీకాంతం

Other Updates