ప్రాాణములొడ్డి ఘోర గహనాటవులన్‌ బడగొట్టి మంచి మాగాణములన్‌ సృజించి యెముకల్‌ నుసిచేసి పొలాలుదున్ని భోషాణమునన్‌ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే! తెలంగాణము రైతుదే!! ముసలి నక్కకు రాచరికంబు దక్కునే?

tsmagazine

ఇది రైతు పక్షం వహించిన కవిగర్జన. ఆరుగాలం కష్టపడి లోకానికి అన్నం పెట్టేవాడు రైతు. అంటే రైతు సంక్షేమమే లోక సంక్షేమం. ప్రకృతిని తన నేస్తం చేసుకొని, ఒళ్లు హూనం చేసుకొని తన చెమటను పంటగా మార్చి మనల్ని ఆదుకునే దేవుడీ రైతు. సమాజహితాన్ని కాంక్షించే ప్రతివాడూ దేశానికి అన్నంపెట్టే అన్నదాతను గురించి ఆలోచించాలి. ముఖ్యంగా పాలకులు ఆలోచించాలి. ఆ దిశగా ఆలోచనలు లోపించినప్పుడే రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయరంగం వెనకబాటు మొదలైన ఇబ్బందులతో దేశం అల్లాడి పోతుంది. కానీ మన దురదృష్టం ఏమిటంటే ఇన్నేళ్ళ స్వాతంత్య్రం తర్వాత కూడా రైతు పరిస్థితి కానీ, వ్యవసాయ పరిస్థితికానీ ఏమీ మారకపోవడమేకాక మరింత దిగజారిపోయి అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి.

ముఖ్యంగా తెలంగాణా తలాపున జీవనదులున్నా కరువు కాటకాలు మన జీవితాల్ని కకావికలు చేస్తున్నాయి. సమైక్య పాలనలో అన్నివిధాలా రైతు పతనం దిశగా పోయి ప్రాణాలు తీసుకునే దుస్థితి దాపురించింది. మాటల కోటలతో పాలకులు కాలం వెళ్ళబుచ్చారే తప్ప కార్యసిద్ధికి ఎటువంటి ప్రయత్నమూ చెయ్యకపోవడమే మనకు శాపమై పీడించింది. దీనికి కారణం ప్రభుత్వాలకు తెలంగాణపట్ల వివక్ష, రైతులపట్ల నిర్లక్ష్యం, లబ్ధి చేకూర్చాలన్న విషయాల్లో చిత్తు

శుద్ధి లేకపోవడం వంటివి కొన్ని కారణాలైనా, పాలకుల్లో మానవీయ కోణం లేకపోవడం ప్రధాన కారణమని చెప్పవచ్చు. కరుణామయులై ప్రజల కష్టాలపట్ల సానుభూతిలేక కల్మషమైన, కరడుగట్టిన హృదయాలున్న పరిపాలకుల కారణంగా తెలంగాణా ప్రజలు గత 60 ఏళ్లుగా అనుభవించని కష్టమంటూ లేదు. కరెంటు కోత, నీటి కరువు, నియామకాల్లో పక్షపాతం, నిధులకొరత చెప్పుకుంటూపోతే సవాలక్ష కారణాలుంటాయి.

సుదీర్ఘ పోరాటం కారణంగా, సమర్ధ నాయకుని నిబద్ధతవల్ల దశాబ్దాలపోరాటం సత్ఫలితాన్నిచ్చి మనకు కొత్త రాష్ట్రం సిద్ధించింది. ఉద్యమసారధి పరిపాలకుడైనందున ప్రజల బాధల్ని దగ్గరినుండి చూచి చలించి అనేక కొత్తకొత్త పథకాలను ప్రవేశపెట్టి, మానవీయ దృక్పథంతో ఆలోచించి ప్రతి సమస్యకు పరిష్కారాల్ని చేపట్టి మన రాష్ట్రాన్ని ‘బంగారు తెలంగాణా’ దిశగా నడిపించే యత్నాన్ని చిత్తశుద్ధితో చేస్తున్నాడు. కొత్తగా పరిపాలనను చేబట్టి నాలుగు సంవత్సరాలనుండి నిర్విరామకృషితో ప్రజల కలలు సాకారమయ్యే రీతిలో పరిపాలన కొనసాగుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది అంటేనే పాలకుని సామర్ధ్యాన్ని మనం తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావులోని దక్షతను, వారి మంత్రివర్గం, ఇక్కడి అధికారుల సమర్ధతను ప్రశంసించడానికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వ పథకాలకున్న మానవీయ దృక్పథమేనన్నది తిరుగులేని నిజం.

ఏ ప్రభుత్వానికైనా తమ ఏలుబడిలోని ప్రజలను సంతోషపెట్టడమే ధ్యేయం అయినప్పుడు వారి ఆలోచనల్లో మానవత్వం చోటు చేసుకుంటుంది. కొత్తగా ఏర్పడ్డ మన రాష్ట్రం అన్నిరంగాల్లోనూ ముందంజలో ఉండాలనుకున్న మన ముఖ్యమంత్రివర్యులు ప్రవేశపెట్టిన పథకాలు అసాధారణమైనవి, అపూర్వమైనవి. మనిషి మనుగడకు ప్రధానమైన వనరుల్లో నీరు, ఆహారం ముఖ్యం. ఇది గుర్తించిన మన ప్రభుత్వం మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలను ప్రవేశపెట్టి సాగునీటికి, తాగునీటికి ఏ ఇబ్బంది కలగకుండా చెయ్యాలని క్షణక్షణం శ్రమిస్తూ ప్రజాదృక్పథంతో ముందుకు సాగిపోతున్నది కనుకనే త్వరలో అంటే ఈ సంవత్సరం చివరి నాటికి అది సంపూర్ణం కాబోతున్నది. కోట్లాది రూపాయలను వెచ్చించి మనిషికి, భూమికి కావలసిన నీటిని అందించడం గొప్ప మానవతా దృక్పథం. నీటి చుక్కకు కూడా తెలంగాణా నోచుకోదన్న వారి నోళ్ళు మూయించే కృషి వెనుక మనిషి అవసరాన్ని తీర్చినామన్న గొప్ప ఆనందం కూడా దక్కబోతుంది.

ప్రభుత్వం ఏర్పడ్డ ఆరునెలల్లోనే కరెంటు కష్టాలనుండి రాష్ట్రాన్ని గట్టెక్కించిన ప్రభుత్వం 24 గంటలు నాణ్యమైన నిరంతర విద్యుత్తును అందించేస్థాయికి చేరుకోవడం నిస్సందేహంగా మన నాయకత్వ విజయమే. చేబట్టిన ప్రతి పనివెనుక మనిషిని లక్ష్యంగా చేసుకొని ఆ పథకాల విజయం కొరకు కృషి చేస్తే తప్పక విజయం వరిస్తుందని నిరూపించిన ఘనత మన ప్రజా ప్రభుత్వానిదే.

తెలంగాణ ప్రభుత్వం పెట్టిన మరో ప్రతిష్ఠాత్మక పథకం ‘రైతుబంధు’ పథకం. నీటికష్టాలు తీర్చిన ప్రభుత్వం, మనిషికి అవసరమైన ఆహారాన్ని అందివ్వాలన్న సంకల్పం ప్రశంసించదగ్గది. అందుకే రైతుబంధు పథకం ప్రారంభమై పల్లెపల్లెలో ఆనందాన్ని వెల్లివిరియజేస్తున్నది. రైతన్నల కళ్ళలో ఆనందాన్ని పూయించే ఈ పథకంలో మానవతా దృష్టి గొప్పది. సమాజాన్ని సంతోషంగా ఉంచి అన్నంపెట్టి రక్షించేవాడు అన్నదాత. అట్లాంటి అన్నదాతలే ప్రకృతి కష్టాలను భరిస్తూనే పాలకుల దుర్మార్గాలను కూడా తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న తీరు మానవత్వం ఉన్న ప్రతివ్యక్తినీ కన్నీళ్ళ పర్యంతం చేస్తుంది. ఇది గమనించిన మన ముఖ్యమంత్రి అన్నంపెట్టి కాపాడే అన్నదాత ముఖంలో చెరగని చిరున వ్వులను చూడాలన్న సంకల్పంలోనుంచి పుట్టిన అసామాన్య పథకమే ఈ రైతుబంధు పథకం. కాలానికనుగుణమైన రీతిలో ఎకరానికి రూ. 4,000ల చొప్పున ఏడాదికి రెండుసార్లు ప్రతి వ్యవసాయదారునికి ఇవ్వాలన్న నిర్ణయాన్ని తీసుకున్న ప్రభుత్వం పల్లెపల్లెలో పండుగలాగా రైతులందరికీ పెట్టుబడికి ఆర్థిక సహకారం అందించి ఆదుకుంటున్నది. అందుకే ఇది రైతుబంధు. దీనివల్ల ఏ రైతూ పెట్టుబడి కోసం అప్పులుచేసి కష్టాల పాలుకా కుండా ప్రభుత్వమే రక్షిస్తూ ఉంది. రైతులకు నీటి తీరువా మాఫీచేసి రైతులపట్ల తమకున్న ఆదరణను నిరూ పించుకుంది. అంతేకాదు అవసరమైన ఎరువులను అవసరమైనంత మోతాదులో అందించడం, నాణ్యమైన విత్తనాలను అందజేయడం వంటి అనేక విషయాల్లో ప్రభుత్వ కృషి వ్యవసాయానికి గొప్ప సహకారాన్ని అందించి రైతును రాజును చేసే దిశగా కృషి చేస్తున్నది. ఈ పథకం పక్కరాష్ట్రాల ప్రశంసకు కూడా పాత్రమై దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రతి గ్రామంలోని ప్రజా ప్రతినిధులు మొదలుకొని రాష్ట్ర మంత్రులవరకు కూడా ఇందులో పాల్గొని రైతు విజయానికి తోడ్పాటునందిస్తున్నారు. ఇంత మానవీయ దృష్టి కలిగిన పథకం ప్రపంచ చరిత్రలోనే ప్రథమంగా నిలిచింది. తెలంగాణా రైతు ముఖం వెలిగింది. ఏ ప్రభుత్వానికైనా లక్ష్యం ప్రజావసర పథకాలే కావాలి. మానవతా దృక్పథం కలిగి ఉండాలి. మానవసేవే పరమావధి కావాలి. కానీ మన దురదృష్టవశాత్తూ భారత దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను ప్రచారం వరకే పరిమితం చేయడమేగాక కోట్లాది రూపాయల కుంభకోణాలకు తెరలేపాయి. ఇదొక మహా విషాదం. మానవత్వంపై మాయని మచ్చ.
tsmagazine
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం చేబట్టిన పథకాలు ఈ కోవలోకి రాకపోవడానికి ప్రధాన కారణం సమర్ధ నాయకత్వం. మానవీయ విలువలపై అచంచల విశ్వాసం ఉన్న కారణంగా ఖర్చుపెట్టే ప్రతి పైసా కూడా చేరవలసిన వారికి చేర్చాలన్న దృఢ సంకల్పం ఉండడంవల్ల ఈ నాలుగేళ్లలోనే ఫలితాలు వస్తున్నాయి. ప్రశంసలూ వస్తున్నాయి. అన్ని రాష్ట్రాలకూ, అందరు పాలకులకూ ఆదర్శంగా నిలుస్తున్నాయి, గుణాత్మకమైన మార్పుకు నాంది పలుకుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేబట్టిన ప్రధాన పథకాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణం, ఆసరా పథకం, సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజన పథకం, అధికసంఖ్యలో గురుకుల పాఠశాలల ఏర్పాటు మొదలైనవి ముఖ్యమైనవి.

పేదవారింట్లో పెళ్లికి సాయంచేసి వాళ్ళ కుటుంబాలు అప్పులపాలుకాకుండా ఆదుకునే పథకాలు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు. సామాన్యునికి తమ యింట్లో ఆడపిల్ల పెండ్లి తమ జీవితాల్నే కబళించే పిశాచం కాకుండా, ఆనందాలు వెల్లివిరిసే జీవితాలను అందించిన ఈ రెండు పథకాలు మానవతా పరిమళాలను ప్రసరింపజేసే గొప్ప పథకాలు. కుటుంబ రక్షణకు మానవీయ దృక్పథంవల్ల మాత్రమే సహకారం అందుతుందన్న ఆలోచనలోనుంచి పుట్టిన అపురూప పథకాలు ఈ రెండు పథకాలు.

ప్రతి వ్యక్తికీ సొంత ఇల్లు ఒక కల. ఆ కలను నిజం చేసు కోగలగడం అందరికీ సాధ్యంకాదు. కాబట్టే సామాన్యుని కలను సాకారం కలిగించే రెండు పడకగదుల ఇళ్ళ నిర్మాణం చేప ట్టాలన్నదే ప్రభుత్వ సంకల్పం. రాష్ట్ర యంత్రాంగమంతా చిత్తశుద్ధితో పనిచేస్తూ తెలంగాణాలో ఈ పథకాన్ని ముందుకు తీసుకు పోవడం ప్రభుత్వంయొక్క మానవత్వాన్ని చాటిచెబుతూ ఉంది.

వృద్ధుల, వికలాంగుల రక్షణ మానవత్వాన్ని చూపించే గొప్ప కార్యం. అందుకే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రూ. 1000 కి 1500 లకి ఈ సహాయాన్ని పెంచి తమ ప్రభుత్వానికున్న మానవీయ దృక్పథాన్ని చాటుకున్నారు.

పాఠశాలల్లో విద్యార్జనకై చేరిన పిల్లల సంరక్షణ ప్రభుత్వాలదే. అయితే వాళ్ళకు అందించే భోజనాలు పూర్వ ప్రభుత్వాల అలసత్వం కారణంగా అధ్వాన్నంగా తయారై పిల్లలపాలిటి మృత్యు దేవతలైపోయాయి. ఇది గమనించిన సీఎం మానవత్వ స్పర్శతో ఆలోచనచేసి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఈ సమస్యకు పరిష్కారంగా సన్నబియ్యాన్నిచ్చి ఆదుకున్నారు. దాదాపు నాలుగేళ్లుగా పాఠశాలల విద్యార్థులు సన్నబియ్యపు అన్నాన్ని భుజిస్తూ విద్యను కొనసాగిస్తున్నారు. ఇదొక గొప్ప విజయం.tsmagazine

రాష్ట్రంలో కొన్ని గురుకుల పాఠశాలలున్నాయి. కానీ అవి ఏ మాత్రం సరిపోవని యోచించిన రాష్ట్ర ముఖ్యమంత్రి మరిన్ని గురుకుల పాఠశాలలను ఏర్పరచి సామాన్యునికి దగ్గరగా విద్యను చేర్చారు. పైగా కేవలం కొందరికి మాత్రమేగాక, మైనారిటీలకు కూడా ప్రత్యేక గురుకులాలను ఏర్పరచారు. వీటివల్ల కేవలం విద్యార్థులకేగాక, కొత్త కొత్త ఉద్యోగావకాశాలు వచ్చిన కారణంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కొంత ఉపాధికి ఈ పథకం ఆలంబనంగా నిలిచింది.

ప్రభుత్వాలు ఏ పథకాలు ప్రారంభించినా అవి ప్రజా సహాయక పథకాలై మానవీయ విలువలు పెంచే పథకాలుగా నిలవాలి. అట్లాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు చేసి విజయాలు సాధించాలంటే ప్రభుత్వాధినేతలో గొప్ప దార్శనికత, నిబద్ధత, చిత్తశుద్ధి, ఆచరణలో పెట్టగలిగే సమర్ధత ఉండాలి. అదృష్టవశాత్తూ తెలంగాణాకు అటు వంటి సమర్ధుడైన అధినేత లభించిన కారణంగా ఈ నాలుగేళ్లలోనే అత్యధి కంగా విజయాలు సాధించి తమ మాన వతా దృక్పథాన్ని నిలుపుకొన్నారు.

-దాశరథి

Other Updates