బోయిన్‌పల్లిలోని బిఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ యార్డులో డిసెంబర్ 9నాడు హమాలీ విశ్రాంతి భవనము, మన కూరగాయల భవన సముదాయన్ని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
హమాలీలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు: మంత్రి హరీష్ రావు
మన కూరగాయలు భవన సముదాయం, హమాలీ విశ్రాంతి భవన ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత జరిగిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బోయిన్ పల్లి మార్కెట్ యార్డ్‌కు రావడం ఇది మూడో సారి అని అన్నారు. మెదటి సారి వచ్చినప్పుడు భోజన వసతి, మినరల్ వాటర్ సౌకర్యన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండో సారి వచ్చినప్పుడు రెస్ట్ రూం కావాలని అడిగారు, పది రోజుల్లోనే మంజూరు చేసి ఇచ్చాను. ఈ రోజు ప్రారంభిస్తున్నా అని మంత్రి అన్నారు.
ఇప్పటి నుండి మార్కెట్ యార్డుల్లో పని చేసే హమాలీలకు ఇఎస్‌ఐ ద్వారా వైద్యం అందచేయనున్నట్టు మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. రెండు రోజుల్లో ఈఎస్‌ఐ వారితో మాట్లాడి హమాలీలందరికి ఇఎస్‌ఐ గుర్తింపు కార్డులు అందే విధంగా చూడాలని అధికారులకు సభా వేదిక నుండి మంత్రి ఆదేశించారు.
ముఖ్యమంత్రితో మాట్లాడి హమాలీలకు ఐదు లక్షల ముప్పయి వేలతో నిర్మించే రెండు బెడ్ రూముల ఇండ్లను ఇప్పించడానికి కృషి చేస్తానని తెలిపారు. అయితే లోకల్ మంత్రులు పద్మారావు, తలసానిలు ఇద్దలు కలిసి ఇండ్ల నిర్మాణానికి కావల్సిన జాగను చూపించాలని తెలిపారు.బోయిన్‌పల్లిలో మరో కోల్డ్ స్టోరేజిని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు బోయిన్‌పల్లి మార్కెట్ యార్డ్‌లో కేవలం రెండు వందల మంది మాత్రమే ఇన్సురెన్స్ కోసం అప్లయి చేసుకున్నారని, మిగతా వారు కూడా వెంటనే ఫోటోతో పాటు ఐడి కార్డ్ జిరాక్స్ ను ఇవ్వాలని అన్నారు.
మార్కెట్ యార్డులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అదేశాలు ఇచ్చారు మంత్రి హరీష్ రావు. యుద్ధ ప్రాతిపదికన హెల్త్ డిస్పెన్సరిని ఏర్పాటు చేయాలని అన్నారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలోని 44 వ్యవసాయ మార్కెట్ కమీటీలను జాతీయ వ్యవసాయ మార్కెట్ (చీూవీ)కు అనుసంధానం చేస్తున్నట్టు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఈ నిర్ణయంతో రైతు పండించిన పంటకు మంచి ధర వస్తుందని మంత్రి అన్నారు.
బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌కు మహానుభావుడు డా. అంబేద్కర్ పేరు పెట్టింది తెలంగాణ సర్కార్ అని గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు.
హైదరాబాద్ లోని మూడు మార్కెట్‌లలో ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టిన తర్వాత మూడు నెల్లల్లో 2.69 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని అన్నారు.
ఉల్లి ధర ఆకాశానికి ఎగబాకినప్పుడు మార్కెటింగ్ శాఖ సబ్సిడీతో ఉల్లిగడ్డలను విజయవంతంగా అమ్మింది. ఇప్పడు కంది పప్పుకు కూడా రెక్కలు రావడంతో సివిల్ సప్లయిస్ డిపార్ట్‌మెంట్ వారితో కలిసి కంది పప్పును కూడా సబ్సిడి కింద అమ్మాలనే అలోచనలో ప్రభుత్వం ఉంది అని హరీష్‌రావు తెలిపారు.
1024 కోట్లతో 330 కేంద్రాలలో గోదాములను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. వీటిలో 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేయవచ్చునని మంత్రి అన్నారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా గోదాముల నిర్మాణం జరగుతున్నదని మంత్రి అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎన్నడూ ఈ విధంగా గోదాముల నిర్మాణం జరగలేదని అన్నారు మంత్రి హరీష్ రావు.
రాష్ట్రంలో అతి పెద్ద పండ్ల మార్కెట్ గా ఉన్న గడ్డి అన్నారం సరిపోవడం లేదు కాబట్టి రంగారెడ్డి జిల్లాలోని కోహెడకు మారుస్తున్నట్టు మంత్రి తెలిపారు. వంద ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు మంత్రి. ఇక్కడ కార్బయిడ్ వాడకానికి అవకాశం లేకుండా ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. కార్బయిడ్‌కు ప్రత్యామ్నాయంగా రైపనింగ్ చాంబర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
చెన్నై తుఫాన్ తర్వాత పెట్టుబడులన్ని హైదరాబాద్ పైపుకు చూస్తున్నాయని అన్నారు మంత్రి హరీష్ రావు. ఢిల్లీ లో పొగ మంచు, వైజాగ్‌లో తఫాన్‌లు కూడా పెట్టుబడులు హైదరాబాద్ బాట పట్టడానికి యింకో కారణం అని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పద్మారావు, తలసాని, నాయిని లు ప్రసంగించారు.
మంత్రి నాయిని మాట్లాడుతు..
హరీష్ రావు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం. ఇప్పుడు మార్కెటింగ్ శాఖను కుడా విజయపథంలో మంత్రి హరీష్ నడిపిస్తున్నారు.
హైదరాబాద్ విశ్వకేంద్రంగా మారబోతుంది. ఇక్కడి ప్రజలకు అనేక అవకాశలు రాబోతున్నాయి.
హమాలీ కార్మికులకు ఇఎస్‌ఐ ద్వార వైద్యం ఇవ్వడానికి నేను కూడా కృషి చేస్తాను.
మంత్రి తలసాని మాట్లాడుతు..
రెస్ట్ హౌస్ అనేది హమాలీలకు తీరని కల… కాని అది హరీష్ రావు గారి చొరవతో నిజమైంది. దీంతో హమాలీల కల నెరవేరింది.
మార్కెట్ యార్డ్ దశ దిశను హరీష్ రావు మార్చి పారేశారు.
హమాలీలకు రెండు బెడ్ రూంల ఇండ్ల కేటాయింపుల్లో నా వంతు ప్రయత్నం చేస్తా.
మంత్రి పద్మారావు మాట్లాడుతు…
హమాలీలకు గత 30 సంవత్సరాలుగా నాయకుడిగా ఉన్నాను… చాలా మంది మంత్రులను చూసా కాని ఇలాంటి మార్కెటింగ్ శాఖ మంత్రిని ఎప్పుడు చూడలేదు. హమాలీల అదృష్టం హరీష్ రావు ఆ శాఖకు మంత్రిగా ఉండటం…
ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ తో పాటు మంత్రులు నాయిని, పద్మారావు, తలసానిలతో పాటు స్ధానిక యంఎల్‌ఎ సాయన్నలు పాల్గొన్నారు. వీరితో పాటు హమాలీ సంఘం అధ్యక్షులు రాజయ్య, మర్చెంట్ అసోషియెషన్ అధ్యక్షులు దేవేందర్‌రెడ్డి మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ శరత్, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మి బాయి,జాయింట్ డైరెక్టర్ రవి కుమార్, మార్కెట్ కమిటి కార్యదర్శి పద్మ హర్ష, డివ్యూటి డైరెక్టర్ మల్లేశంలు కూడా పాల్గొన్నారు. ప్రారంభోత్సవాల అనంతరం జరిగిన సభకు స్థానిక యంఎల్‌ఎ సాయన్న అధ్యక్షత వహించారు.