పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పిఆర్‌ఎస్‌ఐ) హైదరాబాద్ చాప్టర్ ఫిబ్రవరి
21న హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ ప ్లక్ రిలేషన్స్ కాన్ఫరేన్స్ ప్రథమ
సదస్సులో అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఇందులో నేషనల్ ప ్లక్ రిలేషన్ అవార్డుల
కింద వీడియో ఫిల్మ్ విభాగంలో ‘హరితహారం’, హోర్డింగ్ డిజైనింగ్ విభాగంలో ‘మిషన్
కాకతీయ’కు గాను స్పెషల్ జ్యూరీ అవార్డులను సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగా
ప్రభుత్వం దక్కించుకుంది. ఈ అవార్డులను భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్
రావు నుంచి సమాచార శాఖ తరపున సంయుక్త సంచాలకులు నాగయ్య కాంబ్లే
అందుకున్నారు. సమాచార శాఖ ప్రచురించే ‘తెలంగాణ మాస పత్రిక’ కూడా స్పెషల్
జ్యూరీ అవార్డును పొందింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి.
రమణాచారి, నీటి పారుదల సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ నారదాసు
లకూజ్ముణరావు, ఐ అండ్ పి.ఆర్. మాజీ డైరెక్టర్ సివి. నరసింహా రెడ్డి, నమస్తే తెలంగాణ
ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.