ఉద్యమాల స్వానుభవం ‘కవి’ పొన్నాల బాలయ్యది. ప్రతిభావుత్పన్నతతోపాటుగా లోకావలోకాన ప్రతిభ, వ్యవహార నేతృత్వం, కలిగిన నేర్పరి తీర్పరి, కవి బాలయ్య. తాను స్వయంగా వ్రాసిన ఈ ‘మిగ్గు’ కవితా ఖండికలో కవితాక్షర సత్యాలను పొదిగినాడు. అందులో తెలంగాణ రచయితల సంఘం వారు, తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్థిక సహాయంతో వెలువడ్డ ఈ కవితా సంపుటి తన ఆర్ధ్ర హృదయంలోంచి వెలువడిన స్వచ్ఛంద రచనల సంపుటి. ఇందులో దాదాపుగా 42 కవితా శీర్షికలు ఉన్నాయి. ఈ మిగ్గు కవితా సంపుటిలో ఎలాన్ కవిత అందరికి నచ్చుతుంది.
మతం మత్తులో తడ్కైన మనిషిని
నిలువునా నర్కిన వుట్టి తొర్రబొర్రె. బాగుంది మతాన్ని మాడ్శెయి అంటాడు.
ఇంకొకచోట పుస్కిపోయిన బతుకుల ఆదెరువుకు
శిఖరంమీద పిడికిలి బిగించిన ఆత్మగౌరవ దెబ్బ
ఇయ్యాల్ల… ఉయ్యాల పాటలుకాదు
సమ్మక్క సారక్క సాకలి ఐలక్కల
యుద్ధతంత్రాలు. తవ్వుకుంటది.
అందరూ చదవదగ్గ మంచి కవితా సంపుటి.
గంద మాదవ పర్వతంసాటునుంచి మోసపు బాణం
గురిచూసి గుచ్చుతే గోదావరి తనువంత
సుడులు సుడులుగా మడుగుగట్టిన రక్తం తెట్టు
అత్తరువుగా వూస్కొని ఆనందపడరాదుండ్రి!! ఇది ఎంత పదజాలం.
ప్రతి మంచి మనిషిని ఆలోచింపజేసే, కవితా వస్తువు… ఇలాంటివి ఇందులో ఎన్నో ఉన్నాయి.
– డా|| కావూరి శ్రీనివాస్
ప్రతులకు: పొన్నాల క్రిష్ణవేణి,
గ్రామం : ఆరేపల్లి,
పోస్టు: బస్వాపూర్,
వయా : శనిగరం, మండలం: కోహెడ, కరీంనగర్ జిల్లా, తెలంగాణ – 505473.