ట్రీట్‌మెంట్లు పూర్తయిన చోట వెంటనే అక్కడి ప్రాంతాలకు మంచినీటి
సరఫరా జరిగేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సిఎం చెప్పారు.
2016 ఏప్రిల్ చివరి నాటికి రాష్ట్రంలోని తొమ్మిది నియోజకవర్గాలకు
మంచినీరు అందించడానికి జరుగుతున్న పనుల పట్ల ము ఖ్యమంతి సంతృప్తి
వ్యక్తం చేశారు. 2016 చివరి నాటికి ఎక్కడెక్కడ ఏఏ పనులు పూర్తి
చేయగలుగుతారు? నెల వారీగా ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతాయి?
అనే విషయాల్లో కార్యాచరణ రూపొందించుకుని అధికారులు, ఇంజనీర్లు,
డెవలప్‌మెంట్ పార్ట్నర్స్ (కాంటాక్టర్లు) సమన్వయంతో పని చేయాలన్నారు.
అన్ని పనులు సమాంతరంగా జరగాలని చెప్పారు.
మిషన్ భగీరథ పనుల పురోగతిపై ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో సిఎం సమీకూజు
నిర్వహించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి
దయాకర్ రావు, పంచాయతిరాజ్ శాఖ కార్యదర్శి ఎస్.పి.సింగ్, ఇ-ఇన్-సి
సురేందర్ రెడ్డి, ము ఖ్యమంతి అదనపు కార్యదర్శి స్మితాసభర్వాల్, సిఇలు,
ఎస్‌ఇలు, వర్కింగ్ ఏజెన్సీలు పాల్గొన్నారు.
ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, పైపులైన్ల నిర్మాణం తదితర
పనులను సెగ్మెంట్ల వారీగా ము ఖ్యమంత్రి సమీకిూజుంచారు. ఏఏ పని ఎప్పటి
వరకు పూర్తవుతుందో అడిగి తెలుసుకున్నారు. డిజైన్లు ఇవ్వడంలో,
అనుమతులు ఇవ్వడంలో జాప్యం నివారించాలని, అన్ని రకాల
అవాంతరాలను ఎప్పటికప్పుడు తొలగించడానికి ముఖ్యమంత్రి
కార్యాలయమే జోక్యం చేసుకుంటుందని వెల్లడించారు.
రైతుల పొలాల గుండా వెళ్లే పైపులైన్ల నిర్మాణం, ఖరీఫ్ పనులు
ప్రారంభమయ్యే జూన్‌లోగా పూర్తి కావాలని సిఎం ఆదేశించారు. మంచినీళ్లు
సరఫరా చేయడానికి ఉపయోగించే పైపులైన్లు నాణ్యతతో
ఉండాలని, రోగ కారకమైనందున సిమెంట్ పైపులైన్లు
ఎట్టి పరిసిశీవతుల్లో వాడవద్దని ఖచ్చితంగా చెప్పారు.
పైపులు, వాల్స్‌లు పెద్ద ఎత్తున అవసరం వుంటుంది
కాబట్టి, అవి సకాలంలో అందుబాటులోకి వచ్చేందుకు
అవసరమైన వ్యూహం రూపొందించాలన్నారు.
తెలంగాణకు చెందిన ఉత్పత్తి సంసశీవలు పైపులైన్లు, వాల్స్
లు అందించే పరిసిశీవతిలో లేకుంటే, దేశంలోని ఉత్తమమైన
సంసశీవలకు పనులు ఇవ్వాలని చెప్పారు. ఇన్ టేక్ వెల్స్,
డబ్ల్యుటిపిలతో పాటు గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల
నిర్మాణం ూడా వేగంగా జరగాలన్నారు. గ్రామాల్లో
పైపులైన్ల నిర్మాణం కోసం కందకాలు తవ్వే పనిని గ్రామీణ
ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని సూచించారు.
మిషన్ భగీరథ ద్వారా మంచినీటి పంపింగ్ కోసం
అవసరమయ్యే విద్యుత్ సరఫరా టాన్స్ ఫార్మర్లు, పవర్
లైన్లు, సబ్ స్టేషన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని
సిఎం చెప్పారు.
మిషన్ భగీరథ పనుల కోసం అవసరమైన సిబ్బందిని
నియమించుకోవాలని, అధికారుల వింద్రీకరణ
జరగాలని సిఎం చెప్పారు. మిషన్ భగీరథ పనులు పూర్తి
అయిన తర్వాత వచ్చే పదేండ్ల పాటు నిర్వహణ బాధ్యత
వర్కింగ్ ఏజన్సీల ఉంటుందని పునరుద్ఘాటించారు.నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేసిన వారికిచ్చే 1.5% ఇన్సెంటివ్ ను అన్ని
వర్కింగ్ ఏజన్సీలు అందుకునేలా ప్రయత్నం చేయాలని చెప్పారు. ఇంజనీరింగ్
పనుల్లో సాంతిేక విద్య అభ్యసించిన విద్యారుశీవలను ూడా
ఉపయోగించుకోవాలని సిఎం సూచించారు.
మిషన్ భగీరథ పథకంలో భాగంగా చేపట్టే పైప్ లైను ఫిట్టింగ్, కనెక్టింగ్
తదితర పనులు చేసే అవకాశం గ్రామాల్లో వుండే ఐటీఐ పూర్తి చేసిన ఫిట్టర్లకు
ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. మంత్రులు, కలెక్టర్లు
చొరవ తీసుకుని మండలాల వారీగా ఐటీఐ పూర్తి చేసిన వారి వివరాలు
తీసుకుని, సాశీవనికంగా జరిగే పనుల్లో వారికి ఉపాధి లభించే విధంగా చర్యలు
తీసుకోవాలన్నారు.
మిషన్ భగీరథ సమీకూజు శుక్రవారం మధ్యాహ్నం ూడా కొనసాగింది. ఈ
సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులు, వర్కింగ్ ఏజన్సీలు, ఇంజనీర్లు చెప్పిన
అభిప్రాయాలను విన్నారు. పనులు మరింత వేగంగా జరిగేందుకు
తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డిజైన్ల రూపకల్పనలో మరింత వేగం
అవసరమని వ్యాప్కోస్ ప్రతినిధులను సిఎం కోరారు. పాత ము న్సిపాలిటీల్లో
ప ్లక్ హెల్త్ డిపార్టుమెంటు, కొత్త ము న్సిపాలిటీలలో
ఆర్.డబ్య్లు.ఎస్ అధికారులు మిషన్ భగీరథ పనులు
చేయాలని సూచించారు. కార్పొరేషన్లు, ము న్సిపాలిటీలకు
మిషన్ భగీరథ పైపులైన్ల ద్వారానే బల్క్ వాటర్ సప్లై
చేయాలని సూచించారు. 2016 చివరి నాటికి పూర్తయ్యే
పనులకు సంబంధించిన డిజైన్లు వచ్చే నెలాఖరు నాటికి
ఖరారు చేయాలని చెప్పారు. 2017లో పూర్తయ్యే పనులకు
కావాల్సిన మెటీరియల్ కోసం ఇప్పుడే ఆర్డర్ ఇవ్వాలని సిఎం
ఆదేశించారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత నెలకొన్న దృష్ట్యా,
మంచి నీటి ఎద్దడి తీర్చడానికి, పజలకు అవసరమైన తకూజుణ
అవసరాలు తీర్చేందుకు వీలుగా రూ. 300 కోట్లు విడుదల
చేయాలని ము ఖ్యమంత్రి . చంద్రశేఖర్‌రావు అధికారులను
ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు చొరవ చూపి ఎండల తీవ్రత,
మంచినీటి ఎద్దడి వున్న ప్రాంతాల్లో అవసరమైన చర్యలు
తీసుకోవాలని సిఎం చెప్పారు.
కె.టి.ఆర్., జగదీశ్‌లకు అదనపు శాఖలు
ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తన వద్ద ఉన్న
మున్సిపల్, సహకార, ఎస్సీ అభివృద్ధి శాఖలను ఇద్దరు
మంత్రులకు అప్పగించారు. పరిపాలనలో కీలకమైన
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పురపాలక శాఖను కే. తారక
రామారావుకు, సహకార, ఎస్సీ అభివృద్ధి శాఖలను జగదీశ్
రెడ్డిలకు అప్పగించారు. ఇప్పటికే పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలను కే. తారక రామరావు
సవమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ను
విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న లకూజ్యుంతో పనిచేస్తుండడంతో ఈ
శాఖను కేటిఆర్‌కు కేటాయించడం ప్రాముఖ్యత
సంతరించుకుంది. ఐటీ శాఖ మంత్రి హోదాలో టీహబ్
వంటి వినూత్న ఆవిష్కరణతో వివిధ ప్రతిష్ఠాత్మక కంపెనీలు
హైదరాబాద్‌కు రప్పించిన కేటిఆర్ ముఖ్యమంత్రి లకూజ్యుాన్ని
పరిపూర్ణం చేయగలడనే విశ్వాసం వ్యక్తమవుతోంది. ఇటీవల
జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల
సందర్భంగా హైదరాబాద్ నగరంలో మారుమూలతో సహా
విస్తృతంగా పర్యటించిన కె.టి.ఆర్. నగర సమస్యలను
ప్రత్యకూజుంగా చూసి, అవగాహన చేసుకున్నారు. ఈ
అనుభవంతో నగర సమస్యలతో పాటు రాష్ట్రంలోని
మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల సమస్యలను కూడా
పరిష్కరిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. విద్యుత్ శాఖ
మంత్రిగా ఉన్న జి. జగదీశ్ రెడ్డికి సహకార, ఎస్సీ అభివృద్ధి
శాఖలను అప్పగిస్తూ ఫిబ్రవరి 7న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు.