మిషన్‌-కాకతీయకు-విరాళాలు‘మిషన్‌ కాకతీయ’కు బాలాజీ అమైన్‌ లిమిటెడ్‌ కంపెనీ 50 లక్షల 55వేల రూపాయల విరాళాన్ని అందించింది. జూలై 2వ తేదీన బాలాజీ అమైన్‌ లి. కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి ఈ విరాళాన్ని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావుకు అందజేశారు. మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలోని రంగసముద్రం చెరువు పునరుద్ధరణకు విరాళం ఇస్తున్నట్లు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. మిషన్‌ కాకతీయతో భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలకు ఉత్తేజితుడినై, బంగారు తెలంగాణ సాధనలో తనవంతు సహకారంగా ఈ విరాళం ఇస్తున్నట్లు బాలాజీ అమైన్‌ లిమిటెడ్‌ కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి, మంత్రి హరీష్‌ రావుకు తెలిపారు.

మిషన్‌-కాకతీయకు-విరాళాలుaమిషన్‌ కాకతీయకు మరో సారి విరాళం అందించింది.   ది కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయి). క్రెడాయి ప్రతినిధులు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావును ఆయన నివాసంలో కలిసి 5లక్షల 50 వేల రూపాయల చెక్కును అందజేశారు. దీంతో చెరువుల పునరుద్ధరణకు క్రెడాయి ఇచ్చిన విరాళం 80లక్షల 50 వేలకు చేరింది. అంతే కాకుండా 13 చెరువులను పునరుద్ధరించేందుకు ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో క్రెడాయ్‌ అధ్యక్షుడు ఎస్‌. రాంరెడ్డి, ఉపాధ్యక్షుడు జీ. ఆనంద్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి పీ. రామకృష్ణారావు, సీఈవో ఎం.వి. రాజేశ్వర్‌రావు ఉన్నారు. ఇదే స్ఫూర్తితో దాతలు ముందుకు వచ్చి మన ఊరిలో మన చెరువును పునరుద్ధరించడానికి సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు.

Other Updates