mission-kakatiyaమిషన్‌ కాకతీయ మీడియా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఏప్రిల్‌ 19న నగరంలోని ఎర్రమంజిల్‌ జలసౌధలో ఘనంగా జరిగింది. మీడియా అవార్డుల కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు, ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మిషన్‌ కాకతీయ పథకంపై సమగ్రంగా ఆకట్టుకునే విధంగా కథనాలు రాసిన.. టీవీల్లో ప్రసారం చేసిన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులకు మంత్రి అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ గొప్ప ఆలోచనకు ప్రతిరూపమే మిషన్‌ కాకతీయ పథకమని తెలిపారు. భవిష్యత్‌ తరాలను దృష్టిలో పెట్టుకొని సీఎం మిషన్‌ కాకతీయకు శ్రీకారం చుట్టారన్నారు. మిషన్‌ కాకతీయతో చెరువులకు పునర్వైభవం సమకూరుతుందన్నారు. చెరువు మరమ్మతు పనులు ఉద్యమంలా సాగుతున్నాయన్న ఆయన చెరువును నమ్ముకున్న అందరికీ జీవనాధారం లభించేలా మిషన్‌ కాకతీయ పనితీరు ఉందన్నారు. మిషన్‌ కాకతీయపై జర్నలిస్టులు అద్భుతమైన ఆర్టికల్స్‌ రాశారన్నారు. భావితరాలకు ఉపయోగపడే మిషన్‌ కాకతీయ లాంటి పథకాలపై జర్నలిస్టులు ఎక్కువ దృష్టిని సారించాలని కోరారు. ఈ యేడాది 4 లక్షల 30 వేల ఎకరాలను సాగులోకి తెచ్చినట్లు తెలిపారు. 9 గంటల విద్యుత్‌ సరఫరా, చెరువు పూడికతీతతో ఈసారి రైతులకు ఎక్కువ దిగుబడి వచ్చిందని చెప్పారు. గతంలో పూడికతో నిండి.. చెరువులు కట్టలుతెగి నీరు వృథాగా పోయేది. కాగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన చెరువుల పునరుద్ధరణ వల్ల నీటి నిల్వలు పెరిగాయన్నారు. వచ్చే ఏడాది నుంచి బెస్ట్‌ ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లకు అవార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వరుసగా రెండవ సంవత్సరం కూడా మిషన్‌ కాకతీయ ”మీడియా అవార్డుల”ను ప్రదానం చేసింది. ప్రతిష్టాత్మక మిషన్‌ కాకతీయ కార్య క్రమంతో వస్తున్న ఫలితాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న పెనుమార్పులపై వివిధ పత్రికలు ,టి.వి ఛానళ్లలో వచ్చిన వార్తలను న్యాయ నిర్ణేతలు పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. మిషన్‌ కాకతీయ కార్యక్రమం రెండవ దశ (2016) పై వివిధ కేటగిరిల కింద మీడియా ఆవార్డుల కోసం అందిన ఎంట్రీలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎంపిక ప్రక్రియను ఈ ఆవార్డుల న్యాయ నిర్ణేతల కమిటీ పూర్తి చేసింది. తెలంగాణ సమాజం లో వివిధ వర్గాలు, వృత్తులు ప్రజల పై మిషన్‌ కాకతీయ ప్రభావం అనే అంశాన్ని ఈ సారి మీడియా ఆవార్డుల ఎంపిక కోసం నిర్ణయించింది.

ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా నుంచి పెద్ద ఎత్తున ఎంట్రీలు రావడం ఈ కార్యక్రమం పట్ల మీడియా ప్రదర్శిస్తున్న సానుకూల వైఖరికి నిదర్శనం.

‘మిషన్‌ కాకతీయ’ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అవగాహన వుండాలని పకడ్బందీగా ప్రచారాన్ని కూడా నిర్వహించింది. అంతేకాకుండా దృశ్య, శ్రవణ, ముద్రిత మాధ్యమాలలో వచ్చిన వివిధ కథనాలను పరిశీలించి వాటిల్లో అత్యుత్త మమైన వాటికి అవార్డులను ఇచ్చి ప్రోత్సహించాలని తలచింది.

అవార్డులకు ఎంపికైన వారి జాబితా

ప్రింట్‌ మీడియా ఆవార్డుల జాబితా:

మొదటి బహుమతి:

జి. క్రిష్ణ ‘నమస్తే తెలంగాణ’ . 1,00,000/-

రెండవ బహుమతి:

గొల్లపూడి శ్రీనివాస్‌’ ది హిందూ ‘ 75,000/-

మూడవ బహుమతి:

ఇ. గంగన్న ‘ ఆంధ్రజ్యోతి’ 50,000/-

జ్యూరీ ప్రత్యేక బహుమతి:

దామరాజు సూర్య కుమార్‌ ‘తెలంగాణ మాసపత్రిక’,

జూన్‌ 2016 సంచిక. (చరిత్ర పరిశోధన)

స్పెషల్‌ జ్యూరీ రూ. 25000/-

సంగనభట్ల నర్సయ్య

‘తెలంగాణ మాసపత్రిక’

జూన్‌ 2016 సంచిక.

(చరిత్ర పరిశోధన),

స్పెషల్‌ జ్యూరీ రూ. 25000/-

సోమన్నగారి రాజశేఖర్‌ రెడ్డి.

‘సాక్షి’ దినపత్రిక,

స్పెషల్‌ జ్యూరీ రూ. 25000/-

బి. రాజేందర్‌, ‘ఈనాడు’ దినపత్రిక,

స్పెషల్‌ జ్యూరీ రూ. 25000/-

ప్రోత్సాహక బహుమతి:

తేజస్విని, విద్యార్థిని, ఆర్‌.జి.యు.కే.టి.,

బాసర., స్పెషల్‌ జ్యూరీ రూ. 10,000/-

ఎలక్ట్రానిక్‌ మీడియా ఆవార్డుల జాబితా:

మొదటి బహుమతి: గోర్ల బుచ్చన్న, వీ6

న్యూస్‌ చానల్‌ 1,00,000/-

రెండవ బహుమతి: యం. మానికేశ్వర్‌

ఈటీవీ తెలంగాణ, 75,000/-

మూడవ బహుమతి:

బి. శివ కుమార్‌, టీన్యూస్‌ 50,000/-

జ్యూరీ ప్రత్యేక బహుమతి:

దొంతు రమేష్‌, టీవీ9 వరంగల్‌,

స్పెషల్‌ జ్యూరీ, 25000/-, బి. నరేందర్‌.

టీవీ5, స్పెషల్‌ జ్యూరీ, 25000/-

స్పెషల్‌ కేటగిరి బహుమతులు:

కంది రామచంద్రా రెడ్డి ,

‘వీడియో ఫిలిం’ కేటగిరి.,

రూ. 1,00,000/-, తైదల అంజయ్య,

‘వీడియో సాంగ్‌ ‘కేటగిరి,

రూ. 1,00,000/-

జ్యూరీలో ఛైర్మన్‌గా అల్లం నారాయణ, సభ్యులుగా చింతల ప్రశాంత్‌ రెడ్డి (రెసిడెంట్‌ ఎడిటర్‌ ‘ది హిందూ’), కట్టా శేఖర్‌ రెడ్డి, ఎడిటర్‌ ‘నమస్తే తెలంగాణ’, ఓ. ఎస్‌.డి. శ్రీధర్‌ రావు దేశ్‌పాండేలు పాల్గొన్నారు.

‘మిషన్‌ కాకతీయ’ మీడియా అవార్డుల పోటీలో ఎంట్రీలు పంపిన జర్నలిస్టు మిత్రులందరికి మంత్రి హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. అలాగే బహుమతులకు ఎంపికైన జర్నలిస్టు మిత్రులందరికీ ఆయన ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. బహుమతుల ఎంపికకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ముగ్గురు సీనియర్‌ జర్నలిస్టులకు హరీష్‌ రావు కృతజ్ఞతలు తెలిపారు.

Other Updates