kcrరాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ తాగునీటి సరఫరా కార్పొరేషన్ ‘మిషన్ భగీరథ’ వైస్ చైర్మన్ గా నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ శాసన సభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి నియమితులయ్యారు. ప్రశాంత్ రెడ్డి ఈ పదవిలో మూడేళ్ళు కొనసాగుతారు. మిషన్ భగీరథ చైర్మన్ గా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వ్యవహరిస్తున్నారు. అలాగే, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షునిగా సీనియర్‌ పాత్రికేయుడు, రచయిత దేవులపల్లి ప్రభాకర రావును ప్రభుత్వం నియమించింది. ప్రభాకర రావు పలు గ్రంథాల రచయిత. యునెస్కో అవార్డు గ్రహీత.

టి.ఎస్‌ ఆర్‌.టి.సి చైర్మన్‌గా రామగుండం శాసన సభ్యుడు సోమారపు సత్యనారాయణ నియమితులయ్యారు.

నాగార్జున సాగర్‌లో ప్రభుత్వం అభివృద్ధిచేస్తున్న బుద్ధవనం పాజెక్టుకు ప్రత్యేకాధికారిగా సీనియర్‌ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్యను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నియమించారు.

వీరంతా ఏప్రిల్‌ 29న పదవీ బాధ్యతలు స్వీకరించారు. తమను ఆయా పదవులలో నియమించి నందుకు ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలసు తెలిపారు.

Other Updates