bhagirathaప్రధానమంత్రి ఆసీనులయి ఉన్న సభలో ప్రజలందరి మాటగా తనదైన భాషలో హిందీలో ప్రసంగించారు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు.

తెలంగాణ ప్రజలందరికీ ఈ రోజు శుభదినం. గోదావరి, కృష్ణా నదులలో పారే నీటిని శుద్దిచేసి, రాష్ట్రంలోని ఇంటింటికిి నల్లా ద్వారా స్వచ్చమైన నటిని అందించడానికి 42 వేల కోట్ల రూపాయలతో మీ మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని చెపట్టడం జరిగింది. ఈ ప్రయత్నం ఫలించి ఇందులోని తొలి అంకాన్ని మన ప్రధాని మోదీ తమ స్వర్ణ హస్తాలతో ఆవిష్కరించడం ద్వారా మా కల నజమయ్యింది. ఆ నీటినుంచి 66,800 ఇండ్లకు నల్లా ద్వారా వాళ్ళు వున్న చోటనే స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది. మనముందు అందరికీ ఇదే విధంగా తాగునీరు అందుతుంది.

సింగరేణి ఆద్వర్యంలో 1200 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టును జాతికి అంకితమిచ్చారు. దీని కోసం 8వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినం ఈ రెండు కార్యక్రమాలతోపాటు గోదావరి నది పక్కనే వెలుగులను విరజిమ్మే 1600 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్‌ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. 17 యేండ్ల కింద మూతపడిన రామగుండం ఆర్‌ఎఫ్‌పీఐ అప్పుడు బాగా నడిచింది. దీన్ని తెరిపించాలని నేను కోరగానే ప్రధాని ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే మంజూరు చేశారు. దానికి ఈ రోజు శంకుస్థాపన చేశారు. మనోరాబాద్‌ కొత్తపల్లి రైల్వే లైన్‌కు శంకుస్థాపన చేయడం ఆనందాన్నిచ్చింది. మేము మా చిన్నప్పటినుంచి వింటున్నాం.. ఇన్నేళ్ళకు తెలంగాణ ఏర్పడిన తర్వాత మీ ప్రభుత్వంలో ఆ కల సాకారం అయ్యింది. దీని కోసం1100కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నం ఈ పనులు వీలయినంత తొందరగా పూర్తి చేసుకుందాం. ఈ రోజు ప్రధాని మొత్త 17000కోట్ల రూపాయల పనులను ప్రారంభించారు.

నేను నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాలలో ఉన్నాను. కేంద్ర ప్రభుత్వాన్ని రెండేండ్లనుంచి చూస్తున్నా, వందశాతం అవినీతిలేని పరిపాలన కొనసాగుతున్నది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది భారత చరిత్రో లిఖించబడుతుంది. చాల ఏళ్ళపాటు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రాల సవాళ్ళు, ప్రజల కోరికలు ఎలావుంటాయో మీకు తెలుసు. మీరు ప్రధాని కాక ముందు కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా, మీరు ప్రధాని కాకముందు 32శాతం మత్రమే ఉంటే, దాన్ని ఇప్పడు 42 శాతానికి పెంచారు. ఈ విషయంమై దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి, వ్వక్తిగతంగా నా నుంచి కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.

ఈ రోజు ప్రధాని చేతులమీదుగా జరిగిన శంకుస్థాపన కార్యమ్రాల విలువ 17000కోట్ల రూపాయలు తెలంగాణ దేశంలోనే పిన్న వయస్సుగల రాష్ట్రం. మిమ్మల్ని 50వేల కోట్లు కావాలి…? లక్షకోట్లు కావాలి..?అని అడుగం. ఎందుకంటే నేను కూదా బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిని. సర్కారును నడిపేవారికి తెలుసు దాని పరిధేమిటో, అయినా మానుంచి మాకు ఒకటి తప్పని సరిగా కావాలి. ఈ వేదిక నుంచి నేను ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్రంపై మీ ప్రేమ కావాలని కోరుకుంటున్నా.

మేము వేసే ప్రతి అడుగులో మీ ఆశీర్వాదం లభిస్తే మేము అభివృద్ధి చెందుతూ దేశ నిర్మాణంలో బలమైన భాగస్వాములం అవుతాం. మేము చేపట్టే చాలా కార్యక్రమాల్లో మీ సహకారం అందుతున్నది. కేంద్రమంత్రులందరూ రాష్ట్రానికి చేయూతనందిన్నారు. ఇంతకుముందు తెలంగాణలోని జాతీయరహదారులు,జాతీయ సగటుకంటే తక్కువగా వుండేవి. అది ఇపుడు మీ సహకారం వల్లనే 2.2 శాతం నుంచి 4 శాతానికి వచ్చింది. జాతీయ రహదారుల సగటు 3 శాతం మాత్రమే. ఏడాదిలో1951 కిలోమీటర్ల జాతీయ రహదారిని మంజూరు చేశారు.

తెలంగాణలో 10 జిల్లాలు ఉండగా హైదరాబాద్‌ను మినాహాయించగా మిగిలిన 9 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా మీరు ప్రకటించారు. నేను అడిగిన వెంటనే జిల్లాకు 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు, మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణకు 70కోట్ల రూపాయల విలువయిన హార్టీకల్చర్‌యూనివర్సిటీని మంజూరు చేశారు.

మాకు హడ్కో నుంచి లోను అవసరమయినపుడు, తెలుగు రాష్ట్రాల మంత్రి వెంకయ్యనాయుడు సహకరించారు. ఆయనకు కూదా ధన్యవాదాలు తెలపుతున్నాను. విద్యుత్‌ విషయంలో పీయూష్‌గోయల్‌ సహాకారం అందించారు, రైల్వే శాఖకు సురేశ్‌ప్రభును ఎంపికచేయడం సరైన నిర్ణయం, ఆయన డైనమిక్‌ మంత్రి. మా సమస్యలు చెప్తే రెండు రోజులలోనే వాటిని పరిష్కరించారు. అంతే హైదారాబాద్‌ మెట్రోరైల్‌ పనులు వేగం పుంజుకున్నాయి.

మా రాష్ట్రం మేం చేసిన ఉద్యమం మూడు అంశాల మీద జరిగింది. నీళ్ళు, నిధులు, నియామకాలు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నది. ఢిల్లీలో మీకు చెప్పాను తెలంగాణకు నీటి కేటాయింపులు కూడా వున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా వున్నప్పుడు కృష్ణా, గోదావరిలో తెలంగాణకు 1600 టీఎంసీల నీటి కేేటాయింపులున్నాయి. ఆ ప్రకారంగానే ప్రాజెక్టులు కట్టబోతున్నాం, ఇపుడు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మా సాగునీటి సమస్యను అధిగమించడానికి, ఒక జాతీయ ప్రాజెక్టు ప్రటించండి. కాకతీయులు అలనాడు నిర్మించిన 75వేల చెరువులు పూÛర్తిగా ధ్వంసమయ్యాయి, వాటిలో 45వేల చెరువులను మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో పునరుద్ధరిస్తున్నాం. దీనికి కూడా మీ సహకారం కావాలి. మేము ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ఎంచుకున్నాం. టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఇప్పటికే 2303 కంపెనీలకు 15 రోజులలోనే అన్ని రకాల అనుమతులు ఇచ్చాము. వీటిద్వారా 46వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫలితంగా స్థానిక యువతకు 1.5 లక్షల ఉద్యోగాలు కూడా లభించాయి. ఐటీ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో వుంది. మొదటి యేడాది 75వేల కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు చేశాం. ఇదివరకే హైదరాబా ద్‌కు ప్రకటించిన ఐటిఐఆర్‌ను తొందరగా ప్రారంభించడానికి మీ సహాకారం కావాలి. దీంతో పాటు ఆలిండియా మెడికల్‌ సైన్సెస్‌(ఏయిమ్స్‌)తోపాటు ఐఐఎం కావాలని ఆడుగుతున్నాం. ఈ ఆకాంక్షలన్నింటిలో మీ సహ కారం మాకు కావాలి. వీటన్నింటినీ మించి మీ ప్రేమాభి మానాలు కోరుకుంటున్నాం.

మీ ప్రేమ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తుంది. నేను అడిగినవెంటనే నా మాటను మన్నించి ఇంతదూరం వచ్చి వివిధ కార్యక్రమాలను శంఖు స్థాపన చేసినందుకు, మిషన్‌ భగీరథ లాంటి గొప్ప ప్రాజెక్టును ప్రారంభించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తు న్నాను. జై తెలంగాణ జై హింద్‌.

మోదీజీ.. నేను మిమ్మల్ని 2009లో పంజాబ్‌, లూధినాలో జరిగిన ఎన్డీఏ సభలో మొదటిసారి కలిశాను. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వెన్ను తట్టి మాది ధర్మయుద్ధమని అన్నారు. గుజ రాత్‌ ముఖ్యమంత్రిగా మద్దతు ఇస్తున్నాను అని ఆశీర్వదించారు. అందరి ఆశీర్వాదం, బీజేపీ భాగస్వామ్యంతో తెలంగాణ ఏర్పడింది. ఈ తెలగాణ వెనుకబడిన వర్గాలు ఉన్న రాష్ట్రం. ఇక్కడ 80 శాతానికిపైగా ఓబీసీలు, మైనార్టీలు, గిరిజనులు, దళితులున్నారు. వీరందరి యోగక్షేమాలను దృష్టిలో వుంచుకొని, దేశంలో ఏ రాష్ట్రం ఖర్చుచేయని విధంగా 30వేల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలపై ఖర్చు పెడుతున్నాం.

Other Updates