కెటిఆర్ సుడిగాలిలా పర్యటన ఫలితం
అమెరికా సంయుక్త రాష్ట్రాలతో వ్యాపార వాణిజ్య సంబంధాలను నెలకొల్పే ఉద్దేశంతో పర్యటించిన ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు తన పర్యటన ఫలవంత మైందని సంతృప్తిని వ్యక్తపరిచారు. వివిధ అంశాల వారిగా తెలంగాణ రాష్ట్రంతో సత్సంబంధాలను కొనసాగిస్తామని ఆయా రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. ఇల్లినాయిస్, అయోవామిన్నసోటా, కాలిఫోర్నియా, ఇండియనా రాష్ట్రాల్లో రెండు వారాల పాటు జరిపిన పర్యటనలో ఆయా రాష్ట్రాల గవర్నర్లు, డిప్యూటీ గవర్నర్లతో అనేక ఒప్పందాలను కుదుర్చుకుని వచ్చారు.
ఆయా రాష్ట్రాల గవర్నర్లు, డిప్యూటీ గవర్నర్లతో సమావేశమైన మంత్రి పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను, నూతన పారిశ్రామిక విధానాన్ని వివరించి, తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలని కోరారు. ఇక ఇండియానా పోలీస్, కార్మెల్ నగరాల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక రంగాల్లో సాధించిన ప్రగతిపై అక్కడి మేయర్లతో విస్తృతంగా చర్చలు జరిపి ఆ నగరాల విజయాలు, అనుభవాలను, తెలంగాణ అభివృద్ధిలో ఉపయోగించుకునే అవకాశాలపై చర్చించారు.
మంత్రి ఆలోచనలు, తెలంగాణ ప్రభుత్వ విధానాలకు ముగ్దుడైన డ్రీమ్ వర్క్స్ సీఈఓ జెఫ్రీ క్యాట్జన్ బర్గ్ ఐటీ, ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ వినూత్న పథకాలతో ముందుకు వెళుతోందని ప్రశంసించారు.
ఇక సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ నికేశ్ అరోరాతో మంత్రి జరిపిన చర్చలతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశాలు పెరిగాయని, స్పష్టమైన ఆలోచనలతో తెలంగాణ అభివృద్ధి ప్రయత్నాలకు లింక్డెన్ సీఈఓ రీడ్ హాఫ్ మెన్ తనవంతు సహకారం అందిస్తామన్నారు.వచ్చే ఏడాది అక్టోబర్ లో సిలికాన్ వ్యాలీలో జరిగే స్టార్టప్ ఫెస్టివల్ కు రావాల్సిందిగా మంత్రి నిహాఫ్ మెన్ మంత్రి కెటిఆర్‌ను ఆహ్వానించారు.
ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ఛైర్మెన్లు,సీఈఓలతో సమావేశమైన మంత్రి తారక రామారావు, వాటి విస్తరణ ప్రణాళికలను తెలుసుకున్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని వివరించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సిలికాన్ వ్యాలీలో మంత్రి చేసిన ప్రసంగంతో తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఆలోచనలు అక్కడి ప్రముఖ కంపెనీ ప్రతినిధులను, పెట్టుబడిదారులను ఆకర్షించాయి. అమెరికా అభివృద్ధిలో విజయ వంతమైన పాత్ర పోషిస్తున్న ఎన్నారైల సహకారంతో సిలికాన్ వ్యాలీలో టీహబ్ అవుట్ పోస్ట్ ఏర్పాటు సులభం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణకు చెందిన రాజిరెడ్డి , కిట్టూ కొల్లూరి,రాజురెడ్డి, కీర్తి మెల్కొటే, ఓం నల్లమాసు వంటి ప్రముఖ ఎన్నారైలు అవుట్ పోస్ట్ ఏర్పాటుకు పూర్తి సహకారం అందించడానికి ముందుకొచ్చారు.
ఐటీ, బయోటెక్నాలజీ, అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్, క్లీన్ టెక్ రంగా ల్లోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో మంత్రి జరిపిన సమావే శాలు మంచి ఫలితాలనిచ్చాయి. ఎన్ విస్టా, ఆర్.ఆర్ డోనల్లి, ఇంటరాక్టీవ్ ఇంటలిజెన్స్, 3ఎం, స్లమ్ బర్జే, నెట్ యాప్,సేల్స్ ఫోర్స్,ఐహబ్ వంటి ఐటీ కంపెనీ ప్రతినిధులను మంత్రి తారకరా మారావు కలిశారు. వాటితో పాటు జెనెసిస్ ఫార్మాసూటికల్స్, బోస్టన్ సైంటిఫిక్, మెడ్ ట్రానిక్స్ వంటి బయోటెక్నాలజీ కంపెనీలు, డ్యూపాంట్, కార్గిల్ వంటి వ్యవసాయ రంగ కంపెనీల ప్రధాన కార్యాలయాలను పరిశీలించి అక్కడి టెక్నాలజీ పనితీరును తెలుసుకున్నారు. మొత్తంగా పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఆకర్షణీయ గమ్య స్థానంగా మారుతుందన్న నమ్మకాన్ని అమెరికన్ కంపెనీలు, పెట్టుబడి దారుల్లో కలిగించడంలో విజయ వంతం అయ్యామని మంత్రి తారకరామారావు తెలిపారు.
మంత్రి కె.తారక రామారావు ఇండియానా పోలీస్ గవర్నర్ మైక్ పెన్స్ తో సమావేశం అయ్యారు. Iఅసఱaఅa జూశీశ్రీఱర నవసవతీaపaస ూఱర్‌వతీ జఱ్‌ఱవర జశీఎఎఱ్‌్‌వవ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రి తెలంగాణ ఎన్నారైలను ఉద్దేశించి ప్రసం గించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. ఇండియానా పోలీస్ రాష్ట్రంతో ఉన్న సిస్టర్ సిటీ ఒప్పందాన్ని మరింతగా బలోపేతం చేస్తామన్నారు తర్వలోనే హైదరాబాద్ నగర మేయర్ ఇండియానా పోలీస్ వస్తారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాభివృద్దికి చేపట్టిన కార్యక్రమాలను మంత్రి ఎన్నారైలకి వివరించారు. సుమారు 500 మంది తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్న సమావేశంలో మంత్రి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని కోరుకున్నామని, రాష్ట్రం ఏర్పాటు తర్వాత తమను రాష్ట్ర అభివృద్దిలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం పట్ల తెలంగాణ ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ భూమిపుత్రులుగా తమ వంతు భాగసామ్యాన్ని తాము అందిస్తామని, తెలంగాణలోని పెట్టుబడులకి ఉన్న అవకాశాలను ప్రభుత్వానికి, మంత్రికి ఎప్పటికప్పుడు అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టి హబ్ అవుట్ పోస్ట్ ఏర్పాటు వెంటనే జరిగేలా సిలికాన్ వ్యాలీలోని తామంతా సహకారం అందిస్తామని మంత్రికి తెలిపారు.
సిలికాన్ వ్యాలీ పర్యటనలో భాగంగా సాంప్రదాయేతర ఇంధన వనరులపై ఆసక్తికర నూతన ఆవిష్కరణలను మంత్రి స్వయంగా పరిశీలించారు. తొలుత కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పాటు చేసిన క్లీన్ టెక్ ఇంక్యుబేటర్ ఐ-హబ్ లో నెలకొల్పిన అనేక సాంప్రదాయేతర ఇంధన వనరుల అంకుర పరిశ్రమలను (స్టార్టప్స్) తిలకించారు. అక్కడి ఔత్సాహిక పరిశోధకులతో చర్చించారు.
ఐ-హబ్ లో ఒక అంకుర పరిశ్రమ రూపొందించిన బయో-డిగ్రేడబుల్ ప్లాస్టిక్ గ్లాసు, మంత్రిని అమితంగా ఆకర్శించింది. మామూలుగానైతే ప్లాస్టిక్‌తో తయారైన ఏదైనా వస్తువు వాడి పారేసిన తరువాత అది మట్టిలో కలవడానికి 450-1000 సంవత్సరాలు పడుతుంది. కానీ రెన్యువబుల్ కంపెనీ కనుగొన్న నూతన టెక్నాలజీ సాయంతో తయారు చేసిన ప్లాస్టిక్ గ్లాసు వాడి పారేసిన తర్వాత కేవలం ఆరు నెలల్లో మట్టిలో కలిసిపోతుందన్నారు. ఈ పర్యావరణహిత టెక్నాలజీ కంపెనీ ఇప్పుడు అమెరికాలో సంచలనం సృష్టిస్తోందని, ఇటువంటి పర్యావరణహిత టెక్నాలజీ లను మనదేశంలో కూడా అతి తొందరలో ప్రవేశపెట్టాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాలను ప్లాస్టిక్ రహిత నగరాలుగా తీర్చి దిద్దేందుకు ఇలాంటి అధునాతన, వినూత్నమైన ప్రయోగాలు ఉపయోగపడతాయని మంత్రి కెటియార్ అన్నారు.
సిలికాన్ వ్యాలీలో పేరున్న అనేక కంపెనీలతో చర్చలకు బయలు దేరిన మంత్రి పర్యటన ఆసాంతం ఎలెక్ట్రిక్ కారు టెస్లా మోడెల్ ఎక్స్ కారులో సాగింది. పర్యటన తొలిరోజు నుంచి మంత్రి ఇదే కారులో పర్యటించారు. ఈ- కారు పరిశీలన కోసం మంత్రి స్వయంగా నడిపి చూశారు. 2003లో ప్రారంభం అయిన టెస్లా కంపెనీ సాంప్రదాయేతర ఇంధన రంగంలో సంచలనం సృష్టిస్తోంది. సిలికాన్ వ్యాలీలో యువ ఇంజనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలో నడుస్తున్న టెస్లా మోటర్స్ తయారు చేస్తున్న ఎలెక్ట్రిక్ కార్లు, వాటిలో ఉన్న ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది దృష్టిని ఆకర్శిస్తున్నాయని మంత్రి అన్నారు.
తాజాగా విడుదలయిన టెస్లా మోడల్ ఎక్స్ ఎలెక్ట్రిక్ కారు విహంగంలా రెక్కల ఆకారంలో ఉన్న డోర్లు కలిగి ఉంది. కారు ముందు విండ్ షీల్డ్ కూడా పానోరామిక్ వ్యూ ఉండి అన్ని దిక్కులను, ఆకాశాన్నీ చూసే వెసులుబాటు కలిపిస్తుంది. ఇక స్టార్ట్ అయిన కేవలం 4 సెకండ్ల కన్న తక్కువలోనే 100కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదీ కారు. ఈ కారు తన చుట్టు ఉన్న వాహనాలను, ట్రాఫ్రిక్ అలర్ట్స్‌ని నెప్పటికప్పుడు అందిస్తూ డ్రైవర్‌కి సమాచారం ఇస్తున్నది. అమెరికన్ రోడ్ల మీద కూడా అతి తక్కువగా కనిపించే టెస్లా మోడల్ ఎక్స్ కారులో మంత్రి కేటీఆర్ ప్రయాణిస్తుంటే అనేకమంది ఆసక్తిగా గమనించారు. అద్భుతమైన అలోచనలు, విభిన్నంగా అలోచించే తత్వం ద్వారా ప్రపంచగతిని మార్చే ఫలితాలు వస్తాయన్నారు. టెస్లా అవిష్కరణ ఇలాంటిదే అని మంత్రి అన్నారు. సిలికాన్ వ్యాలీలో జరుగుతున్న పరిశోధనలు, టిహబ్ లాంటి చోట్ల ఉన్న జౌత్సాహిక పరిశోధకులకి టెస్లా విజయ ప్రస్దానం స్పూరి నిస్తుందన్నారు.