amirica

రచయిత్రి శ్యామలాదేవి దశిక అమెరికాలో స్థిరపడినా ఆమె ఆలోచనంతా మన తెలుగువాళ్ళమీదనే ఉందనడానికి ఆమె రాసిన ‘అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – 2’ ఓ ఉదాహరణ. కుటుంబమంతా కలసి చదువుకొనే రచనలు, గిలిగింతలు పెట్టే హాస్యంతో, 29 సెటైర్ల ముచ్చట్లతో వెలువడిన ఈ పుస్తకం చదువరులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ఇల్లాలి ముచ్చట్లలో తాను శ్రీవారితో ముచ్చటిస్తున్నట్టు అనిపిస్తుంది. శ్రీవారి పాత్ర అందులో ప్రత్యక్షంగా లేనప్పటికీ సంభాషణ మాత్రం దశ్యకావ్యంగా సాగిపోతుంది. ఇది శ్యామలాదేవి విశేష రచనా శైలిగా చెప్పవచ్చు.

”అమెరికా కబుర్లు ఇండియావారికే ఇంటరెస్టు” అని వంశీ రామరాజు చెప్పినట్టు, ‘ఆశించని అవకాశం’ చదివినప్పుడు అది అక్షరాలా నిజమనిపిస్తుంది. అంశం ఏదైనా పాఠకులను ఆకట్టుకునేటట్లు హాస్యం, వ్యంగ్యంతో వుండి, చదువుతున్నట్టుగా కాకుండా ఎదురుగా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నట్టుగా వుంటుంది. పుస్తకంలో మొదటి ముచ్చట ‘సూపరేసూపరు’ నిజంగా సూపరేమరి. యాంకరింగ్‌ గురించి రాసిన ముచ్చట్లు చదువుతుంటే నవ్వకుండా వుండలేము. ఫోను, అమ్మాయి సీమంతం. శ్రావణమాసం, మనవరాలు, తదితర ముచ్చట్లన్నీ దేనికదే పోటీ పడ్డట్లు వున్నాయి.

అమెరికా ముచ్చట్లు – 2, రచన, శ్యామలాదేవి దశిక, పేజీలు. 166, వెల రూ. 120. ప్రతులకు నవోదయ, వంగూరి ఫౌండేషన్‌ వారిని సంప్రదించవచ్చు

 

Other Updates