బహుమనీ రాజ్యం 1347 ` 1538 వరకు రెండు శతాబ్దాల కాలం యావత్తు దక్కను భూమికి విస్తరించింది. తూర్పున రాజమండ్రి, ఉత్తరాన ఖాందేష్‌, దక్షిణాన కృష్ణానది, పశ్చిమాన నాసిక్‌ దాని సరిహద్దులు. బహమనీ సుల్తానులు షియాలు. పరిషియా నుండి వచ్చి స్థిరపడిన ఆపాఖీలు ఆబాషీలకు వీరు ఆదరణ చూపేవారు. వీరు సూఫీ మతాన్ని అవలంబించారు. ఇస్లాంలోని సాత్విక మత ధోరణికి వీరు ప్రతినిధులు. ఢల్లీి నవాబుల ప్రతినిధులుగా దక్కనులో స్థిరపడిన వారు సున్నీలు. వీరికి మతద్వేషం హెచ్చు. వీరినే దక్కనీలు అనేవారు.
బహమనీ సుల్తానుల కాలంలో ఈ రెండు వర్గాల మధ్య రాజకీయాధికారం కొరకు ఘర్షణలు జరుగుతుండేవి. హిందువులను బలవంతంగా ఇస్లాంలోనికి మార్చడానికి బహమనీ రాజుల కాలంలో పెద్ద ప్రయత్నాలేవీ జరగలేదు. ఐనా ఏనాడు ముస్లింల సంఖ్య, జనాభాలో 20 శాతానికి మించలేదు. ఢల్లీి సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఒక స్వతంత్ర రాజ్యంగా బహుమనీ రాజ్యం ఏర్పడటం తమకు మంచిదేనని ఓరుగల్లును పాలించిన కాపయ నాయకుడు భావించి, దూరదృష్టితో ఆ ప్రయత్నాన్ని బలపరిచాడు. గుల్బర్గా, ఓరుగల్లు రాజ్యాలు ఇరుగుపొరుగున సహజీవనం చేయగలవని ఆశించాడు.ఈ ఆశ కొద్ది కాలంలోనే భగ్నమైంది. పిమ్మట ఓరుగల్లు రాజ్యం బహమనీయుల వశమైంది.
బహమనీల కాలంలో తీవ్ర మతకల్లోలాలేవీ జరగలేదు. 1475లో దక్కనులో భయంకరమైన కరవు ఏర్పడగా దీన్ని ఆసరాగా తీసుకొని ఒరిస్సా రాజు తెలంగాణాపై దాడి సల్పాడు. మహమ్మద్‌షా బహమనీ ఈ దాడిని తిప్పి కొట్టి ఒరిస్సా రాజులకు తెలంగాణ విూద ఏ మాత్రం హక్కులేదని ఒక పత్రం వ్రాయించుకున్నాడు. తెలంగాణలో బహమనీ రాజుల పరిపాలన రెండు శతాబ్దాల వరకు కొనసాగింది. 1535లో బహమనీ రాజ్యం అయిదు ముక్కలైంది. గోలకొండ ప్రాంతాన్ని కుతు బ్‌షాహీలు వశపరచుకున్నారు. గోల కొండ రాజ్యమే ఆ పిమ్మట నిజాం రాజ్యమైంది.

కుతుబ్‌ షాహీల పాలన
కుతుబ్‌-షాహీల-పాలన1పదహారవ శతాబ్ది నుంచి పదిహేడవ శతాబ్ది చివరి వరకు గోలకొండ రాజధానిగా దక్కనును పాలించిన వారు కుతుబ్‌షాహీ నవాబులు. సుల్తాన్‌ కులీ ఈ వంశ స్థాపకుడు. బహమనీల కాలంలో వరంగల్‌ వరకే పరిమితమైన రాజ్యాన్ని ఇతడు రాజమహేంద్రవరం వరకు విస్తరించాడు. గోలకొండ నవాబులందరిలో ఇబ్రహీం కులీ కుతుబ్‌షా ప్రసిద్ధుడు. హైదరాబాద్‌ నగరంలో హుస్సేన్‌ సాగర్‌ చెరువు ఇతడే నిర్మించాడు. ఇతడు తెలుగు కవులను ఆదరించాడు. అద్దంకి గంగాధర కవి తన తపతీ సంవరణోపాఖ్యానాన్ని ఇబ్రహీంకు అంకితం చేశాడు. 1556లో విజయనగర సామ్రాజ్యం పతనమైనది. దీనికి ఇబ్రహీం కుతుబ్‌షాయే ప్రధాన కారకుడు.

గోలకొండ నవాబులందరిలో ప్రజాభిమానం పొందినవాడు అబుల్‌ హసన్‌ తానీషా. అతని కాలంలోనే గోలకొండ రాజ్యం పతనం కావడం విధి వైపరీత్యం. అబుల్‌ హసన్‌ మాదన్నను ప్రధానమంత్రిగా నియమించాడు. అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ దండ యాత్రల అనంతరం 300 సంవత్సరాల కాలంలో ఒక ముస్లిం రాజ్యంలో హిందువును ప్రధానమంత్రిగా నియమించడం ఇదే మొదటిసారి.
1686 మార్చి 21వ తేదీన అక్కన్న, మాదన్నల హత్య జరిగింది. మొగలుల ముట్టడి 1687 ఫిబ్రవరి 7న ప్రారంభమై ఏడు నెలల పదిహేను రోజులు సాగింది. తానీషా పట్టుబడ్డాడు. 1696లో దౌలతాబాద్‌ కోటలో బందీగా అతడు చనిపోయాడు.

గోలకొండ-నవాబులందరి1గోలకొండ నవాబులు మూర్తీభవించిన తెలుగుదనాన్ని ప్రదర్శించారు. కంచర్ల గోపన్న, భద్రాచల శ్రీరామాలయాన్ని పునరుద్ధరించి అనేక అమూల్య ఆభరణాలు తయారు చేయించాడు. ఆనాటి నుంచి ఈ నాటి వరకు సర్కారు సొమ్ముతో ప్రతి యేటా శ్రీరామ కళ్యాణోత్సవం జరుగుతుంది. శ్రీరాముడు జన్మించిన క్షేత్రమైన అయోధ్య కంటే ఆయన వనవాస తీర్థం, భద్రగిరి ఆనాడు గొప్ప క్షేత్రాలు. కుతుబ్‌షాహీ ప్రభువులు స్థానిక చరిత్రను గౌరవించారు. కుతుబ్‌షాహీ నవాబులందరూ సాహిత్య ప్రియులే, ఫార్సీ, ఉర్దూ, తెలుగు భాషా సంగమంగా వర్థిల్లింది గోలకొండ. పొన్నగంటి తెలగనార్యుడు ‘యయాతి చరిత్ర’ అనే అచ్చ తెనుగు కావ్యం రచించి ఇబ్రహీం సేనాని అవిూన్‌ఖాన్‌కి అంకితమిచ్చాడు. కవితలకు పుట్టిల్లు మరింగంటి వారి యిల్లు, మరింగంటి సోదరులలో అగ్రేసరుడు సింగరాచార్యుడు. ఇతడు రామకృష్ణ విజయమనే ద్వ్యర్థికావ్యాన్నీ, నలయాదవ రాఘవ పాండవీయం అనే నాలుగర్ధాల కావ్యాన్ని, పెక్కు శతకాలను రచించి ఇబ్రహీం పాదుషా సత్కారాలను పొందాడు. సుప్రసిద్ధ వాగ్గేయకారుడైన క్షేత్రయ్య అబ్దుల్లా కుతుబ్‌షా ఆస్థానంలో గౌరవాదరాలు పొందాడు.దక్కను సుల్తానులు స్వతంత్ర శిల్పశైలిని సృష్టించారు. వీరి సమాధులు వీరి శైలి చిహ్నాలు. చార్మినార్‌, మక్కామసీదు ` ఈ రెండు కట్టడాలు వీరి కాలం నాటి శిల్పకళా వైభవాన్ని వేనోళ్ళ చాటుతున్నాయి.

అసఫ్‌-జాహీ-1అసఫ్‌ జాహీ (నిజాం)ల పాలన
అఖిలాంధ్రదేశాన్ని పాలించిన చివరి రాజ వంశం ఆసఫ్‌జాహీ నిజాం నవాబులది. దక్కునుకు సుబేదారుగా ఉన్న నిజాం ఉల్‌ముల్క్‌ 1724 అక్టోబర్‌ 11న స్వతంత్రించి ఆసఫ్‌జాహీరాజ్యాన్ని స్థాపించాడు. ఔరంగాబాద్‌ దక్కను రాజధాని. ఆ నాటికి నిజాం రాజ్యం ఉత్తరాన నర్మదానది వరకు, దక్షిణాన కర్నాటక వరకు తూర్పు ` పడమర సముద్రాల వరకు వ్యాపించి ఉంది. మొదటి నిజాం తరువాత రాష్ట్రంలో 14 సంవత్సరాలు అరాచకమే రాజ్యమేలింది. నాసిర్‌జంగ్‌, ముజఫర్‌జంగ్‌, సలాబత్‌ జంగ్‌ల పరిపాలన అంటే బ్రిటిష్‌, ఫ్రెంచ్‌ వారి పోరాటాలే అన్నమాట. నిజాం నాల్గవ కుమారుడు నిజాం అలీఖాన్‌ 1761లో రాజ్యానికొచ్చి సుస్థిరపాలనకు దారి వేశాడు. ఇతని కాలంలో సర్కార్లు, సీడెడ్‌ జిల్లాలు చేజారి పోయాయి.

ఉస్మాన్‌-అలీఖాన్‌-బహద్దూర్‌1ఏడవ నిజాం ` ఉస్మాన్‌ అలీఖాన్‌ బహద్దూర్‌
ఏడవ నిజాం నవాబు విూర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1911లో రాజ్యానికొచ్చాడు. అతడు సమర్థుడు, పరిపాలన దక్షుడు. ఏటికి ఎదురీది రాజ్యం పొగొట్టుకున్నాడు. నిజాం నవాబు ప్రజలకు ఏమాత్రం స్వాతంత్య్రం ఇవ్వలేదు. కొన్ని ప్రజాభ్యుదయకరమైన పనులు మాత్రం చేశాడు.
1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడిరది. మూసీనది వరదలు అరికట్టడానికి ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లు నిర్మించాడు. నిజాంసాగర్‌ నిర్మాణంతో ఏటా మూడు లక్షల ఎకరాలకు నీటి పారుదల వసతి కలిగింది. పాలేరు, వైరా, తుంగభద్ర, రాజోలిబండ, కడెం, మూసీ, మానేరు ప్రాజెక్టులు నిజాం నవాబు నిర్మించినవే. ఈ ప్రాజెక్టులు నిర్మించిన ఇంజనీరు అలీనవాజ్‌ జంగ్‌ బోధన్‌లో నిర్మించిన నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోనే పెద్దది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆస్పత్రి, స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ, హైకోర్టు, అసెంబ్లీ భవనాలు అప్పటి నిజాం కట్టించినవే.

Untitled-1హైదరాబాద్‌ సంస్థానం వైశాల్యం 82,168 చదరపు మైళ్లు. ఉర్దూ అధికార భాష. జనం ఎక్కువగా ఉర్దూనే వ్రాసేవారు. అయినా ప్రజలలో మాత్రం అది వేళ్ళూను కోలేదు. ప్రాంతీయంగా తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు చెలామణి అయ్యేవి. జనాభాలో హిందువులు అధికభాగం అయినా, ప్రభుత్వోద్యోగాలు 75 శాతం ముస్లింలే ఆక్రమించుకున్నారు. పెద్ద షావుకార్లు, వ్యాపారస్తుల చేతుల్లో సామాన్యులు ఆర్థికంగా చితికిపోయారు.

సంస్థానానికి మంత్రి మండలి ఉండేది. దానికి అధ్యక్షుడు ఉండేవాడు. ఆయనే దరిమిలా ప్రధానమంత్రిగా చెలామణి అయ్యాడు. ఉన్నతోద్యోగాల నియామకాలకు ఓ సివిల్‌ సర్వీసు ఉండేది. మంత్రులను ప్రజలు ఎన్నుకునేవారు కాదు. చురుకైన అధికారులనే మంత్రులుగా నియమించేవారు. పోలీసు, రెవెన్యూ శాఖలు యూరోపియన్ల ఆధీనంలో ఉండేవి కాదు. కరెన్సీ, నాణాలు పోస్టల్‌, రైల్వే, పోలీసు, సైన్యం, సివిల్‌ సర్వీసు వంటి వాటిలోనూ భారత ప్రభుత్వానికి జోక్యం లేదు. అన్నీ సంస్థానానికి ప్రత్యేకంగా ఉండేవి. అందుకే నిజాం సంస్క ృతి అనే ప్రత్యేక పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. సంస్థానంలో ప్రత్యేక వాతావరణం కనిపించినప్పటికీ అది అలౌకికమైనదేవిూ కాదు. హిందూ ` ముస్లింలలో సామరస్య ధోరణి కొనసాగేది. వారు పండుగలు కలిసికట్టుగా జరుపుకునేవారు.

రిపాలనకు సంబంధించినంత వరకు నిజాం మొదట్లో ఖచ్చితంగా నిష్ప క్షపాతంగా వ్యవహరించేవాడు. మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముసల్మీన్‌ అనే మత పక్షం రాజకీయాలను కలుషితం చేయనారంభించే వరకు ఆయన అలాగే ఉన్నాడు. అంతటితో సామరస్య పూరితమైన నిజాం ప్రత్యేక సంస్కృతి అంతరించిందని చెప్పవచ్చు. ఆ రోజుల్లో ఆంధ్రులకు ప్రాతినిధ్యం వహించే పెద్ద సంస్థ ఆంధ్రమహాసభ ఒక్కటే. అది నిజంగా కాంగ్రెస్‌కు పూర్వ సంస్థ అని చెప్పవచ్చు. హైదరాబాద్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ సంస్థ ఆవిర్భావానికి ఆది మూల వ్యవస్థగా పనిచేసింది.
పోలీసు చర్య తర్వాత 1951`52లో హైదరాబాద్‌ రాష్ట్రంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. బూర్గుల రామ కృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే హైదరాబాద్‌ రాష్ట్రపు తొలి, తుది ప్రజా ముఖ్యమంత్రి. అంతకు ముందు ముఖ్యమంత్రులను నిజాం ప్రభుత్వమో, కేంద్ర ప్రభుత్వమో నియమించేది. రామకృష్ణ్ణారావు గారి హయాంలో హైదరాబాద్‌ రాష్ట్రంలో సంపూర్ణమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నెలకొన్నది. భారతదేశంలో అభ్యుదయకరమైన కౌలుదారీ శాసనం చేయబడిరది. జాగీర్దారీ రద్దు సమస్యతో మొదలైన ఫ్యూడల్‌ ప్రతికూల సమాజ స్థాపన కౌల్దారీ శాసనంతో ముందుకు పోయింది. నాగార్జున సాగర్‌ నిర్మాణానికి రామకృష్ణారావు చాలా పట్టుదల వహించి సానుకూలం కావడానికి తోడ్పడ్డారు.

రాష్ట్రంలో విద్యకు చాలా ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా దేశ భాషలకు చాలా దోహదం కలిగించారు. జిల్లాకు ఒక్కొక్క కళాశాల ఉండేలా ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణా ప్రాంత విద్యాభివృద్ధిలో గొప్ప మలుపు అనవచ్చు. స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంపూర్ణ ప్రజాస్వామ్య స్వరూపం బూర్గుల కాలంలోనే ఇవ్వడం జరిగింది. ఆయన హయాంలో అనేక నూతన శాసనాలు, ఉద్యమాలు తలెత్తాయి. 1956 నవంబర్‌లో 1వ తేదీన తెలంగాణా ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో విలీనమై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రూపంలో 58 సంవత్సరాలు కొనసాగింది. 2014 జూన్‌ 2న ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంగా ఏర్పడిరది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు.

Other Updates