magaపల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్ముడు అన్నాడు. అంటే,పల్లెల్లో వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ వృత్తులు సుసంపన్నంగా వున్ననాడే పల్లెలు కళకళలాడతాయి. అప్పుడే పల్లెలు దేశానికి పట్టుకొమ్మలవుతాయి. ఆనాడు మహాత్ముడు అన్న మాటను అకూజురసత్యంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ఈనాడు. రైతు సంక్షేమంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేస్తూ గ్రామీణ కులవృత్తులకు పని కల్పించే విధంగా అనేక ప్రణాళికలను రూపొందిస్తూ ముందుకు సాగుతున్నారు. మానవ వనరులంటే కంప్యూటర్ల ముందు కూర్చునేవారే కాదని, గ్రామీణ ఆరిశీవక వ్యవసశీవను పరిపుష్టం చేసేవారేనని మన ముఖ్యమంత్రి అంటున్నారు.

దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటితం చేసే దిశగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూసేందుకే రైతు సమన్వయ సమితులు ఏర్పాటుచేస్తున్నామని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ఇవి రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టే లక్ష్యంగా గొర్రెల పంపిణీ, చేపల పెంపకాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు రూపొందించామని ముఖ్యమంత్రి అన్నారు. పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అధ్యక్షతన నెక్లెస్‌రోడ్డులో నిర్వహించిన సంచార పశువైద్యశాలల వాహనాల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. సంచార పశువైద్యశాలల వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ముఖ్యమైన వ్యక్తి రైతు. రైతు బాగుంటే అతని చుట్టూ ఉండే అందరూ బాగుంటరు. ప్రధానంగా రైతులకు కావాల్సినవి పెట్టుబడి,సాగునీరు, కరెంటు, మార్కెట్‌ వసతి. ప్రభుత్వం వీటన్నింటిపై దృష్టిపెట్టింది. నేను ఎన్నికల ప్రచా రంలో పాల్గొన్న వంద సభలల్ల చెప్పిన. నన్ను గెలిపించి సీఎం ను చేసినా కరెంటు తొందరగా ఇవ్వలేను.. రెండు మూడేండ్లు పడుతది అని. కానీ అధికారుల కషి,భగవంతుడి దయతో ఆరు నెలల్లోనే కరెంటు కష్టాలు పోయినయి. ఇదివరకు వున్న జనరేటర్లు, కన్వర్టర్ల దుకాణాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు తెలంగాణలో కరెంటు వస్తే కాదు.. కరెంటు పోతే వార్త. పాత నల్లగొండ జిల్లా సంస్థాన్‌ నారాయణపూర్లో మాకు 24 గంటల కరెంటు వద్దంటూ రైతులు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది.

ఒక రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.45వేల కోట్లు ఖర్చు చేయడమనేది దేశ చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించని విధంగా, ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెట్లో రూ.25వేల కోట్లు కేటాయించాం. మరో రూ.20వేల కోట్లు బ్యాంకుల సహకారంతో అప్పుగా తీసుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రాజెక్టుల నిర్మాణానికి మొత్తంగా రూ.45వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. కేంద్రం సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించే దానికంటే ఇది ఎక్కువ. రాజకీయ పార్టీలు కొన్ని ఈర్షతో కోర్టుల్లో కేసులు వేస్తున్నాకూడా,వాటిని విజయవంతంగా అధిగమిస్తూ వేగంగా పనులను పరుగెత్తిస్తున్నాం. వచ్చే ఏడాదిలో కాళేశ్వరం నీళ్లు ఏడు జిల్లాలకు వచ్చే అవకాశముంది. ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు,పాలమూరు ప్రాజెక్టు,తొందరగానే పూర్తికాబోతున్నాయి.

మేము ఏర్పాటు చేసే రైతు సమితులను ఆపాలని కొన్ని పార్టీలోళ్లు కోర్టుకు వెళ్ళారు. ఇది విపరీత ధోరణి. ప్రభుత్వం కమిటీలు వేస్తే.. వాటికి ప్రత్యామ్నాయంగా మేము కూడా కమిటీలు వేస్తామని కొన్ని పార్టీలోళ్లు అంటున్నారు. వాళ్లకు దేవుడు ఏం తెలివి ఇచ్చిండో వాళ్లకే తెల్వాలే. ఎక్కడైనా ప్రభుత్వం కమిటీలు వేస్తుంది. కానీ ప్రతిపక్షాలు కమిటీలు వేస్తామంటే జనం నవ్వుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ కమిటీలువేశారు. మరి మా కమిటీలు తప్పు అయితే మీరు వేసిన కమిటీలు ఎట్లా రైట్‌ అని నేను అడుగుతున్నా. ఆదర్శ రైతులంటూ మోటర్‌ మెకానిక్‌లను, ఆటో డ్రైవర్లను వేశారు. కాబట్టి.. అన వసరంగా ప్రతిపక్ష నాయకులు రాద్ధాంతానికి పోయి, ప్రగతి నిరోధకులుగా మారకండి.

రైతులకు రెండు పంటలకు కలిపి, ఒక ఎకరానికి రూ.8వేల చొప్పున వచ్చే మే నెల నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయబోతున్నాం. దీంతో రైతులకు పెట్టుబడి సమస్య కూడా పోతుంది. ఈ రోజుల్లో చెత్తకుప్పలల్ల ఇనుప ముక్కలు ఏరుకునే వాళ్లకూ సంఘాలున్నాయి. సంఘం లేని వాళ్ళు ఒక్క రైతులే. రైతులను సంఘటితం చేసేందుకే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల హెలికాప్టర్లో రోజుకు ఏడెనిమిది జిల్లాలు తిరుగుతూ సమన్వయ సమితుల ఏర్పాటు గురించి వివరించి వచ్చారు. నేను చెప్పేది ఒక్కటే. రైతు సంఘాలకు ఏమీ అధికారాలు లేవు. వారు ఇతరుల హక్కులేవీ హరించడం లేదు. ప్రభుత్వానికి రైతులకు మధ్య వారు వారధిగా ఉంటారు. రైతులకు కనీస గిట్టుబాటు ధర తెచ్చేందుకు, రైతులను సంఘటితం చేసేందుకు ఈ సంఘాలు కృషి చేస్తాయి.

అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీ పార్టీలకు రైతులకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన కలలో రాలేదు. రైతులను రైతులుగానే చూడలేదు ఏనాడు. నేను పెట్టుబడి పథకం ప్రకటించిన తర్వాత మాజీ ప్రధాని దేవెగౌడ నన్ను వారం రోజులపాటు అడిగారు. నేను సీఎంగా చేశా. ప్రధానిగా చేశా. కానీ పెట్టుబడి పథకం ఆలోచన నాకు రాలేదు. దేశ రైతుల తరఫున మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. చంద్రశేఖర రావుగారూ.. నేను హైదరాబాద్‌ వస్తా. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అభినందిస్తా అంటే. వద్దు సార్‌.. మీరు పెద్దలు, మాజీ ప్రధాని. మిమ్మల్ని రప్పించుకుంటే నాకు గర్వం ఉన్నట్లవుతుంది. నేనే బెంగళూరు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటా అని చెప్పిన.

భారత్‌లోనే తొలిసారిగా సంచార పశువైద్యశాలలు

వంద సంచార పశువైద్యశాలలు ఒక్కోటి రూ.14.65 లక్షల ఖర్చుతో ఏర్పాటుచేశాం,ఇది దేశంలో ఎక్కడా లేదు. పాడిపశువులకు జబ్బుచేస్తే రైతులు ఒక్క ఫోన్‌ కొడితే డాక్టర్లే అధునాతన వసతులతో ఉన్న ఈ సంచార పశువైద్య శాలలతో వస్తారు. అత్యవసర సమయంలో మందులు సైతం అందుబాటులో ఉంచుతున్నాం. రైతులు ఫోన్‌ చేస్తేనే వెళ్లి వైద్యం చేయడమే కాకుండా,నియోజకవర్గానికి ఇన్ని ట్రిప్పులు అని తిరిగేలాగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేశ్‌చందా ప్రణాళిక తయారు చేసుకోవాలి. దీనివల్ల ఎక్కువ సేవలు అందుతాయి. పశువుల పెంపకం వృత్తిగా ఉన్న రైతులను, యాదవులను అభినందిస్తున్నా. పశుగణాభివద్ధికి ఈ కార్యక్రమం తోడ్పడాలని. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నా.

ఇండియా టుడే మ్యాగజైన్‌ ఎడిటర్‌ అరుణ్‌పూరి నాతో మాట్లాడుతూ, మానవ వనరులను గుర్తించడంలోనూ, వాటిని అభివృద్ధి పరచడంలో మీరు సరికొత్త ట్రెండ్‌ సృష్టించారని అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది యాదవ సోదరులున్నా.. రోజుకు 650 లారీల గొర్రెలను దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటు. పాడిపశువులను పెంచే రైతులు ఎక్కువగా వున్నా రోజుకు 8 లక్షల లీటర్ల పాలను కర్ణాటక, గుజరాత్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఒక రకంగా ఇది కూడా సిగ్గుచేటే. మన రాష్ట్రంలోని గ్రామీణ ఆర్థికవ్యవస్థను పరిపుష్టం చేసుకునే శక్తి వున్నా కూడా సమైక్య పాలనలో మనకు ఈ పరిస్థితి దాపురించింది. ఇప్పుడు మనల్ని మనం పాలించుకుంటున్నాం కాబట్టి తెలంగాణలో పాడి, పంటలను అభివృద్ధి చేసుకోవాలి. హ్యూమన్‌ రిసోర్స్‌ అని ఇంగ్లిష్‌లో చెప్తే అంతా అదేదో కంప్యూటర్ల ముందు కూర్చునేవాళ్లు అనుకుంటరు. కానీ నిజానికి సంపద సృష్టించే వారు గ్రామీణ ప్రాంతాల్లో లక్షలమంది ఉన్నారు. వీరే మానవ వనరులు. అందుకే ప్రభుత్వం రూ.5వేల కోట్లతో గొర్రెల పంపిణీ పథకానికి ప్రాధాన్యం ఇస్తున్నది. కొందరు మూర్ఖంగా ఆలోచించే వాళ్లు అవహేళన చేసి మాట్లాడారు.

కానీ పథకం ప్రారంభించిననాటినుంచి రాష్ట్ర వ్యాప్తంగా 18.74 లక్షల గొర్రెలను పంపిణీ చేశాం. ఇది దేశంలోనే ఆల్‌టైం రికార్డని మా అధికారులు చెప్తున్నారు. 84 లక్షల గొర్రెలు తెచ్చి పంచుతామంటే కొందరు కండ్లు బైర్లు కమ్మి పడిపోయారు. చాలామంది నమ్మలేదు. కానీ నిజమైన చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం ఉంటే నిజం చేయవచ్చని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నాయకత్వంలో కలెక్టర్లు, పశుసంవర్ధకశాఖ అధికారులు చేసి చూపుతున్నారు. అదేవిధంగా మిగిలినవి పంచుతాం. మొత్తం ఏడు లక్షల మందికి యూనిట్లు పంపిణీ చేస్తాం. దేశానికి అవసరమైన మాంసాన్నే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతిచేసే స్థాయికి తెలంగాణ రావాలి. నాలుగేండ్ల తర్వాత దేశంలో ధనవంతులైన యాదవులు తెలంగాణలో ఉండాలన్నదే ఈ పథకం లక్ష్యమని అధికారులకు చెప్పా. గొర్రెల పంపిణీ పథకం విజయవంతంగా అమలుచేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, గొర్రెల అభివద్ధి సమాఖ్య ఛైర్మన్‌ రాజయ్యయాదవ్‌, పశుసంవర్ధకశాఖ అధికారులను అభినందిస్తున్నా. అదేవిధంగా చేపల పెంపకాన్ని రూ.వెయ్యి కోట్లతో పెద్ద ఎత్తున చేపడుతాం. దానికి ఈ ఏడాది 70కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తున్నాం. గతంలో హుస్సేన్‌సాగర్‌ కింద ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ధ్వంసం చేశారు. అటువంటి ఉత్పత్తి కేంద్రాలను పునరుద్ధరించడంతోపాటు ప్రతి రిజర్వాయర్‌ కింద చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటుచేయాలని అధికారు లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం అని సీఎం సీేఆర్‌ ప్రసంగించారు.

maga1962 నంబర్‌కు ఫోన్‌ చేసిన సీఎం కేసీఆర్‌

సంచార పశువైద్యశాలలు ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ 1962 నంబర్‌కు ఫోన్‌ చేసి సంచార పశువైద్య సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నవ్వులు వెల్లివిరిశాయి. 1962కు ఫోన్‌ చేసిన సీఎం కేసీఆర్‌.. మీరు ఎంతసేపట్లో ఇక్కడకు రాగలరు? అని అడిగారు. అందుకు సంచార పశువైద్య సిబ్బంది.. సర్‌, మేం 30 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటాం. చెప్పండి మీ పశువుకు ఏమయ్యింది? అని అడిగారు. ఇందుకు సీఎం కేసీఆర్‌ సరదాగా స్పందిస్తూ.. ఇక్కడ పశువులు ఏమీ లేవు.. అనడంతో అంతా పెద్దగా నవ్వుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ సంచార పశువైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు కే కేశవరావు, దత్తాత్రేయ, కొండా విశ్వేశ్వర్రెడ్డి, గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఛైర్మన్‌ రాజయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, గంప గోవర్ధన్‌, తీగల కృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్‌, పశుసంవర్ధకశాఖ కార్యదర్శి సురేశ్‌చందా, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Other Updates