శ్రీ దేవులపల్లి ప్రభాకరరావు


మూడేpragathi2ళ్లలో మునుపెన్నడూ లేని ప్రగతి-ఈ మాట వినగానే ”ఇది నిజమేనా” అన్న సందేహం కొందరికి కలగవచ్చు. కానీ, చూస్తున్నవాళ్ళకి ఇది అక్షరాల నిజమని స్పష్టమవుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి వింటున్నాం, చూస్తున్నాం క్రమంగా భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయని. కానీ, ఇటీవలి, నిన్న మొన్నటి వార్త తెలంగాణ రాష్ట్రంలో భూగర్భజలాల స్థాయి (లెవెల్‌) పెరుగుతున్నదని-ఇది మిషన్‌ కాకతీయ ఫలితం. నిండిన నీళ్ళతో కళకళలాడుతున్న చెరువులను, కుంటలను, ఇతర జల వనరులను చూసి అమిత ఆనందం పొందుతున్న చిన్న రైతులు, సన్నకారు రైతులు, పేద రైతులు, పెద్ద రైతులు పెన్నిధి లభించినట్లు పొంగిపోయి చాలా సంవత్సరాల తరువాత ఇప్పుడు యేటా రెండు పంటలను పండించడానికి సిద్ధమవుతున్నారు.

నీటి సమస్య లేదు, కరెంటు సమస్య లేదు, విత్తనాలు-ఎరువుల సమస్య లేదు, అప్పుల బాధ లేదు, బ్యాంకుల వాళ్ళొచ్చి జబర్దస్తీ చేస్తారన్న భయం లేదు, పశువుల మేత కొరత లేదు, అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి పరిస్థితి లేదు, ”ధర ఎవరు చెడగొట్టిండు అంటే రాత్రి ఉపాసం పన్నోడు” అన్న మాట ఇక వినిపించదు; వ్యవసాయం, వ్యవసాయంతోపాటు ఇతర గ్రామీణ వృత్తులు లాభసాటి వ్యాపారాలవుతున్నాయి. ”రైతే రాజు” అన్న మాటలను ఇప్పటి వరకు కొన్ని పాటల్లో మాత్రమే వినేవాళ్ళం. ఇప్పుడు ఆర్థిక, సామాజిక స్థోమత కారణంగా రైతుకు నిజంగా రాచఠీవి వస్తున్నది. నేటి ప్రజాస్వామ్యంలో రైతే రాజు అన్న పరిస్థితి వస్తున్నది; అంతేకాదు-”పట్టిందల్లా బంగారం” అంటారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలలో ఈరోజు పట్టిందల్లా బంగారమే! వ్యవసాయం చేసినా, ఇతర వృత్తులను చేపట్టినా, కోళ్లు-గొర్రెలు-చేపలు-మేకలు-ూరగాయలు-పండ్లు ఏవి పెంచినా పట్టిందల్లా బంగారమే. ఎవరూ (సిెఆర్‌, ఆయన అనుచరులు, సహచరులు, అభిమానకోటి మినహా) ఊహించని విధంగా, ఎన్నడూ లేని రీతిగా తెలంగాణ రాష్ట్రం స్వరూపం, విశేషించి తెలంగాణ గ్రామీణ ప్రాంతం స్వరూపం మారిపోతున్నది; ప్రపంచ ప్రఖ్యాత సర్జన్‌లు శస్త్రచికిత్స-ప్లాస్టిక్‌ సర్జరీ-అత్యంత నైపుణ్యంతో జరిపినా స్వరూపం ఇంతగా మారదు. అనతి కాలంలో, కొద్ది రోజుల్లో, తెలంగాణ నుంచి ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, బతుకుతెరువు కోసం పొట్ట చేతపట్టుకొని వలస వెళ్ళిన లక్షల మంది తిరిగి తమ జన్మ భూమిని చేరుకుంటే ఆశ్చర్యపడవద్దు. వలసలు ఆగిపోతే తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో శ్రామిక జనశక్తి గణనీయంగా హెచ్చుతుంది. తత్ఫలితంగా మన గ్రామీణ ప్రాంతంలో ఉత్పాదక శక్తి, ఉత్పత్తులు పెరగడానికి దోహదం కలుగుతుంది. ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన మంచినీటికి ఇక తెలంగాణ ప్రాంతంలో కొరత ఉండబోదు-మిషన్‌ భగీరధ ఫలితం.
pragathi
దాదాపు నూట ఎనభై సంవత్సరాల కిందట, 1838లో, మారుమూల బెంగాల్‌లో జన్మించిన బంకించంద్ర ఛటర్జీ తన దేశ ప్రజల్లో దేశభక్తిని రగిలించడానికి రచించిన ”ఆనంద్‌మఠ్‌” బెంగాలీ నవలలో ”వందేమాతరం” అద్భుత గీతాన్ని రచించారు. తన మాతృభూమి భారతదేశం శక్తిమంత స్వరూపాన్ని చిత్రిస్తూ, మాతృభారతికి వందనాలు అర్పిస్తూ రాసిన అజరామర గీతం అది. గత శతాబ్ధి ప్రారంభంలో, 1909లో, దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ సమర ప్రయోగాలు జరుపుతున్న గాంధీజీకి వందేమాతరం గీతం ఎంతో నచ్చింది. స్వతంత్ర భారతానికి ఇదే జాతీయ గీతం అని ఆయన అన్నారు. భారత స్వాతంత్య్ర జాతీయ ఉద్యమాలలో ఆసేతు హిమాచలం కోట్లమందిని కొదమసింగాలుగా మార్చి ఉత్తేజపరిచిన గీతం ఇది. బ్రిటిష్‌ పాలకుల, సంస్థానాధీశుల గుండెలలో ఈ గీతం దడ పుట్టించింది. ”వందేమాతరం, సుజలావ్‌ు సుఫలావ్‌ు మలయజశీతలావ్‌ు సస్యశ్యామలాం మాతరం…శ్యామలావ్‌ు సరళావ్‌ు సుస్మితావ్‌ు భూషితావ్‌ు ధరణీవ్‌ు భరణీవ్‌ు మాతరవ్‌ు….” సహస్ర సముద్రాల ఘాెష, ఉద్ఘోష ప్రతిధ్వనించే పదాలు ఇవి. నాడు బంకిం మహనీయుడు భావించిన, ఊహించిన, రూపించిన, శిల్పించిన ఈ ”సుజల సుఫల సస్యశ్యామల” భారతభూమి ఎక్కడ కన్పిస్తున్నది? నూతన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కనిపిస్తున్నదంటే అత్యుక్తి కాదు. ఇది యధార్థం. తాను స్మరించిన భారతం, తాను వందనం అందించిన భారతం ఇన్నాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నది కనుక బంకిం ఆత్మకు సంతృప్తి కలుగుతుంది.

మూడు సంవత్సరాలు చాలా తక్కువ వ్యవధి. భారత స్వాతంత్య్రం పిదప దాదాపు నాలుగు సంవత్సరాల సుదీర్ఘ చర్చల అనంతరం భారత రాజ్యాంగ నిర్ణయ సభ 1949 నవంబరు 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. భారత రాజ్యాంగం క్షణాలలో ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఆమోదముద్ర పడ్డ తరువాత మరో సంవత్సరానికి 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చింది. స్వతంత్ర భారతదేశం ఒక రిపబ్లిక్‌గా అవతరించింది. మరో రెండు సంవత్సరాలకు 1952 వేసవిలో దేశమంతటా మొదటి సాధారణ ఎన్నికలు (లోక్‌సభకు, రాష్ట్ర శాసన సభలకు) జరిగాయి. స్వాతంత్య్రం సిద్ధించగానే వెంటనే అన్ని సమస్యలు పరిష్కారం కాలేదు; పాత సమస్యలు అపరిష్కృతంగా మిగిలి

ఉండగానే కొత్త సమస్యలు వచ్చి పడ్డవి. ప్రణాళికాబద్ధ ఆర్ధిక, పారిశ్రామిక, వ్యవసాయక, సామాజిక, వైజ్ఞానిక విధానాలు రూపొందడానికి అప్పటి జాతీయ ప్రభుత్వ నాయకులు కొన్ని సంవత్సరాలు ఆలోచనలు జరపవలసి వచ్చింది. తత్ఫలితంగా, స్వాతంత్య్రానంతరం నాలుగు సంవత్సరాలకు ప్రధమ పంచవర్ష ప్రణాళిక రూపొంది అమలు లోనికి వచ్చింది. అది ూడా ఒక సమగ్ర ప్రణాళిక కాదు. అన్ని రంగాల అభివృద్ధికి అందులో సమాన ప్రాధాన్యం లభించలేదు.

స్వతంత్ర భారతం శైశవ దశలో ఎదుర్కొన్న సమస్యలతో పోల్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం అవతరించగానే ఎదుర్కొన్న సమస్యలు మరింత క్లిష్టమైనవి. తెలంగాణ రాష్ట్రం సునాయాసంగా, సులభంగా, అవలీలగా ఏర్పడలేదు; అరవై సంవత్సరాల పరాయి పాలనలో కనీస ప్రాథóమిక హక్కులను సైతం కోల్పోయి, దమననీతి దంష్ట్రల కింద నలిగి, అన్ని రంగాలలో దోపిడికి గురైన తెలంగాణ అనేక ఉద్యమాల ఫలితంగా (ముఖ్యంగా 2001 నుంచి పధ్నాలుగు సంవత్సరాల నిరంతర, నిర్విరామ మహత్తర

ఉద్యమ ఫలితంగా) ఒక రాష్ట్రంగా 2014 జూన్‌ 2 వ తేదీన అవతరించింది. తెలంగాణలో అదొక నూత యుగారంభం, శకారంభం. నాడు తెలంగాణ రాష్ట్రం ఎందుకన్నవాళ్ళే, తెలంగాణ ప్రజా ఉద్యమాలను అణచడానికి జరిగిన కుట్రలలో, ూహక, కుటిల యత్నాలలో సిగ్గు, లజ్జ లేకుండా భాగస్వాములై లబ్ధి పొందిన వాళ్ళే, తెలంగాణ

ఉద్యమకారులను, విశేషించి యువతీ యువకులను, విద్యార్థులను వందల సుేలు పెట్టి పోలీస్‌ స్టేషన్‌లలో, ఇతర స్థలాలలో చిత్రహింసలకు గురి చేసినవాళ్ళే, తెలంగాణ ప్రయోజనాలకు ఎన్నడూ విలువ ఇవ్వని వాళ్ళే, నాటి పాలకుల ఎంగిలి మెతుకులు నమిలిన వాళ్ళే ఈరోజు తెలంగాణ ప్రగతి రధానికి, సర్వతోముఖ అభ్యుదయ ప్రస్థానానికి ఏదో ఒక మిషతో అడ్డుపడుచున్నారు-ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని గగ్గోలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల అభ్యున్నతి, సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించని వాళ్ళు మూడు సంవత్సరాల తెలంగాణ ముందంజను చూసి ఓర్వలేక ఈర్ష్య, అసూయలతో కుములుతున్నారు. ఇదొక విచిత్ర పరిస్థితి.
pragathi-3
మూడు సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్రం అవతరణకు వారం రోజుల ముందు అప్పుడే ఢిల్లీలో (ంద్రంలో) ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణ ఏడు మండలాలను పొరుగు రాష్ట్రానికి కానుకగా ఇచ్చింది. మూడు సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర అవతరణ రోజే ఏర్పాటయిన తొలి తెలంగాణ ప్రభుత్వానికి చుట్టూ అన్నీ సమస్యలే-అధికారుల, ఉన్నతాధికారుల కొరత; రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన జరగకుండా మిగిలిన వికృత సమస్య; ఇప్పటికీ తేలని (ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో) ఉమ్మడి ఆస్తుల పంపకం సమస్య; మూడు సంవత్సరాలైనా ఇప్పటికీ రగులుతున్న కృష్ణా, గోదావరి నదీ జలాల, ప్రాజెక్టుల మంటలు; ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ తదితర అధికారాలన్నీ ఉమ్మడి గవర్నర్‌కు ఉండాలంటూ కొందరు చేసిన గగ్గోలు మరో సమస్య; రాజధాని హైదరాబాద్‌లో విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మరో వివాదం; తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఇప్పటికీ ఉమ్మడి హైకోర్టునే కొనసాగించడానికి పొరుగు పాలకులు కుట్రలు జరపడం వేరొక సమస్య; రాజధాని హైదరాబాద్‌లో ఇంటింటి సర్వే నిర్వహించి, అభివృద్ధి-సంక్షేమ పధకాలకు అవసరమైన సమాచారాన్ని శాస్త్రీయ రీతిలో సేకరించడానికి శైశవ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక వినూత్న కార్యక్రమంలో కొందరికి దయ్యాలు, భూతాలు కనిపించి కోర్టు క్కాెరు; గత మూడు సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి-సంక్షేమ పధకాలకు అడ్డంకులు కల్పించడానికి పదే పదే ఎవరు ఎన్నిసార్లు కోర్టుల క్కిె స్టే ఆర్డర్లు పట్టుకొచ్చినారో తెలుసుకోవడానికి ఒక శ్వేతపత్రం ప్రకటితం కావాలె.

ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరు ఎన్ని రీతుల అడ్డంకులు, అవరోధాలు, చిక్కులు కల్పించి రాక్షస ఆనందం పొందుతున్నా లెక్క చేయకుండా గట్టిగా నిలిచి తన లక్ష్యాల సాధన దిశలో ఒలంపిక్‌ పరుగులు తీసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, విశేషించి రాష్ట్ర ప్రభుత్వ మహారథసారధి సిెఆర్‌ నాయకత్వ పటిమను, మనోస్థయిర్యాన్ని, రాజకీయ విజ్ఞతను, పరిపాలనా దురంధరత్వాన్ని, అన్నింటికీ మించి ఆ మహానాయకుని మానవతా దృక్పధాన్ని, అపార ఔదార్యాన్ని ప్రత్యేకించి అభినందించవలసిన తరుణమిది. తెలంగాణ ప్రజాభిప్రాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న వారికి, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రస్థానాన్ని చూసి ఓర్వలేకపోతున్న వారికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు-భారత రాజ్యాంగం పేజీలను చింపేస్తూ, రాజ్యాంగం స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న వారికి ఈ హక్కు అసలే లేదు. ఉన్న బాటలో నడవడం సులభం, కొత్త బాటలు వేయడం కష్టం. భవిష్యత్తులో తరతరాలకు ఉపకరించే, సర్వతోముఖ అభ్యున్నతికి దోహదపడే వినూత్న పధకాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రాజమార్గాలు నిర్మిస్తున్నది. చరిత్రలో ప్రధమ పర్యాయం తమ అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నిలుపుకొని తెలంగాణ ప్రజలు తమ ప్రియతమ అధినేత నేతృత్వంలో

ఉజ్వల భవిష్యత్తు దిశలో పురోగమిస్తున్నారు. మనిషికి మనిషికి మధ్య చిచ్చుపెట్టే విద్వేషపూరిత విధానాలను త్యజించి, మనసుకు మనసుకు మధ్య శాశ్వత సేతువులు నిర్మించే ఒక ప్రగతిశీల, ఆదర్శ రాష్ట్ర నిర్మాణం కోసం సిెఆర్‌ ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుంచి అ¬రాత్రాలు కృషి జరుపుతున్నది. ఇది నిరుపమాన కృషి. ఆర్థిక, సామాజిక అభ్యున్నతితో పాటు అధ్యాత్మిక వికాసం అత్యావశ్యకమని గాఢంగా విశ్వసించిన ప్రభుత్వం ఈ దేశంలో సిెఆర్‌ ప్రభుత్వం ఒక్కటే. మూడేళ్ళు విజయవంతంగా నిండుతున్న చరిత్రాత్మక శుభసందర్భాన తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ పతాకాన్ని ఆవిష్కరించడం మరింత శుభసూచికం.

Other Updates