హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ద్వారా షటిల్‌ సర్వీసులను బి.ఆర్‌.కె. భవన్‌ నుండి ప్రారంభించడం వల్ల ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జి.ఎ.డి) అధర్‌ సిన్హా అన్నారు. బి.ఆర్‌.కె.భవన్‌లో ఎస్‌.వి.ఐ.డి.ఎ సంస్థ ఏర్పాటు చేసిన షటిల్‌ సర్వీసులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్‌.కె.జోషి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జి.ఎ.డి) అధర్‌ సిన్హా మాట్లాడుతూ, బి.ఆర్‌.కె. భవన్‌ నుండి సచివాలయ ఉద్యోగులు మెట్రో స్టేషన్‌కు త్వరగా చేరుకోవడానికి ఈ సర్వీసులు ఎంతో సౌకర్యంగా

ఉంటాయని, ఉద్యోగస్థులు ఈ సేవలను సద్వినియోగపర్చుకోవాలన్నారు. ఈ బస్సు సర్వీసులు ఉదయం 8.30 నుండి 11.00 గంటల వరకు, సాయంత్రం 5.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు ప్రతి పదిహేను నిమిషాల వ్యవధిలో బస్సు సౌకర్యం ఉంటుందని తెలిపారు.

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.వి.ఎస్‌ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో భాగంగా 40 మెట్రో స్టేషన్ల లో 160 బస్సుల ద్వారా ప్రతి రోజు 1000 ట్రిప్పుల ద్వారా దాదాపు పది వేల మందికి సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. ”ఫస్ట్‌ మైల్‌ – లాస్ట్‌ మైల్‌” కనెక్టివిటి లో భాగంగా లకిడికాపూల్‌ మెట్రో రైల్‌ స్టేషన్‌ నుండి బి.ఆర్‌.కె.ఆర్‌ భవనంకు, బి.ఆర్‌.కె.ఆర్‌ భవనం నుండి లకిడికాపూల్‌ మెట్రో రైల్‌ స్టేషన్‌ కు ఈ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Other Updates